Madharam
-
20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ పార్కు
సాక్షి, మేడ్చల్‌జిల్లా: నగర శివారు మేడ్చల్ జిల్లా పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెందుతోంది. వందలాది పరిశ్రమల ఏర్పాటుతో వేలాది మంది నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, లక్షలాది కుటుంబాలకు పరోక్షంగా ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. ఈ నేపథ్యంలోనే గ్రేటర్ హైదరాబాద్ కు తూర్పు దిశలో ఉన్న ఘట్కేసర్ మండలం మాదారంలో కొత్తగా ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటునకు తొలి అడుగుపడింది. 150కి పైగా కంపెనీల స్థాపన.. శివారుల్లో ఇప్పటికే గ్రీడ్ పాలసీలో భాగంగా ఉప్పల్ జెన్‌ప్యాక్ వద్ద 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ పార్కు స్థాపనకు పునాది రాయి పడింది. నగరానికి ఉత్తరం వైపు కండ్లకోయలో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో గేట్‌వే ఐటీ పార్కుకు శ్రీకారం చుట్టారు. ఈ రెండు పార్కుల ఏర్పాటుతో 150కి పైగా సంస్థలు తమ కార్యకలాపాలను స్థాపించేందుకు ముందుకు వచ్చాయి. భూ పరిహారం సైతం చెల్లింపు... గ్రేటర్‌కు తూర్పు దిశలో ఘట్కేసర్ మండలం మాదారంలో త్వరలో ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటు కానుండటంతో... జిల్లా నిరుద్యోగ యువతలో ఉపాధిపై ఆశలు చిగురించాయి. ఈ పార్కు స్థాపనకు రైతుల అంగీకారంతో 226 ఎకరాల భూ సేకరణ కార్యక్రమాన్ని పూర్తి చేసిన అధికార యంత్రాంగం వారికి చెల్లించాల్సిన భూ పరిహారాన్ని కూడా అందజేసింది. జిల్లా పరిశ్రమల శాఖ కూడా టీఎస్ ఐపాస్ ద్వారా ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటునకు అన్నీ అనుమతులు ఇప్పించింది. భూ నిధి ఎక్కువే... నగర శివారు మేడ్చల్ జిల్లాలో నూతన పరిశ్రమల ఏర్పాటుకు తగినంత భూనిధి ఉంది. జిల్లా పరిధిలో 66.8 కిలోమీటర్ల జాతీయ రహదారులు, 65 కిలోమీటర్ల రాష్ట్రీయ రహదారులు ఉన్నాయి. వీటికి తోడు ఔటర్ రింగ్ రోడ్డు ఉండటంతో కొత్త పరిశ్రమల స్థాపనకు అనువైన ప్రాంతంగా పారిశ్రామికాధిపతులు భావిస్తున్నారు. రహదారుల సమీపంలో దాదాపు 10వేల ఎకరాల భూములు ఉన్నాయి. అందులో 6,084 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. కొత్తగా 5వేల ఉద్యోగాలు మేడ్చల్ జిల్లాలో కరోనా కష్టకాలం (2021–22 ఆర్థిక సంవత్సరం)లో రూ34.95 కోట్ల పెట్టుబడులతో కొత్తగా 685 పరిశ్రమలు ఏర్పడగా, 5,536 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించాయి. దీంతో పరోక్షంగా జిల్లాలో వందలాది మందికి ఉపాధి దక్కుతోంది. పరిశ్రమల స్థాపనతో 1.93 లక్షల ఉద్యోగాలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మేడ్చల్ జిల్లాగా ఏర్పడిన తర్వాత 2016 అక్టోబర్ నుంచి 2021 మార్చి వరకు ఐదేళ్ల కాలంలో రూ.14,762 కోట్ల పెట్టుబడులతో 8,461 సూక్ష్మ, చిన్న, మధ్యతరహ, భారీ పరిశ్రమలు ఏర్పడ్డాయి. తద్వారా 1,93,050 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించాయి. (క్లిక్: ఈవీ చార్జింగ్ స్టేషన్లొస్తున్నాయ్..) -
రక్త మార్పిడి కలకలం: యువకుడి మృతిపై అనుమానాలు?
