Mahalaya Amavasya
-
మహాలయ పిండ్‌దాన్ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్
సాక్షి, హైదరాబాద్: రానున్న మహాలయ అమావాస్య సందర్భంగా పితృదేవతలకు పిండప్రదానాలు సమర్పించే వారి కోసం హైదరాబాద్ నుంచి ఉత్తరాదికి ఐఆర్సీటీసీ ప్రత్యేక రైలును నడపనుంది. స్వదేశ్ దర్శన్ రెండో ప్యాకేజీలో భాగంగా సెప్టెంబర్ 15 నుంచి 20 వరకు (ఐదు రాత్రులు, 6 పగళ్లు) మహాలయ పిండ్ దాన్ ఎక్స్‌ప్రెస్‌ను నడపనున్నట్లు ఐఆర్సీటీసీ డిప్యూటీ జనరల్ మేనేజర్ కిశోర్ తెలిపారు. ఈ ప్రత్యేక రైలు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి విజయవాడ, విశాఖ, భువనేశ్వర్ మీదుగా గయ, వారణాసి, ప్రయాగ సంగమం వరకు వెళ్లి తిరిగి సికింద్రాబాద్ చేరుకోనుంది. రైలు చార్జీలతోపాటు రోడ్డు రవాణా, వసతి, భోజనం తదితర సదుపాయాలతో స్లీపర్ క్లాస్‌లో ఒక్కొక్కరికీ రూ. 14,485 చొప్పున, థర్డ్ ఏసీ రూ. 18,785 చొప్పున ఉంటుంది. ఈ పర్యటనలో ఇద్దరు లేదా ముగ్గురికి కలిపి నాన్ ఏసీ హోటల్లో బస ఏర్పాటు చేస్తారు. నేచర్ టూర్స్ ►కశ్మీర్, కేరళ, కన్యాకుమారి, రామేశ్వరం, భువనేశ్వర్ తదితర ప్రాంతాల్లో నేచర్ టూర్లను ఆస్వాదించే మరో సదుపాయాన్ని కూడా ఐఆర్సీటీసీ అందుబాటులోకి తెచ్చింది. ఈ నెల 25, సెప్టెంబర్ 8, 23 తేదీల్లో హైదరాబాద్ నుంచి లేహ్, లద్దాక్‌లకు విమాన టూర్లను ప్రవేశపెట్టింది. ఈ పర్యటనలో లేహ్, శ్యామ్ వ్యాలీ, నుబ్రా, తుర్టక్, తదితర ప్రాంతాలను సందర్శించవచ్చు. ఈ టూర్ చార్జీ ఒక్కొక్కరికి రూ. 38,470 చొప్పున ఉంటుంది. ►సెప్టెంబర్ 13 నుంచి రాయల్ రాజస్తాన్ పర్యటన మొదలవుతుంది. ఈ పర్యటనలో జైపూర్, జోధ్‌పూర్, పుష్కర్, ఉదయ్‌పూర్ తదితర ప్రాంతాలను సందర్శిస్తారు. ఫ్లైట్ చార్జీలతోపాటు అన్ని వసతులకు ఒక్కొక్కరికీ రూ. 29,400 చొప్పున చార్జీ ఉంటుంది. ►కేరళ డిలైట్స్ పేరుతో ఐఆర్సీటీసీ మరో టూర్‌ను అందుబాటులోకి తెచ్చింది. అక్టోబర్ 7న ఈ టూర్ మొదలవుతుంది. అలెప్పి, కొచ్చి, మున్నార్, త్రివేండ్రం తదితర ప్రాంతాలను సందర్శించవచ్చు. రూ. 35,500 చొప్పున చార్జీ ఉంటుంది. ►సౌత్ ఇండియా టెంపుల్ రన్ టూర్లో భాగంగా కన్యాకుమారి, మదురై, రామేశ్వరం, తిరుచ్చి, త్రివేండ్రం తదితర ప్రాంతాలను సందర్శించవచ్చు. నవంబర్ 1 నుంచి 6 రాత్రులు, 7 పగళ్లు ఈ పర్యటన కొనసాగుతుంది. ఒక్కొక్కరికీ రూ. 30,200 చొప్పున చార్జీ ఉంటుంది. మరిన్ని వివరాల కోసం ఐఆర్సీటీసీ ఫోన్ నంబర్ల 040–27702407/9701360701 ను సంప్రదించవచ్చు. -
తద్దినాలు పెడుతున్నా... మహాలయ పక్షాలు పెట్టాలా?
