మాచిరాజు చిత్రాలు మాట్లాడతాయి : త్రివిక్రమ్
ఒంగోలు మెట్రో: ‘ఆయన కళాఖండాలు మాట్లాడుతాయి. ఆధ్యాత్మిక చైతన్యంతో తొణకిసలాడుతాయి’ అని ప్రముఖ సినీ దర్శకుడు, రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నారు. ఒంగోలుకు చెందిన ప్రఖ్యాత చిత్రకారులు, వైద్యుడు డాక్టర్ మాచిరాజు రామచంద్రరావు వేసిన కళాకృష్ణ చిత్రాలను సోమవారం సాయంత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ సందర్శించి ప్రశంసించారు. లాయరుపేటలోని రామచంద్రరావు నివాసంలో ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీని త్రివిక్మ్మŠఆయన తిలకించి ప్రశంసించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 72 మేళకర్తల రాగాలను తన కళా నైపుణ్యంతో చిత్రరూపంలో అందించిన మాచిరాజు అభినందనీయులన్నారు. ప్రతిచిత్రం ద్వారా సమాజానికి కళారంగానికి ఉన్నత సందేశాన్ని ఇచ్చారన్నారు. అటు వైద్యునిగా, ఇటు చిత్రకారుడిగా సవ్యసాచిలా ఆయన నిర్వహిస్తున్న పాత్ర అందరికీ ఆదర్శమన్నారు. ఇలాంటి కళాకారులను ప్రభుత్వాలు గుర్తించి అవసరం, తద్వారా చిత్రకళా రంగ ఉన్నతికి చేయూతనివ్వాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. కార్యక్రమంలో చిత్రకారులు డాక్టర్ మాచిరాజు రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.