ములకలపల్లి: రక్త మార్పిడి చేయించుకున్న యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆర్ఎంపీ అందించిన వైద్యం వికటించి మృతి చెందాడని కుటుంబసభ్యులు ఆరోపించారు. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమలాపురంలో కలకలం రేపింది. గ్రామానికి చెందిన యువకుడు జక్కా రామకృష్ణ (29) మంగళవారం ఆకస్మిక మృతి చెందగా..ఆర్ఎంపీ వైద్యం వికటించడంతోనేనని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. మూడు రోజులుగా నీరసంగా ఉంటోందని మా«ధారంలోని ఓ ఆర్ఎంపీ వద్ద చికిత్స పొందుతున్నాడు. సోమవారం ములకలపల్లి సెంటర్లోని ఓ రక్తపరీక్షా కేంద్రంలో కమలాపురం గ్రామానికి చెందిన చెందిన ఓ యువకుడి రక్తాన్ని సేకరించి..సదరు మాధారం ఆర్ఎంపీ పర్యవేక్షణలో ఎక్కించారు. ఈ క్రమంలో రామకృష్ణ ఆరోగ్యం క్షీణించి..చనిపోయాడని కుటుంబ సభ్యులు అంటున్నారు. చదవండి: ప్రాణం తీసిన పేకాట.. మద్యంమత్తులో బండరాయితో మోది.. ఆర్ఎంపీ నివాసంలో రక్తం పరిశీలిస్తున్న వైద్యారోగ్య శాఖ అధికారులు అధికారుల విచారణ మృతుడికి భార్య సమ్మక్క, ఏడాది వయసు కూతురు ఉంది. ప్రస్తుతం ఆమె గర్భిణి. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ పోటు వినోద్ కమలాపురం వెళ్లి వివరాలు సేకరించారు. రక్తం ప్యాకెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ములకలపల్లిలోని రక్త పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసి తాత్కాలికంగా సీజ్ చేశారు. మాధారంలోని ఆర్ఎంపీ ఇంటికి వెళ్లగా ఆయన అందుబాటులో లేడు. అక్కడ మందులను పరిశీలించారు. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు డిప్యూటీ డీఎంహెచ్ఓ తెలిపారు. మృతుడి తల్లి సత్యవతి ఫిర్యాదు మేరకు ఎస్సై సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చదవండి: ‘సారూ.. భూములు లాక్కోద్దు’ తహసీల్దార్ కాళ్లపై రైతులు -
పురిటి గడ్డ రుణం తీర్చుకున్న శ్రీమంతుడు..
రఘునాథపల్లి : ఉద్యోగం, వ్యాపారం కోసం సొంత ఊరొదిలేసి వచ్చి ఎంతో సంపాదించాం, ఆ ఊరికేం చేస్తున్నాం? ఏం చేయాలి ? అని ఆలోచిండాడేమో.. అంతేకాక మనిషి జీవితాన్ని ఎంతగా ప్రేమించాడన్నది విషయం కాదు.. మనిషి ఎంతమంది ప్రేమను సంపాదించాడన్నది పరమార్థం. తన ఆలోచనను వెంటనే కార్యరూపంలో చూపించాడో శ్రీమంతుడు. పురిటి గడ్డ రుణం తీర్చుకునేందుకు సొంతూరును దత్తత తీసుకున్నాడు. ఊరిని దత్తత తీసుకోవడంతోనే ముందుగా పాఠశాల అభివృద్ధికి శ్రీకారం చుట్టాడు. ఆయనే మండలంలోని చెందిన మదారం గ్రామానికి చెందిన గుడి లక్ష్మారెడ్డి- రమాదేవి దంపతుల కుమారుడు గుడి వంశీదర్‌రెడ్డి. అమెరికాలో మాస్టర్ ఇన్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసి టెక్సాస్, కెనడా, హైదరాబాద్‌లో కాంగ్లోమెరేట్ పేర ఐటీ కంపెనీ ప్రారంభించాడు. జీవితమంటే సంపాదనే కాదు, సామాజికి స్పృహతో సమాజ సేవలో భాగం కావాలని తలిచాడు. హైదరాబాద్‌లో స్థిరపడ్డ ఆయన కన్నతల్లితో పోల్చే సొంత ఊరిని దత్తత తీసుకోవాలనుకున్నాడు.