mahaprastanam
-
సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు మహాప్రస్థానంలో చేయడానికి కారణమిదే!
సూపర్ స్టార్ కృష్ణ మరణం టాలీవుడ్‌ను శోకసంద్రంలోకి నెట్టివేసింది. వెండితెరపై 350కు పైగా సినిమాల్లో వైవిధ్య పాత్రలతో అలరించిన ఆయన తెలుగు తెరపై చెరగని ముద్ర వేసుకున్నారు. గుండెపోటుతో హాస్పిటల్లో చేరిన ఆ నటశేఖరుడు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. అశ్రునయనాల మధ్య ఆయన అంత్యక్రియలు నిన్న(బుధవారం) జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ముగిశాయి. కృష్ణ కుమారుడు మహేశ్ బాబు ఆయనకు తలకొరివి పెట్టి అంతిమ సంస్కారాలను నిర్వహించారు. అయితే దిగ్గజ నటుడికి సొంతంగా వారి ప్రైవేట్ స్థలంలో కాకుండా మహాప్రస్థానంలో అంత్యక్రియలు చేయడంపై అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. తాజాగా ఈ విషయంపై కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు స్పందించారు. ఇలా చేయడానికి ఓ కారణం ఉందని.. కృష్ణ సతీమణి ఇందిరా దేవి అంత్యక్రియలు జరిగిన చోటే ఆయన కార్యక్రమాలు నిర్వహించామని, రమేష్ బాబు అంత్యక్రియలు కూడా అక్కడే చేసినట్లు తెలిపారు. మరోవైపు సూపర్ స్టార్ కృష్ణ జ్ఞాపకాలు పదిలంగా ఉండేలా ఆయన పేరు మీద ఒక మెమోరియల్ ఏర్పాటు చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. మెమోరియల్‌లో కృష్ణ కాంస్య విగ్రహంతో పాటు ఆయన నటించిన 350 సినిమాలకు సంబంధించిన ఫోటోలు, షీల్డ్‌లు, ఇతర వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచనున్నారు.త్వరలోనే దీనిపై కుటుంబ సభ్యులు అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. -
జాతిని మేల్కొలిపిన యుగకర్త శ్రీశ్రీ
తిరుపతి కల్చరల్ : తన రచనలతో జాతిని మేల్కొలిపిన యుగకర్త శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ) అని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి కొనియాడారు. మానవ వికాస వేదిక, రాజా చంద్ర ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్లో సోమవారం శ్రీశ్రీ స్వీయ దస్తూరితో రాసిన మహాప్రస్థానం గ్రంథావిష్కరణ సభ నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీశ్రీతో తనకున్న అనుభవాలు, జ్ఞాపకాలను పంచుకుంటూ ప్రస్థానం గీతాలను ఆలపించారు. శ్రీశ్రీ రచనలు జన హృదయాలను ప్రభావితం చేసేలా సాగాయన్నారు. చలం చెప్పినట్లు శ్రీశ్రీ కవిత్వం తెలుగు జాతిని ఊగించి, శాసించి, లాలించిందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. తిరుపతితో పాటు వ్యక్తిగతంగా శ్రీశ్రీకి విడదీయరాని అనుబంధం ఉందన్నారు. తన సోదరుడు భూమన కారణంగా శ్రీశ్రీ ప్రభావం తనపై పడిందన్నారు. ఆయనతో ఉన్న తనకున్న అనుభవాలను, మధురస్మతులను పంచుకుననారు. చిన్ననాటి నుంచి ఆయన రచనలు తనపై ఎంతో ప్రభావం చూపాయన్నారు. ‘కవి’యుగ దైవం శ్రీశ్రీ సినీ గేయ రచయిత భువనచంద్ర మాట్లాడుతూ.. కలాన్ని జయించిన వ్యక్తి శ్రీశ్రీ అని కొనియాడారు. శ్రీరంగం కవిత్వం చదవని వారు రచయితలే కాదని నమ్ముతున్నట్లు తెలిపారు. కలియుగ దైవం శ్రీవారు అయితే ‘కవి’యుగ దైవం శ్రీశ్రీ అని కొనియాడారు. శ్రీవారి పాదాల చెంత మొట్టమొదటి డబ్బింగ్ సినిమా రచనకు ఆధ్యుడు శ్రీశ్రీనే అని