రఘునాథపల్లి : ఉద్యోగం, వ్యాపారం కోసం సొంత ఊరొదిలేసి వచ్చి ఎంతో సంపాదించాం, ఆ ఊరికేం చేస్తున్నాం? ఏం చేయాలి ? అని ఆలోచిండాడేమో.. అంతేకాక మనిషి జీవితాన్ని ఎంతగా ప్రేమించాడన్నది విషయం కాదు.. మనిషి ఎంతమంది ప్రేమను సంపాదించాడన్నది పరమార్థం. తన ఆలోచనను వెంటనే కార్యరూపంలో చూపించాడో శ్రీమంతుడు. పురిటి గడ్డ రుణం తీర్చుకునేందుకు సొంతూరును దత్తత తీసుకున్నాడు. ఊరిని దత్తత తీసుకోవడంతోనే ముందుగా పాఠశాల అభివృద్ధికి శ్రీకారం చుట్టాడు. ఆయనే మండలంలోని చెందిన మదారం గ్రామానికి చెందిన గుడి లక్ష్మారెడ్డి- రమాదేవి దంపతుల కుమారుడు గుడి వంశీదర్‌రెడ్డి.
అమెరికాలో మాస్టర్ ఇన్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసి టెక్సాస్, కెనడా, హైదరాబాద్‌లో కాంగ్లోమెరేట్ పేర ఐటీ కంపెనీ ప్రారంభించాడు. జీవితమంటే సంపాదనే కాదు, సామాజికి స్పృహతో సమాజ సేవలో భాగం కావాలని తలిచాడు. హైదరాబాద్‌లో స్థిరపడ్డ ఆయన కన్నతల్లితో పోల్చే సొంత ఊరిని దత్తత తీసుకోవాలనుకున్నాడు.శనివారం గ్రామంలో జరిగినవ రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సమక్షంలో గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. దీంతో ఎమ్మెల్యేతో పాటు సర్పంచ్ బాల్నె అనురాధ, గ్రామ ప్రముఖులు శ్యాంసుందర్‌రెడ్డి, గొట్టం అంజిరెడ్డి, ప్రజా ప్రతినిదులు, అధికారులు, గ్రామస్తులు వంశీధర్ రెడ్డిని అభినందించారు.
విద్యార్థుల ఇబ్బందుల దృష్ట్యా మొదటి ప్రాధాన్యతగా పాఠశాల ఆవరణలో మొరం పోసం బీటీ వేయడం, ఊరుస్తున్న తరగతి గదులకు మరమ్మతు చేస్తామన్నారు. అలాగే మహిళ సంఘం భవనం, ఎల్‌ఈడీ లైట్లు, 500 మీటర్ల డ్రైనేజి నిర్మాణంతో పాటు మౌళిక సదుపాయాలు కల్పించి గ్రామాన్ని మోడల్‌గా తీర్చిదిద్దుతానని ఆ గ్రామ శ్రీమంతుడు పేర్కొన్నారు. సీమాంద్రుల పాలనో అభివృద్ధి లేక తెలంగాణ అన్ని రకాల వెనక్కిపోయిందని ఉప్పెనలా సాగిన రాష్ట్ర ఉద్యమంలో తాను పాలుపంచుకున్నట్లు చెప్పారు. బంగారు తెలంగాణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేసే ప్రసంగాలు తనను గ్రామాన్ని దత్తత తీసుకునేలా స్పూర్తి నిచ్చిందన్నారు. గ్రామ అభివృద్ధి కోసం గ్రామస్తులంతా కలిసికట్టుగా ఉండాలని ఆయన కోరారు.
పురిటి గడ్డ రుణం తీర్చుకున్న శ్రీమంతుడు..
Published Sun, Jul 16 2017 5:14 PM | Last Updated on Fri, Jul 26 2019 5:58 PM
Advertisement
Advertisement