రాజమౌళి మహాభారతం తీస్తే... | Aamir Request to Rajamouli on Mahabharata | Sakshi
Sakshi News home page

రాజమౌళి మహాభారతంలో పాత్ర కావాలి : అమీర్‌

Published Fri, Sep 29 2017 12:06 PM | Last Updated on Thu, Sep 27 2018 8:55 PM

Aamir Request to Rajamouli on Mahabharata - Sakshi

సాక్షి, సినిమా : మహాభారతం దృశ్య కావ్యంగా తెరకెక్కించాలన్నది నా కల మాత్రమే.. ఖచ్ఛితంగా తీస్తానని చెప్పలేదు అంటూ ఈ మధ్య దర్శక ధీరుడు రాజమౌళి ఓ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీంతో అది ఇప్పట్లో తెరకెక్కటం అనుమానమే అన్నది తేలిపోయింది. అయితే బాలీవుడ్‌ మిస్టర్‌ ఫర్‌ఫెక్షనిస్ట్‌ అమీర్‌ఖాన్‌ కూడా మహాభారతం తీయాలనుకుంటున్నానని ఆ మధ్య ప్రకటించి.. దానికి చాలా సమయం పడుతుందని కాబట్టి పక్కన పెట్టేస్తున్నట్లు చెప్పాడు. 

ప్రస్తుతం సీక్రెట్‌ సూపర్‌ స్టార్‌ చిత్రం ప్రమోషన్‌ కోసం వడోదరలో ఉన్న అమీర్‌ మీడియాతో మహాభారతంపై మళ్లీ స్పందించాడు. రాజమౌళికి తానోక పెద్ద అభిమానని, ఆయన ఒకవేళ మహాభారతం తీస్తే మాత్రం అందులో తనకు ఓ రోల్‌ ఇవ్వాలని కోరతానని అమీర్‌ అంటున్నాడు. రాజమౌళి గారు ఓ సినిమా కోసం చాలా కష్టపడతారు. ఆయన మహాభారతం తీస్తే మాత్రం అందులో కృష్ణుడి లేదా కర్ణుడి పాత్ర నేను కోరతాను అని అమీర్‌ వెల్లడించాడు. అయితే తన ఫిజిక్‌ మూలంగా కృష్ణుడి పాత్రే తనకు సరిగ్గా నప్పుతుందని అభిప్రాయపడ్డాడు. 

అంతేకాదు దక్షిణాది చిత్రాల నుంచి మంచి కథలు వస్తే చేస్తానని, తెలుగులో చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌తో ఛాన్స్‌ మాత్రం అస్సలు వదులుకోనని అమీర్‌ చెప్పాడు. ప్రస్తుతం అమీర్‌ ఓ కీలక పాత్రలో నటించి, నిర్మించిన సీక్రెట్‌ సూపర్‌ స్టార్‌ విడుదలకు సిద్ధంగా కాగా, థగ్స్‌ ఆఫ్‌ హిందోస్థాన్‌ చిత్రం కోసం బాలీవుడ్‌ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement