Mahabharat epic
-
ప్రతి ఊరూ... మహాభారత కథకు సాక్ష్యాలే...
సాక్షి, శృంగవరపుకోట : తింటే గారెలే తినాలి... వింటే భారతమే వినాలి. అంటారు కదా. అలాంటి మహాభారతంలోని సంఘటనలకు సాక్ష్యాలే శృంగవరపుకోట పరిసర ప్రాంతాలు. ఒక్కో ఊరికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుంటే అంతా ఆసక్తికరంగా ఉంటుంది. విరాటరాజ్య రక్షకుడు అయిన కీచకుడు తన శృంగార కార్యక్రమాలకు మట్టికోటను వినియోగించేవాడు. అదే ఈ ప్రాంతంలో నేడు వృంగవరపుకోటగా వాసి కెక్కింది. దండకారణ్య ప్రాంతంలో విరాటరాజు కొలువులో పాండవులు అజ్ఞాతవాసం చేస్తున్నప్పుడు భీముని చేతిలో నిహతుడైన కీచకుని సద్గతి కల్పించాలని సుధేష్ణదేవి కోరికమేరకు పుణ్యగతులు పొందిన ప్రాంతం నేడు పుణ్యగిరిగా ప్రసిద్ధిగాంచింది. విరటుని కొలువులో ఉన్న పాండవుల అజ్ఞాతవాసం భగ్నం చేయాలని లాక్ష్య గృహదహనం జరిగిన ప్రాంతం తర్వాత లక్కవరపుకోటగా మారింది. ద్వాపర యుగంలో పాండవులు వనవాసం చేసిన సమయంలో నాటి జమ్మివనం ఉన్న ప్రాంతంలో తమ అస్త్ర,శస్త్రాలను జమ్మి చెట్టుపై భద్రం చేశారు. కాల క్రమేణా జామి గ్రామంగా మారింది. ఉత్తర గోగ్రహణం వేళ కౌరవులు తోలుకుపోతున్న ఆలమందను అర్జునుడు అడ్డుకున్న స్థలం ఇప్పుడు అలమండ అయ్యింది. అజ్ఞాతవాసంలో వలలుడు పేరుతో వంటవాడిగా భీముడు ఉన్న ప్రాంతం భీమాళిగా మారిందని ప్రతీతి. -
నువ్వు మతోన్మాదివి; మండిపడ్డ రచయిత
న్యూఢిల్లీ : ఫ్రెంచ్ కాలమిస్ట్ ఫ్రాంకోయిస్ గుటర్పై బాలీవుడ్ రచయిత జావేద్ అక్తర్ ట్విటర్ వేదికగా తిట్ల వర్షం కురిపించారు. రూ. 1000 కోట్ల భారీ బడ్జెట్‌తో భారతీయ ఇతిహాస గాథ మహాభారతాన్ని తెరకెక్కించబోతున్నారని, ఆ సినిమాను ముఖేశ్ అంబానీ నిర్మించనున్నారని ఊహాగానాలు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో అతి ముఖ్యమైన కర్ణుడు లేదా కృష్ణుని పాత్ర పోషించాలని ఉందని బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్‌ఖాన్ ఎన్నోసార్లు తన మనసులో మాట బయటపెట్టారు. దీనిపై ఫ్రాంకోయిస్ స్పందిస్తూ... ‘హిందువులకు చెందిన ఇతిహాస గాథ మహాభారతంలోని పాత్రను ఒక ముస్లిం ఎలా చేయగలడు. లౌకికవాదం పేరిట మోదీ ప్రభుత్వం కూడా కాంగ్రెస్‌లాగే ప్రవర్తిస్తుందేమో? ఒకవేళ మహ్మద్ ప్రవక్త జీవిత చరిత్రలో ఆయన పాత్ర ఒక హిందువు పోషించడానికి ముస్లింలు అంగీకరిస్తారా ’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు స్పందనగా.. జావేద్ అక్తర్.. పరుష పదజాలంతో ఫ్రాంకోయిస్పై విరుచుకుపడ్డాడు. ‘యూ స్కౌండ్రల్ మా దేశంలో ద్వేషపూరిత వాతావరణం సృష్టించాలని చూస్తున్నావేమో. అసలు నీ వెనుక ఏ దేశ హస్తం ఉందో చెప్పు’ అంటూ జావేద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. ‘భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి నీకేం తెలుసు, మతోన్మాదం అనే బావిలోని కప్పవు నువ్వు’ అంటూ ట్వీట్ చేశారు. గతంలో కూడా గుర్మెహర్ కౌర్ వివాద సమయంలో, వీరేంద్ర సెహ్వాగ్, ఫొగట్ సిస్టర్స్ విషయంలోనూ జావేద్ కాస్త కఠినంగానే స్పందించారు. Why should @AamirKhan, a Muslim, play in most ancient & sacred of Hindu epics, the Mahabharata? Is @BJP4India Govt of @narendramodi going to be like the @INCIndia & just stand by in name of secularism??? Would Muslims allow a Hindu to play life of Mohamed?https://t.co/fC7bvbHkZE — Francois Gautier (@fgautier26) March 21, 2018 You scoundrel, have you not seen peter brooks production of this great epic Mahabharsta in France . I would like to know which foreign agency is paying you to spread this kind of perverse and poisonous thoughts in our country — Javed Akhtar (@Javedakhtarjadu) March 21, 2018 You ignorant unfortunate imbecile, obviously you know nothing about our Indian traditions and culture . Do you know who were Ras khan bullay shah Waris shah, ,Baba Farid Nazeer Akbarabadi , Nizir Banarasi , Bismillah khan . You are just a frog in the stinking well of communalism — Javed Akhtar (@Javedakhtarjadu) March 22, 2018 -
రాజమౌళి మహాభారతం తీస్తే...
