Mad Men
-
పిచ్చోడి వీరంగం.. రోడ్డుపై, ఆస్పత్రిలో రచ్చ రచ్చ
గుత్తి: గుత్తిలో మతిస్థిమితం లేని వ్యక్తి వీరంగం సృష్టించాడు. అతను విసిరిన రాయి తగిలి ఎన్టీపీసీ ఉద్యోగి తీవ్రంగా గాయపడ్డాడు. తర్వాత అతన్ని స్థానికులు చితకబాదగా గాయాలు కావడంతో గుత్తి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ కూడా వీరంగం సృష్టించాడు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. పామిడి మండలం పాల్యం తండాకు చెందిన మునినాయక్ గుత్తి సమీపంలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్టీపీసీ) సబ్ స్టేషన్లో టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. సోమవారం ఉదయం స్వగ్రామం నుంచి బైక్‌పై సబ్‌స్టేషన్‌కు బయలుదేరారు. గుత్తి శివారులోని ఎస్కేడీ ఇంజినీరింగ్ కళాశాల వద్దకు చేరుకోగానే ఓ పిచ్చోడు అకారణంగా విసిరిన రాయి మునినాయక్‌ను బలంగా తాకింది. దీంతో బైక్ అదుపు తప్పి రోడ్డుపై పడిన ఆయన తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే గుత్తి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో వీరంగం..: ఎన్టీపీసీ ఉద్యోగిపై దాడి చేసిన పిచ్చోడిని స్థానికులు చితకబాదారు. అనంతరం గాయపడిన అతన్ని గుత్తి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు, స్టాఫ్‌నర్సులు చికిత్స చేస్తుండగా అతను మరోసారి రెచ్చిపోయాడు. సెలైన్ స్టాండ్ తీసుకుని వైద్య సిబ్బందిపై దాడికి యత్నించడంతో అంతా చెల్లాచెదురయ్యారు. అద్దాలను ధ్వంసం చేశాడు. అతి కష్టంపై కొందరు యువకుల సాయంతో పోలీసులు అతన్ని పట్టుకుని, కాళ్లూచేతులు కట్టేసి చికిత్స చేయించారు. అతని వివరాలు రాబట్టేందుకు పోలీసులు విశ్వప్రయత్నం చేశారు. తనది హైదరాబాద్ అని మాత్రమే చెప్పి, ఆ తర్వాత కేకలు వేస్తూ దాదాపు ఐదు గంటల పాటు ఆస్పత్రిలో వీరంగం సృష్టించాడు. -
పిచ్చోడు.. చంద్రబాబు ఇద్దరూ ఒక్కటే
సాక్షి, తిరుపతి : పిచ్చోడి చేతిలో రాయి, చంద్రబాబు చేతిలో మైకు ఒక్కటేనని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తెలిపారు. మంగళవారం ఆమె తిరుపతిలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పిచ్చోడి చేతిలో రాయి ఉంటే ఎటు విసురుతాడో తెలీదని, అదే తీరులో చంద్రబాబు చేతిలో మైక్ ఉంటే ఏం మాట్లాడుతాడో ఎవరికీ తెలియదంటూ ఎద్దేవా చేశారు. వెంకన్న సాక్షిగా బీజేపీతో దోస్తీ చేసిన బాబు, తన మాటలను మాత్రం ఎందుకు ప్రదర్శించలేదని నిలదీశారు. ప్రస్తుతం చంద్రబాబు మాటలు నమ్మే స్థితిలో ఎవరూ లేరని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో అవినీతిపై సీబీఐతో విచారణ చేయిస్తే చంద్రబాబు, లోకేష్‌లు ఊచలు లెక్కబెడతారని రోజా అన్నారు. కుట్ర రాజకీయాలపై పేటెంట్ రైట్ సీఎం చంద్రబాబుదే అన్నారు. బీజేపీతో అనుబంధాన్ని వదులుకున్నామన్న బాబు టీటీడీ బోర్డులో బీజేపీ మంత్రి భార్యను ఎలా నియమించారు? సుజనా చౌదరిని అరుణ్ జైట్లీ దగ్గరకు ఏ లాలూచీ కోసం పంపారు?. గవర్నర్‌తో గంటన్నర సేపు భేటీ అయి ఏ లాలూచీ చేశారంటూ టీడీపీపై ప్రశ్నల వర్షం కురిపించారు. -
మతిస్థితిమితం లేని వ్యక్తి దాడి
సంతబొమ్మాళి: మండలంలోని నౌపడలో మతిస్థిమితం లేని వ్యక్తి శుక్రవారం దాడి చేయడంతో ఇద్దరు గాయపడ్డారు. తన చేతిలో ఉన్న రాయిని విసరడంతో నౌపడ గ్రామానికి చెందిన పుచ్చకాయల రాజేష్ తలకు తీవ్రగాయమవగా, నందిగాం గ్రామానికి చెందిన పొందల షణ్ముఖరావుకు స్వల్ప గాయమైంది. తీవ్రంగా గాయపడిన రాజేష్‌ను నౌపడ పీహెచ్సీలో ప్రథమ చికిత్స చేసి టెక్కలి ఆస్పత్రికి తరలించారు. మతిస్థిమితం లేని వ్యక్తిని నౌపడ పోలీసులు పట్టుకుని స్టేషన్‌కు తరలించారు. అక్కడ ఆ వ్యక్తికి గుండు చేయించి వస్త్రాలు మార్చి సపర్యలు చేశారు. దాడి చేసిన మతిస్థిమితం లేని వ్యక్తి -
మీరు మ్యాడ్ మెన్ కావద్దు!
