
మతిస్థిమితం లేని వ్యక్తి
సంతబొమ్మాళి: మండలంలోని నౌపడలో మతిస్థిమితం లేని వ్యక్తి శుక్రవారం దాడి చేయడంతో ఇద్దరు గాయపడ్డారు. తన చేతిలో ఉన్న రాయిని విసరడంతో నౌపడ గ్రామానికి చెందిన పుచ్చకాయల రాజేష్ తలకు తీవ్రగాయమవగా, నందిగాం గ్రామానికి చెందిన పొందల షణ్ముఖరావుకు స్వల్ప గాయమైంది.
తీవ్రంగా గాయపడిన రాజేష్‌ను నౌపడ పీహెచ్‌సీలో ప్రథమ చికిత్స చేసి టెక్కలి ఆస్పత్రికి తరలించారు. మతిస్థిమితం లేని వ్యక్తిని నౌపడ పోలీసులు పట్టుకుని స్టేషన్‌కు తరలించారు. అక్కడ ఆ వ్యక్తికి గుండు చేయించి వస్త్రాలు మార్చి సపర్యలు చేశారు.
దాడి చేసిన మతిస్థిమితం లేని వ్యక్తి