శనివారం గ్రామంలో జరిగినవ రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సమక్షంలో గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. దీంతో ఎమ్మెల్యేతో పాటు సర్పంచ్ బాల్నె అనురాధ, గ్రామ ప్రముఖులు శ్యాంసుందర్‌రెడ్డి, గొట్టం అంజిరెడ్డి, ప్రజా ప్రతినిదులు, అధికారులు, గ్రామస్తులు వంశీధర్ రెడ్డిని అభినందించారు. విద్యార్థుల ఇబ్బందుల దృష్ట్యా మొదటి ప్రాధాన్యతగా పాఠశాల ఆవరణలో మొరం పోసం బీటీ వేయడం, ఊరుస్తున్న తరగతి గదులకు మరమ్మతు చేస్తామన్నారు. అలాగే మహిళ సంఘం భవనం, ఎల్ఈడీ లైట్లు, 500 మీటర్ల డ్రైనేజి నిర్మాణంతో పాటు మౌళిక సదుపాయాలు కల్పించి గ్రామాన్ని మోడల్‌గా తీర్చిదిద్దుతానని ఆ గ్రామ శ్రీమంతుడు పేర్కొన్నారు. సీమాంద్రుల పాలనో అభివృద్ధి లేక తెలంగాణ అన్ని రకాల వెనక్కిపోయిందని ఉప్పెనలా సాగిన రాష్ట్ర ఉద్యమంలో తాను పాలుపంచుకున్నట్లు చెప్పారు. బంగారు తెలంగాణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేసే ప్రసంగాలు తనను గ్రామాన్ని దత్తత తీసుకునేలా స్పూర్తి నిచ్చిందన్నారు. గ్రామ అభివృద్ధి కోసం గ్రామస్తులంతా కలిసికట్టుగా ఉండాలని ఆయన కోరారు. -
మాధారంలో మద్యం నిషేధం
- విక్రయిస్తే జరిమానా,ప్రభుత్వం పథకాలు రద్దుచేయూలని తీర్మానం - అమ్మకందారులకు నోటీసులు మాధారం (రఘునాథపల్లి) : మండలంలోని మాధారంలో బెల్టుషాపులు, గుడుంబా నివారణకు గ్రామస్తులు నడుంబిగించారు. శనివారం గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ బాల్నె అనురాధ ఆధ్వర్యంలో అన్ని పార్టీల నాయకులు, కుల పెద్దలు, మహిళా సంఘాల అధ్యక్షులు సమావేశమయ్యారు. గ్రామంలో బెల్టుషాపులు, గుడుంబా విక్రయిస్తే జరిమానాలతో పాటు ప్రభుత్వ పథకాలు పూర్తిగా నిలిపి వేయాలని నిర్ణయించారు. ఈ నెల 8 నుంచి గ్రామంలో మద్య నిషేధం అమల్లోకి తేవాలని పకడ్బంధీగా అమలయ్యేలా నిషేధ కమిటీలు వేసి బాధ్యతలు అప్పగించారు. గ్రామంలో ఎవరైనా బెల్టు షాపు నిర్వహిస్తే రూ 20 వేల జరిమానా, గుడుంబా అమ్మితే రూ 10 వేలు, తాగిన వారికి రూ 5 వేల జరిమానా విధించాలని తీర్మానం చేశారు. ప్రస్తుతం బెల్టు షాపులు నిర్వహిస్తున్న నలుగురికి, గుడుంబా అమ్ముతున్న ఆరుగురికి గ్రామ పంచాయతీ నుంచి నోటీసులు తయారు చేసి స్వయాన నూతనంగా ఎంపికైన నిషేధ కమిటీ సభ్యులు వారి వద్దకు వెళ్లి అందించారు. గ్రామస్తుల నిర్ణయాన్ని ధిక్కరించి మద్యం అమ్మితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో గ్రామాఖ్య సంఘం అధ్యక్షురాలు ఉమ్మగోని సరిత, సీఏ కర్ల పద్మ, టీడీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉమ్మగోని నర్సయ్య, బాల్నె భిక్షపతి, అరూరి బాలస్వామి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.