సాక్షి, సినిమా : మహాభారతం దృశ్య కావ్యంగా తెరకెక్కించాలన్నది నా కల మాత్రమే.. ఖచ్ఛితంగా తీస్తానని చెప్పలేదు అంటూ ఈ మధ్య దర్శక ధీరుడు రాజమౌళి ఓ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీంతో అది ఇప్పట్లో తెరకెక్కటం అనుమానమే అన్నది తేలిపోయింది. అయితే బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్షనిస్ట్ అమీర్‌ఖాన్ కూడా మహాభారతం తీయాలనుకుంటున్నానని ఆ మధ్య ప్రకటించి.. దానికి చాలా సమయం పడుతుందని కాబట్టి పక్కన పెట్టేస్తున్నట్లు చెప్పాడు. ప్రస్తుతం సీక్రెట్ సూపర్ స్టార్ చిత్రం ప్రమోషన్ కోసం వడోదరలో ఉన్న అమీర్ మీడియాతో మహాభారతంపై మళ్లీ స్పందించాడు. రాజమౌళికి తానోక పెద్ద అభిమానని, ఆయన ఒకవేళ మహాభారతం తీస్తే మాత్రం అందులో తనకు ఓ రోల్ ఇవ్వాలని కోరతానని అమీర్ అంటున్నాడు. రాజమౌళి గారు ఓ సినిమా కోసం చాలా కష్టపడతారు. ఆయన మహాభారతం తీస్తే మాత్రం అందులో కృష్ణుడి లేదా కర్ణుడి పాత్ర నేను కోరతాను అని అమీర్ వెల్లడించాడు. అయితే తన ఫిజిక్ మూలంగా కృష్ణుడి పాత్రే తనకు సరిగ్గా నప్పుతుందని అభిప్రాయపడ్డాడు. అంతేకాదు దక్షిణాది చిత్రాల నుంచి మంచి కథలు వస్తే చేస్తానని, తెలుగులో చిరంజీవి, పవన్ కళ్యాణ్‌తో ఛాన్స్ మాత్రం అస్సలు వదులుకోనని అమీర్ చెప్పాడు. ప్రస్తుతం అమీర్ ఓ కీలక పాత్రలో నటించి, నిర్మించిన సీక్రెట్ సూపర్ స్టార్ విడుదలకు సిద్ధంగా కాగా, థగ్స్ ఆఫ్ హిందోస్థాన్ చిత్రం కోసం బాలీవుడ్ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. -
రాజమౌళి దర్శకత్వంలో సూపర్‌స్టార్?
కోలీవుడ్‌లో ఒక సర్ప్రైజింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అదే సూపర్‌స్టార్ రజనీకాంత్, అద్భుత చిత్రాల దర్శకుడు రాజమౌళి కాంబినేషన్ లో ఒక బ్రహ్మాండ చిత్రం తెరకెక్కడానికి సన్నాహాలు జరుగుతున్నాయన్నదే ఆ ప్రచారం. టాలీవుడ్లో జక్కన్నగా పిలవబడే రాజమౌళి వెండితెరపై చెక్కిన చిత్రాలన్నీ సంచలన విజయాలుగానే నమోదయ్యాయి. ఆయన దర్శకత్వం వహించిన బాహుబలి చిత్రం ప్రపంచ సినిమానే తిరిగి చూసేలా చేసింది. అత్యధిక వసూళ్లను కొల్లగొట్టిన భారతీయ చిత్రంగా రికార్డుకెక్కింది. ఇక మన సూపర్‌స్టార్ రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఇటీవల నటించిన కబాలి కోలీవుడ్‌లో రికార్డు కలెక్షన్లను సాధించిన చిత్రంగా నమోదైంది.అలాంటి రజనీకాంత్ బాహుబలి చిత్రం చూసి దర్శకుడు రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిపించారు. అంతే కాదు ఆయన దర్శకత్వంలో నటించాలనే ఆసక్తిని కనబరచారు. అందుకు ఇప్పుడు పునాది పడుతున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. రాజమౌళి చిత్రాలన్నిటికీ ప్రముఖ రచయిత విజయేంద్రప్రసానే కథకుడు. ఆయన సాంఘిక, చారిత్రక, పౌరాణిక కథలను అందించడంలో దిట్ట. ఆయన ఇప్పుడు మహాభారత ఇతిహాసాన్ని తీసుకుని ఒక అద్భుత కథను సిద్ధం చేస్తున్నారట.అందులో ఒక పాత్రకు రజనీకాంత్‌ను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. రజనీకి పౌరాణిక ఇతిహాసాలంటే చాలా ఇష్టం. అలాంటి చిత్రంలో నటించాలన్న ఆసక్తి మెండుగా ఉంది. ఆ కోరికను ఈ చిత్రం ద్వారా తీర్చుకోవాలనుకుంటున్నట్లు సమాచారం. దర్శకుడు రాజమౌళి తదుపరి చిత్రం ఇదేననే ప్రచారం హల్చల్ చేస్తోంది. ప్రస్తుతం ఆయన బాహుబలి–2 చిత్రాన్ని పూర్తిచేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ చిత్రం ఏప్రిల్‌లో విడుదల కానుంది. ఇక రజనీకాంత్ శంకర్ దర్శకత్వంలో 2.ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం దీపావళి సందర్భంగా విడుదలకు ముస్తాబవుతున్నట్లు తెలుస్తోంది. దీని తరువాత ఆయన అల్లుడు, నటుడు ధనుష్ నిర్మించనున్న కబాలి–2 చిత్రంలో నటించనున్నారు. ఆ తరువాత రాజమౌళి దర్శకత్వంలో నటించే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్వర్గాల టాక్.