maha nivedana
-
నేటి ఉదయం దైవదర్శనాలుండవు
సాక్షి, హైదరాబాద్: సూర్యగ్రహణం కారణంగా గురువారం ఉదయం తెలుగు రాష్రాల్లోని ఆలయాలను మూసివేయనున్నారు. ఉదయం 8.07 గంటలకు గ్రహణ స్పర్శ కాలం ప్రారంభం అవుతుండగా, మోక్ష కాలం ఉదయం 11.20 నిమిషాలకు ఉంది. మొత్తం మూడు గంటలకుపైగా గ్రహణ కాలం ఉంటుంది. ఆలయాల శుద్ధి అనంతరం మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత దైవ దర్శనాలకు వీలుగా ఆలయాల తలుపులు తెరుచుకోనున్నాయి. కొన్ని దేవాలయాలను మధ్యాహ్నం 3 గంటలకు తెరవనున్నారు. అన్ని దేవాలయాల్లో సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. రెండు రాష్ట్రాల్లోని ఆయా ఆలయాల్లో సంప్రోక్షణ, పుణ్య హవాచనం, మహా నివేదన తదితర సేవల అనంతరం భక్తులను సర్వ దర్శనాలకు అనుమతిస్తారు. -
దుర్గమ్మ ఆలయ సిబ్బందిపై వేటు
విజయవాడ: దుర్గగుడిలో అమ్మవారికి మహానివేదనపై ఆలయ ఉన్నతాధికారులు ఆలస్యంగా స్పందించారు. ఈ అంశంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆలయ సూపరింటెండెంట్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. అలాగే ఏఈవో, ఆలయ ఇన్స్పెక్టర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు ఆలయ ఈవో ఎ. సూర్యకుమారి బుధవారం వెల్లడించారు. ఈ విషయంపై వివరణ ఇవ్వాలని స్థానాచార్యలను కోరినట్లు ఆమె పేర్కొన్నారు. మంగళవారం దుర్గమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆ క్రమంలో వీఐపీల తాకిడి కూడా అధికంగా ఉంది. ఆలయ అధికారులు వీఐపీల సేవలో తరించడంతో అమ్మవారికి సమర్పించే నివేదన ఆలస్యమైంది. మధ్యాహ్నం అమ్మవారికి నివేదన సమర్పించేందుకు ఆలయ అర్చకులు సిద్ధమయ్యారు. మేళతాళాలతో ఆలయ అర్చకులు నివేదనను తీసుకుని అమ్మవారి ముఖ మండపం వద్దకు చేరుకున్నారు. అయితే అప్పటికే ఆలయం లోపల కొందరు వీఐపీలు ఉండటంతో వారు బయటకు వచ్చే వరకు నివేదనను పట్టుకుని అర్చకులు వేచి ఉండాల్సి వచ్చింది. అర్చకులు ఎంత పిలిచినా అంతరాలయంలో ఉన్నవారు బయటకు రాలేదు. వైదిక కమిటీ సభ్యులు శంకర శాండిల్య ఆగ్రహంతో గట్టిగా కేకలు వేయడంతో వీఐపీలు బయటకు వచ్చారు. ఆ తర్వాత అమ్మవారికి మహా నివేదన చేయవలసి వచ్చింది.