రాజమౌళి దర్శకత్వంలో సూపర్‌స్టార్‌? | Rajamouli directed Super Star? | Sakshi
Sakshi News home page

రాజమౌళి దర్శకత్వంలో సూపర్‌స్టార్‌?

Published Sun, Feb 12 2017 2:32 AM | Last Updated on Sun, Jul 14 2019 4:05 PM

రాజమౌళి దర్శకత్వంలో సూపర్‌స్టార్‌? - Sakshi

రాజమౌళి దర్శకత్వంలో సూపర్‌స్టార్‌?

కోలీవుడ్‌లో ఒక సర్‌ప్రైజింగ్‌ న్యూస్‌ చక్కర్లు కొడుతోంది. అదే సూపర్‌స్టార్‌ రజనీకాంత్, అద్భుత చిత్రాల దర్శకుడు రాజమౌళి కాంబినేషన్ లో ఒక బ్రహ్మాండ చిత్రం తెరకెక్కడానికి సన్నాహాలు జరుగుతున్నాయన్నదే ఆ ప్రచారం. టాలీవుడ్‌లో జక్కన్నగా పిలవబడే రాజమౌళి వెండితెరపై చెక్కిన చిత్రాలన్నీ సంచలన విజయాలుగానే నమోదయ్యాయి. ఆయన దర్శకత్వం వహించిన బాహుబలి చిత్రం ప్రపంచ సినిమానే తిరిగి చూసేలా చేసింది. అత్యధిక వసూళ్లను కొల్లగొట్టిన భారతీయ చిత్రంగా రికార్డుకెక్కింది. ఇక మన సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఆయన ఇటీవల నటించిన కబాలి కోలీవుడ్‌లో రికార్డు కలెక్షన్లను సాధించిన చిత్రంగా నమోదైంది.అలాంటి రజనీకాంత్‌ బాహుబలి చిత్రం చూసి దర్శకుడు రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిపించారు. అంతే కాదు ఆయన దర్శకత్వంలో నటించాలనే ఆసక్తిని కనబరచారు. అందుకు ఇప్పుడు పునాది పడుతున్నట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. రాజమౌళి చిత్రాలన్నిటికీ ప్రముఖ రచయిత విజయేంద్రప్రసానే కథకుడు. ఆయన సాంఘిక, చారిత్రక, పౌరాణిక కథలను అందించడంలో దిట్ట. ఆయన ఇప్పుడు మహాభారత ఇతిహాసాన్ని తీసుకుని ఒక అద్భుత కథను సిద్ధం చేస్తున్నారట.అందులో ఒక పాత్రకు రజనీకాంత్‌ను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.

రజనీకి పౌరాణిక ఇతిహాసాలంటే చాలా ఇష్టం. అలాంటి చిత్రంలో నటించాలన్న ఆసక్తి మెండుగా ఉంది. ఆ కోరికను ఈ చిత్రం ద్వారా తీర్చుకోవాలనుకుంటున్నట్లు సమాచారం. దర్శకుడు రాజమౌళి తదుపరి చిత్రం ఇదేననే ప్రచారం హల్‌చల్‌ చేస్తోంది. ప్రస్తుతం ఆయన బాహుబలి–2 చిత్రాన్ని పూర్తిచేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ చిత్రం ఏప్రిల్‌లో విడుదల కానుంది. ఇక రజనీకాంత్‌ శంకర్‌ దర్శకత్వంలో 2.ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం దీపావళి సందర్భంగా విడుదలకు ముస్తాబవుతున్నట్లు తెలుస్తోంది. దీని తరువాత ఆయన అల్లుడు, నటుడు ధనుష్‌ నిర్మించనున్న కబాలి–2 చిత్రంలో నటించనున్నారు. ఆ తరువాత రాజమౌళి దర్శకత్వంలో నటించే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్‌వర్గాల టాక్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement