తనీష్‌ మహాప్రస్థానం | Tanish Mahaprasthanam to take audience on emotional ride | Sakshi
Sakshi News home page

తనీష్‌ మహాప్రస్థానం

Published Sun, Dec 1 2019 5:48 AM | Last Updated on Sun, Dec 1 2019 5:48 AM

Tanish Mahaprasthanam to take audience on emotional ride - Sakshi

తనీష్‌

మహా ప్రస్థానం అనగానే మహాకవి శ్రీశ్రీ గుర్తుకు వస్తారు. ప్రస్తుతం ఓంకారేశ్వరా క్రియేషన్స్‌ పతాకంపై జానీ దర్శకత్వంలో ‘మహా ప్రస్థానం’ అనే చిత్రం రూపొందుతోంది. తనీష్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘జర్నీ ఆఫ్‌ యాన్‌ ఎమోషనల్‌ కిల్లర్‌’ అనేది ఉపశీర్షిక. క్రైమ్‌ నేపథ్యంతో పాటు హృదయానికి హత్తుకునే ప్రేమకథతో ఈ సినిమా ఉంటుంది. చిత్రదర్శకుడు జానీ మాట్లాడుతూ– ‘‘కథానాయకుని కోణంలో సాగే కథ ఇది. ఎంతో భావోద్వేగంతో నిండిన ఈ కథకు తనీష్‌ చక్కగా సరిపోతాడు. హీరో పాత్రలోని ప్రేమ, బాధ, కోపం వంటి అన్ని భావాలను ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తారు’’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: వసంత కిరణ్, యానాల శివ, సంగీతం: సునీల్‌ క«శ్యప్, పాటలు: ప్రణవం, కెమెరా: ఎం.ఎన్‌. బాల.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement