Madanapalle rural
-
భార్య తలవంపులు తెస్తోందని..
సాక్షి, మదనపల్లె క్రైం : భార్య చెడు తిరుగుళ్లతో తలవంపులు తెస్తోందని ఓ యువకుడు పురుగుల మందుతాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన సోమవారం రాత్రి మదనపల్లె మండలంలో జరిగింది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. సీటీఎం పంచాయతీ నల్లగుట్లపల్లెకు చెందిన పీట్ల శ్రీనివాసులు(32) మార్బల్ పనులు చేస్తూ భార్యా ఇద్దరు కుమార్తెలను పోషించు కుంటున్నాడు. అయితే ఇంటిపట్టునే ఉంటున్న భార్య జ్యోతి గత కొంతకాలంగా స్థానికంగా ఉన్న ఓ వ్యక్తితో చనువుగా ఉంటూ భర్తను పట్టింకుకోక పోవడంతో మందలించాడు. దీంతో ఆమె అలిగి భర్తను వదిలి ఎనిమిది నెలల క్రితం అదే ఊరులో ఉన్న పుట్టింటికి చేరుకుంది. అప్పటి నుంచి తనకు పరిచయం ఉన్న వ్యక్తితో మరింతగా చనువుగా ఉంటోంది. జ్యోతి తీరుకు గ్రామంలో భర్త తలెత్తుకు తిరగలేక అవమానానికి గురయ్యాడు. అంతే కాకుండా ప్రియుడి మాటలు విని ఆమె స్థానిక రూరల్ పోలీసులకు అదనపు కట్నం కోసం భర్త వేధిస్తున్నాడని మూడు రోజుల క్రితం ఫిర్యాదు చేసింది. పోలీసులు శ్రీనివాసులును స్టేషన్‌కు పిలిపించడంతో తీవ్ర మనస్థాపం చెందాడు. జీవితంపై విరక్తి చెందిన అతను సోమవారం రాత్రి ఇంట్లోనే పురుగుల మందుతాగాడు. కుటుంబ సభ్యులు శ్రీనివాసులును ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స అందిస్తున్నారు. -
ఇంజినీర్ దారుణ హత్య.. డబ్బు, నగలు చోరీ
చిత్తూరు : చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఓ ఇంజినీర్‌ను దుండగులు దారుణంగా హత్య చేసి ఇంటిని దోచుకున్నారు. మున్సిపాలిటీ ఇంజినీర్ రామనాధ (28)ను దుండగులు హత్య చేసి ఆయన మెడలోని చైన్ తోపాటు 4 తులాల బంగారం, రూ.10 వేల నగదు దోచుకెళ్లారు. తంబళ్లపల్లె మండలం రేణుమాకులపల్లి పంచాయతీ తిమ్మయ్యగారిపల్లికు చెందిన కందల నరసింహులు రెండవ కుమారుడు కందల రామనాధ మదనపల్లె పట్డణం గొల్లపల్లి సిమెంట్ రోడ్డులో సొంతిల్లు తీసుకుని నివాసం ఉంటున్నారు. రామనాధ భార్య మదనపల్లి విశ్వకిరణ్ ఆర్థో ఆసుపత్రిలో పనిచేస్తోంది. ఐదుగురు దుండగులు శనివారం వేకువజామున ఇంటిలోకి చొరబడి తన భర్తను చంపారని రామనాధ భార్య పోలీసులకు తెలిపింది. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి వుంది. సంఘటన స్థలాన్ని సీఐ సురేష్ కుమార్, ఎస్ఐ నాగేశ్వరరావు పరిశీలించారు. -
పట్టపగలే.. నడిరోడ్డుపై హత్యాయత్నం
కాపుకాచి దాడికి పాల్పడిన ప్రత్యర్థులు మదనపల్లె రూరల్: పట్టపగలే నడిరోడ్డుపై ఓ యువకుడిపై మారణాయుధాలతో దాడిచేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ సంఘటన శుక్రవారం మదనపల్లె పట్టణంలో సంచలనం కలిగించింది. సంఘటనకు సంబంధించి బాధితుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఎన్వీఆర్ లేఅవుట్లో నివాసముంటున్న క్రిష్ణమూర్తి కుమారుడు శశికాంత్(28). బసినికొండ నుంచి ద్విచక్ర వాహనంలో నిమ్మనపల్లె రోడ్డు సర్కిల్‌కు వస్తున్నాడు. ఇంతలో కాపుకాచిన ప్రత్యర్థులు ఎన్‌జేఆర్ కల్యాణ మండపం సమీపంలో రెండు ద్విచక్ర వాహనాల్లో వచ్చి శశికాంత్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్నారు. కిందపడిన వెంటనే మారణాయుధాలతో ఒంటిపై పొడిచారు. ఆపై స్థానికుల రాకను గమనించి పరారయ్యారు. బాధితున్ని స్థానికులు 108లో మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇదిలావుండగా విచారణలో గాయపడిన శశికాంత్ రెండు రోజులక్రితం బర్మావీధిలోని అరుణ్ ఐస్‌క్రీమ్ పార్లల్లో గొడవపడ్డట్టు తెలిసింది. ఈ కక్షతోనే దాడికి పాల్పడినట్లు సమాచారం. దాడికి పాల్పడిన వారిలో నగేంద్ర, ఈశ్వర్, ప్రదీప్, కిషోర్ ఉన్నట్లు బాధితుడు తెలిపాడు. వన్‌టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.