Madi
-
అరేబియా సముద్రంలో అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: అరేబియా సముద్రంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇటీవల పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో పెను తుపానుగా ఏర్పడి క్రమంగా బలహీనపడిన ‘మాదీ’ ప్రభావమే ఇది. శుక్రవారం నాటికి వాయుగుండంగా ఉన్న ఆ వాతావరణం శనివారం ఉదయానికి అల్పపీడనంగా మారింది. ఇది మరింత బలపడి తూర్పు దిశగా వెళ్లిపోతుంది. దీని ప్రభావం కారణంగా ప్రస్తుతం మన రాష్ట్రంపై ఎలాంటి ప్రభావం ఉండబోదని.. కేరళలో వర్షాలు పడే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. మరో 24 గంటల్లో ఇది బలహీనపడిపోయే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. -
తూర్పుగోదావరి జిల్లా పై మాది తుపాను ప్రభావం
-
తీవ్ర తుపానుగా మారిన 'మాదీ'
విశాఖ : నైరుతి బంగాళాఖాతంలో స్థిరంగా ఏర్పడిన మాదీ తుపాను అతి తీవ్ర తుఫానుగా మారింది. చెన్నైకి తూర్పు ఆగ్నేయ దిశగా 490 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ తుఫాను ప్రభావంతో... దక్షిణ కోస్తాలో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మాదీ తుఫాను నెమ్మదిగా ఉత్తర దిశగా పయనిస్తోందని తెలిపింది. దీంతో అన్ని ఓడరేవులలో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మత్యకారులు వేటకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని విశాఖ తుఫాను కేంద్రం తెలిపింది. గంటకు 45 నుంచి 55 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించారు. -
అతి తీవ్ర తుఫానుగా మారిన మాదీ