పితృతిథినాడు పుత్రుడు తన తండ్రి, తాత, మత్తాతలను తలచుకుని పితృయఙ్ఞాన్ని నిర్వహిస్తాడు. మరి పుత్రులు లేనివారి సంగతి ఏమిటి? అదేవిధంగా మన కుటుంబాలలో పెళ్లికాని తోబుట్టువులు లేదా పెళ్లయినా సంతానం కలుగని దంపతులు మరణించి ఉండవచ్చు. ప్రమాదాల్లో మరణించిన చిన్నపిల్లలు ఉండవచ్చు. లేదా యుద్ధాలలో కానీ, శిక్షల ద్వారా కానీ, ఆత్మహత్యల ద్వారా కానీ, ప్రకృతి వైపరీత్యాల (వరదలు, భూకంపాలు) ద్వారా కానీ గుర్తు తెలియక మరణించి ఉండవచ్చు. అటువంటివారందరికి కూడా తిలోదకాలిచ్చి వారిని ఊర్థ్వలోకాలకు పంపడం కోసం ఈ ‘మహాలయ పక్షాలు’ నిర్దేశించబడ్డాయి. పితృతిథి నాడు మూడు తరాలవారికి (తండ్రి, తాత, ముత్తాత) మాత్రమే తిలోదకాలతో పిండప్రదానం చేస్తారు. కానీ ఈ ‘మహాలయ పక్షాలు’ మన వంశంలో మరణించిన వారందరికీ మాత్రమే కాక, పుత్రులు లేని గురువులకు (గురువు కూడా తండ్రితో సమానం) స్నేహితులకు కూడా తిలోదకాలతో, పిండప్రదానం ఇచ్చే అర్హత, అధికారం సంక్రమిస్తుంది. అలాగే ఏ కారణం చేతనైనా తద్దినం పెట్టలేని పరిస్థితి ఏర్పడి, తద్దినం పెట్టకపోతే.., ఆ తద్దినం పెట్టని దోషం ‘మహాలయం’ పెట్టడం వలన పోతుంది. ఎప్పుడు, ఎలా ..? తండ్రి చనిపోయిన తిథినాడు ‘మహాలయం’ పెట్టడం ఉత్తమం. ఏ కారణం చేతనైనా అలా పెట్టడం వీలుకాని పరిస్థతిలో ‘మహాలయ అమావాస్య’ నాడు పెట్టడం ప్రశస్తం. మరణించిన బంధువులందరికీ, తిథులతో సంబంధం లేకుండా ఈ రోజునే ‘మహాలయం’ పెట్టాలి. మహాలయం పెట్టే కర్త శుచిగా స్నానంచేసి, దర్భలతో చేసిన పవిత్రమనే ఉంగరాన్ని ధరించి, ్రÔè ద్ధగా, భక్తిగా, మంత్రపూర్వకంగా హోమ, తర్పణ, పిండప్రదానాది విధులతో అత్యంత శ్రద్ధగా నిర్వహించాలి. ఇవి ఏవీ చేతకాకపోతే, కనీసం మృతులను తలచుకుని వారి పేరిట అన్నదానం చేసినా కూడా ఫలప్రదమేనంటారు. -
మహాలయ అమావాస్య అని భయపడ్డారా?
అంగారక కక్ష్యలోకి మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్)ను ప్రవేశపెట్టిన మొట్టమొదటి దేశంగానే కాకుండా, తొలి ప్రయత్నంలోనే ఆ ఘనతను సాధించిన దేశంగా భారత దేశం చరిత్ర సృష్టించింది. అంగారక కక్ష్యలోకి మార్స్ అర్బిటర్ మిషన్ ప్రవేశించడానికి ముందు అందర్నిలోనూ అనేక సందేహాలు, అనుమానాలు వెంటాడాయి. ఎందుకంటే ఈ ప్రక్రియ మంగళవారం రోజున ప్రారంభమైనదే కాకుండా.. ఈ రోజు మహాలయ అమావాస్య కావడం కూడా కొందర్నిలో అనేక సందేహాలు తలెత్తాయి. అయితే అందరి భయాలను, అంచనాలను, సందేహాలను తలక్రిందులు చేస్తూ పాడ్యమి అమావ్యాస సంధికాలంలో అంగారకుడిని మామ్ విజయవంతమవ్వడంతో ప్రత్యక్షంగా దర్శించుకున్నామని వేద పండితులు భావిస్తున్నారు. ఈ ప్రయోగం అంగారకుడికి దుష్పలితాలు తగ్గించే విధంగా జరిగాయని పండితులు అభిప్రాయపడుతున్నారు. అంగారకుడు దుర్గాదేవి సోదరుడని, మంగళవారం అంగారకుడి అనుగ్రహం పొందడం వలన ప్రజలకు దుర్గాదేవి అనుగ్రహం లభిస్తుందన్నారు. అంగారకుడి 9 సంఖ్య అని, ఎక్కువ మంది తొమ్మిదో సంఖ్యకు ప్రాధాన్యమిస్తారని పండితులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి నమ్మకాలకు తావుందో లేదో కాని.. భారత శాస్త్రవేత్తలు పడిన కృషికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపు మామ్ విజయవంత కావడం ద్వారా లభించింది.