కొత్త పుస్తకం: మై హజ్బెండ్ డజన్ట్ లవ్ మీ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, మరొక అమ్మాయితో ప్రేమాయణం సాగించడాన్ని చాలా గొప్పగా భావిస్తారు కొందరు మగాళ్లు. భర్త వేరొక అమ్మాయితో ఎఫైర్ సాగిస్తున్నాడని భార్యకు తెలిసిన రోజు ఇంట్లో రచ్చ రచ్చ అవుతుంది. ‘అలాంటిదేమీ లేదు’ అని బుకాయించాలని చూసినప్పటికీ భార్యాభర్తల మధ్య ప్రేమ స్థానంలో ‘అనుమానం’ అనే పెనుభూతం పెద్ద కుర్చీ వేసుకొని కూర్చుంటుంది. ఒకే ఇంట్లో ఉండి కూడా రెండు వేరు వేరు దీవుల్లో ఉన్నట్లుగా ప్రవర్తిస్తారు...ఇలాంటి సమస్యలను తన పుస్తకంలో లోతుగా విశ్లేషించారు ఆండ్రూ జి. మార్షల్. ఇటీవల విడుదలైన ‘మై హజ్బెండ్ డజన్ట్ లవ్మీ’ పుస్తకంలో భార్యాభర్తలకు ఉపకరించే కొన్ని విషయాలు... ఆయనకు వేరే స్త్రీతో సంబంధం ఉందనే విషయం తెలిసినప్పుడు...మీ కడుపులో ఎన్నో అగ్నిపర్వతాలు రగులుతుంటాయి. అంతమాత్రాన ఆవేశమే సమస్యకు పరిష్కారం కాదు. ‘‘నేను మీకు నచ్చలేదేమో’’ అని సారీ చెప్పండి. మగవాడు పశ్చాత్తాపంతో బాధపడతాడు. మారిపోతాడు. సంసారంలో ‘పారదర్శకత’ అనేది ముఖ్యం. ‘రహస్యం’ అనేది శత్రువు. సమస్యకు ‘పరిష్కారం’ గురించి ఆలోచించాలి తప్ప ‘ప్రతీకారం’ గురించి ఆలోచించవద్దు. భార్య ఎప్పుడూ ఏదో ఒకటి అంటుందనే సాకుతో...సంతోషాన్ని, శాంతిని బయట వెదుక్కోవడం మానేయాలి. టీవి షో ‘మ్యాడ్ మెన్’లో మాదిరిగా మగాళ్ల సంబంధాలన్నీ పనిచేసే స్థలంలోనే మొదలవుతాయి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రతి స్నేహం ప్రేమ కాదు. సంబంధం అంతకంటే కాదు.మౌనంగా ఉండి శత్రుత్వాన్ని పెంచుకోవడం కంటే, తగాదా పడైనా సరే సమస్యను పరిష్కరించుకోవడమే మేలు. ఎవరి వాదన వారు వినిపించుకోవచ్చు. అపోహలను తొలగించుకోవచ్చు. మోసం చేసే మగాడిలో ‘మోసం’ శాశ్వతం కాదు. ప్రేమతో అతడిని జయించవచ్చు. ప్రతి నిరాశలోనూ ఒక ఆశ ఉంటుంది. ఇద్దరి మధ్య దూరం పెరిగినంత మాత్రాన ఇక ఎప్పుడూ దగ్గరవ్వరనికాదు...ప్రయత్నిస్తే కలవడం కష్టమేమీ కాదు.