గుర్తు చేసుకున్నారు. ఆయన అక్షర విలువను ఎంచడం ఎవరి తరం కాదన్నారు. ఎన్ని సిరులు వెళ్లినా శ్రీశ్రీ మాత్రం మననుంచి వదలి వెళ్లలేదని అభిప్రాయపడ్డారు. మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ అద్భుత కవితల ప్రవకర్త శ్రీశ్రీ అని కొనియాడారు. తెలుగు సాహిత్యాన్ని ఆకాశం నుంచి నేల మీదకు దింపారని అన్నారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి కళాపోషకుడిగా తెలుగు వైభవాన్ని చాటిన ఘనుడని కొనియాడారు. తన బిడ్డకు రాజకీయ వారసత్వంతో పాటు సాంస్కతిక వారసత్వాన్ని అందించారన్నారు. కార్పొరేషన్ డెప్యూటీ మేయర్ భూమన అభినయ్‌రెడ్డి మాట్లాడుతూ.. నేటి తరానికి, యువతరానికి శ్రీశ్రీ రచనలు ఓ చైతన్య దీపికలుగా నిలుస్తాయన్నారు. అంతటి మహనీయుడు రచించిన మహాప్రస్థానం గ్రంథావిష్కరణ తన చేతుల మీదుగా జరగడం మహద్భాగ్యమని తెలిపారు. పుస్తక ప్రచురణ కర్తకు రూ.20 వేలు బహుమతిగా అందజేశారు. పుస్తకావిష్కరణ చేసిన అభినయ్ రెడ్డి తిరుపతి నగర డెప్యూటీ మేయర్ భూమన అభినయ్ చేతుల మీదుగా శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని ఆవిష్కరించారు. తొలి ప్రతిని రచయిత నామిని సుబ్రహ్మణ్యంనాయుడికి, రెండో ప్రతిని విశ్రాంత ప్రిన్సిపల్ పెద్ది సత్యనారాయణకు అందజేశారు. కార్యక్రమంలో శ్రీశ్రీ ప్రింటర్స్ అధినేత విశ్వేశ్వరరావు, రాజాచంద్ర ఫౌండేషన్ వ్యవస్థాపకుడు దుర్గాప్రసాద్, కార్పొరేషన్ మేయర్ శిరీషా, మానవ వికాస వేదిక కనీ్వనర్లు సాకం నాగరాజు, శైలకుమార్, పలువురు కవులు, రచయితలు, సాహితీ వేత్తలు పాల్గొన్నారు. -
తనీష్ మహాప్రస్థానం
మహా ప్రస్థానం అనగానే మహాకవి శ్రీశ్రీ గుర్తుకు వస్తారు. ప్రస్తుతం ఓంకారేశ్వరా క్రియేషన్స్ పతాకంపై జానీ దర్శకత్వంలో ‘మహా ప్రస్థానం’ అనే చిత్రం రూపొందుతోంది. తనీష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘జర్నీ ఆఫ్ యాన్ ఎమోషనల్ కిల్లర్’ అనేది ఉపశీర్షిక. క్రైమ్ నేపథ్యంతో పాటు హృదయానికి హత్తుకునే ప్రేమకథతో ఈ సినిమా ఉంటుంది. చిత్రదర్శకుడు జానీ మాట్లాడుతూ– ‘‘కథానాయకుని కోణంలో సాగే కథ ఇది. ఎంతో భావోద్వేగంతో నిండిన ఈ కథకు తనీష్ చక్కగా సరిపోతాడు. హీరో పాత్రలోని ప్రేమ, బాధ, కోపం వంటి అన్ని భావాలను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: వసంత కిరణ్, యానాల శివ, సంగీతం: సునీల్ క«శ్యప్, పాటలు: ప్రణవం, కెమెరా: ఎం.ఎన్. బాల. -
కొత్త రచనల కాంతిలో శ్రీశ్రీ
ఉత్తమ కవికి ప్రతి రచనా ఒక సృజన సూర్య బింబం. అందులో ప్రయోగశీలతకు బ్రాండ్ అంబాసిడర్ శ్రీశ్రీ. 2018 వారి నూట ఎనిమిదో జయంతి వత్సరమే కాకుండా 35వ వర్ధంతి ఏడాది కూడా. ఇరవయ్యో శతాబ్దాన్ని పెనవేసుకుని తన రచనలను, ప్రపంచ గతులపై పెరిగే అవగాహనతో, దాదాపు పందొమ్మిది భిన్న ప్రక్రియల్లో రాసిన వారు శ్రీశ్రీ. వచనంలోనూ, పద్యం లోనూ కొత్త పోకడలు, పదాల సృష్టి, దేశాదేశాల్లో కవిత్వం ఎలా కొత్త పుంతలు తొక్కిందో తాను ఆకళింపు చేసుకుంటూ, తెలుగు సాహిత్యం లోనికి ఆయా ధోరణులను ప్రవేశ పెట్టడంలో నిత్య క్రియాశీలత, ఇవీ శ్రీశ్రీ మార్కు విక్రమార్క పరాక్రమాలు. రచనల్లో వారు ప్రస్తావించిన దేశ కాలాల నామ సూచి ఒక చోట చేర్చి, వాటి సాంస్కృతిక, చారిత్రిక, మనో వైజ్ఞానిక, శాస్త్రీయ, నాటక