మూగజీవాలపై దాడి!
శంషాబాద్ (రంగారెడ్డి జిల్లా) : మూగజీవాలపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటన శంషాబాద్ మండలం మదన్‌పల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడాది వయసున్న 6 దూడలు మృతిచెందగా.. మరో మూడు దూడలు తీవ్రంగా గాయపడ్డాయి. యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.