రంగ, అలాగే ఇతర రంగాలకు చెందిన వ్యక్తులు, స్థలాలు, పుస్తకాలు, సంఘటనలు, భౌగోళిక విశేషాలు ఇవన్నిటి నామావళి సచి త్రంగా వివరిస్తే, అదే ఒక వెయ్యి పేజీలకు మిం చిన శ్రీశ్రీ మేధో మాపనం అవుతుంది. తృతీయ సహస్రంలో, ఒక రచయిత బుద్ధి కొలతకు నూతన కొలబద్దలెన్నో ఏర్పడుతున్నాయి. అందులో అత్యంత ఉపయోగకరమైనది ఈ మేధో మాపనం. విశాఖలో శ్రీశ్రీ కళ్ళూ, కవితల వాకిళ్లూ నిత్యం కొండలు, కడలి సాక్ష్యంగా సజీవాలు. మహాప్రస్థానం బెంగాలీలో రచన అయితే, ఈ పాటికి డిజైనర్ ఎడిషన్ వేసేవారు. మహా ప్రస్థానం కలిగించే ఒక లోకోత్తర అనుభవానికి, ఇంకా మనం దూరంగానే ఉన్నాము. టాగూర్ 150వ జయంతికి మమతా బెనర్జీ, రాష్ట్ర ముఖ్యమంతి, టాగూర్ ఫోటో చేత ధరించి నివాళి యాత్రలో ముందు నడిచింది, గురజాడ, శ్రీశ్రీ ఎవరికీ మనం ఇలా గౌరవాలు ఇవ్వము. శ్రీశ్రీలో ఎందరో ఇంజనీర్లు, డాక్టర్లూ, పదులకొద్దీ ప్రొఫెసర్లూ, భాషావేత్తలు, భిన్న వయస్కుల పౌర సమాజం, ప్రపంచం అంత నిండుగా ఉన్నారు. అందుకే ఆయన రచనలు, కొత్త నిర్మాణాలు చేస్తాయి భావనాలోకంలో. రచయిత్రి జగద్ధాత్రి చేసే పరిశోధన ప్రస్తావనతో విశాఖలో, మహాకవి నూతన లభ్య రచనల పరిచయ సభ జరుగుతున్నది. విశాఖ శ్రీశ్రీ జన్మస్థలంగా, మహాప్రస్థాన మాతృభూమిగా, ఈ కొత్త రచనల కాంతిలో శ్రీశ్రీ సృజన సూర్య బింబ దీప్తులు, మరింత వర్ణ సంభరితం కావాలన్న ఉత్పాదక యాత్రలో, తెలుగు వారి ఆకాంక్షలు, ఆశీస్సులు కోరుతున్నాము. జూన్ 14 సాయంత్రం ఆరు గంటలకు, విశాఖ పౌర గ్రంథాలయంలో, మొజాయిక్ సాహిత్య సంస్థ నిర్వహణలో జరుగనున్న సభలో ఈ నూతన రచనలను, రాష్ట్ర సీపీఐ నాయకులు జె.వి.సత్యనారాయణమూర్తి లోకార్పణ చేస్తారు. పలు రంగాల ప్రముఖులు పాల్గొనే సభలో వక్తలు ఈ రచనల పరి చయం చేస్తారు. రామతీర్థ, ప్రముఖ కవి, రచయిత మొబైల్ : 98492 00385 -
కవి, సాహితీ విమర్శకుడు అద్దేపల్లి కన్నుమూత
ప్రముఖ కవీ, సాహితీ విమర్శకుడు అద్దేపల్లి రామ్మోహన్(80) బుధవారం కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాయన ఇవాళ కాకినాడలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. విమర్శకుడిగా పేరుగాంచిన డాక్టర్ అద్దేపల్లి రామ్మోహన్ రావ్ 1936 సెప్టెంబర్ 6న మచిలీపట్నంలో సుందర్ రావ్, రాజరాజేశ్వరి దంపతులకు జన్మించారు. సముద్రం నానేల, కాలం మీద సంతకం, పొగ చూరిన ఆకాశం, గోదావరి నా ప్రతిబింబం లాంటి కవితా సంపుటాలు, శ్రీశ్రీ కవితా ప్రస్థానం కుందుర్తి కవితా వైభవం 'అభ్యుదయ విప్లవ కవితలు, సిద్ధాంతాలు, శిల్పరీతులు' మొదలైన విమర్శా గ్రంథాలు వెలువరించారు. 60 ఏళ్ళ సాహితీ ప్రస్థానంలో అనేక వ్యాపాలు కవితలు వివిధ పత్రికల్లో ప్రచురించారు. ఆయన సాహితీ కృషిని గుర్తించి బోయి భీమన్న అవార్డు, తిలక్ పురస్కారం, తమిళనాడు చిన్నప్ప భారతి అవార్డు, నాగభైరవ అవార్డులు ఆయనను వరించాయి. ప్రపంచీకరణను వ్యతిరేకించిన తొలి తెలుగు కవి రామ్మోహన్ ఆయనే. కవిత్వం, విమర్శ ఆయనకు రెండు కళ్లు. 25కు పైగా కవితా సంకలనాలు. 600కు పైగా కవితా సంకలనాలకు ముందు మాటలు రాశారు. శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని సమీక్షించిన తొలి విమర్శకులు రామ్మోహన్. ఆధునిక కవిత్వం సిద్దాంతాలు, చింతరీతులు అంశాలపై ఆయన చేసిన పరిశోధనలకు డాక్టరేట్ పొందారు.