Mahasivaratri Brahmotsavam
-
శ్రీశైలక్షేత్రంలో కొనసాగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
-
ఊరూవాడా శివనామ స్మరణ
వేములవాడ, హన్మకొండ కల్చరల్, రామగిరి(నల్లగొండ): ‘పరమేశ్వరా.. పాహిమాం.. శివ శివ శంకర శంభో.. శంకర’నామస్మరణతో శివాలయాలు, శైవ క్షేత్రాలు, దేవస్థానాలు మార్మోగాయి. శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శుక్రవారం రాత్రి నుంచే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలన్నీ పోటెత్తాయి. ఎటుచూసినా శివాలయాలు భక్త జనసంద్రంతో కిటకిటలాడాయి. శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులకు తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. వేయిస్తంభాల ఆలయంలో రుద్రేశ్వరునికి వైభవంగా.. హనుమకొండలోని చారిత్రాత్మక శ్రీరుద్రేశ్వర స్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో శనివారం మహాశివరాత్రి ఉత్సవాలు మహావైభవంగా జరిగాయి. సాయంత్రం 6.45గంటలకు శ్రవణా నక్షత్రయుక్త గోధూళి సింహాలగ్న సుముహూర్తమున శ్రీరుద్రేశ్వరస్వామి శ్రీరుద్రేశ్వరి అమ్మవారి కల్యాణం నిర్వహించారు. రాత్రి 12గంటలకు లింగోద్భవకాల పూజలు జరిపారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, చల్లా ధర్మారెడ్డి, సీపీ రంగనాథ్ తదితర ప్రముఖులు రుద్రేశ్వరునికి అభిషేకాలు చేశారు. నల్లగొండ పట్టణ శివారులోని పానగల్లు ఛాయా సోమేశ్వరాలయం భక్తజనంతో కిటకిటలాడింది. వేములవాడలో.. రాజన్నను దర్శించుకునేందుకు దాదాపు 3 లక్షల మంది వరకు భక్తులు వేములవాడకు తరలివచ్చారు. స్వామి వారి దర్శనానికి దాదాపు 10 గంటల సమయం పట్టింది. శివదీక్షాపరులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. సాయంత్రం 6 గంటలకు వేదమూర్తులచే మహాలింగార్చన వైభవోపేతంగా సాగింది. మహాజాతరను పురస్కరించుకొని ఆర్జీత సేవలను రద్దు చేసి, లఘు దర్శనాలను మాత్రమే అనుమతించారు. భక్తుల రద్దీ భారీగా ఉండడంతో క్యూలైన్లలో నిల్చునేందుకు ఇబ్బందులు పడ్డారు. సొమ్మసిల్లి పడిపోయిన భక్తులను ప్రథమ చికిత్స కేంద్రాలకు తరలించారు. ఏపీలో పోటెత్తిన శైవ క్షేత్రాలు ఏపీలోని ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం, పల్నాడు జిల్లా నరసరావుపేట సమీపంలోని ప్రము ఖ శైవక్షేత్రం కోటప్పకొండ, దక్షిణ కైలాసంగా పేరొందిన శ్రీకాళహస్తి లక్షలాదిమంది భక్తులతో పోటెత్తాయి. కోటప్పకొండ ప్రత్యేకతైన ప్రభల ఉత్సవం ఘనంగా జరిగింది. ప్రసిద్ధి చెందిన పంచారామాలైన దాక్షారామం శ్రీభీమేశ్వరస్వామి దేవస్థానం, సామర్లకోట శ్రీకుమార భీమారామం, అమరావతి శ్రీఅమరేశ్వర స్వామి దేవస్థానం, పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి దేవస్థానం, భీమవరం సోమేశ్వరస్వామి గుడి యాత్రికులతో కిటకిటలాడాయి. మహానందిలో పూజలు జరిపారు. -
మమ్మేల రావయ్యా.. మా శివయ్య!
శ్రీశైలం టెంపుల్/అమరావతి/శ్రీకాళహస్తి రూరల్: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీశైలంలో బుధవారం స్వామిఅమ్మవార్లకు నిర్వహించిన రథోత్సవం నేత్రానంద భరితంగా సాగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయం ముందు గల గంగాధర మండపం వద్దకు పల్లకీలో మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చారు. అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవమూర్తులను రథోత్సవంపై ఆశీనులను చేసి సాత్విక బలి సమర్పించారు. అశేష భక్తజనం శివనామాన్ని స్మరిస్తుండగా ఆలయం పురవీధుల్లో రథోత్సవం కన్నుల పండువగా సాగింది. రథోత్సవానికి ముందు కళాకారుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం స్వామిఅమ్మవార్లకు ఆలయపుష్కరిణి వద్ద తెప్పోత్సవం నిర్వహించారు. శ్రీశైలంలో రథోత్సవానికి వేలాదిగా తరలివచ్చిన భక్తులు అంగరంగ వైభవంగా అమరేశ్వరుని దివ్యరథోత్సవం అమరావతి క్షేత్రంలో వేంచేసియున్న శ్రీబాలచాముండికా సమేత అమరేశ్వరస్వామి వారి దివ్యరథోత్సవం బుధవారం వైభవంగా సాగింది. అమరావతి, ధరణికోట నుంచి చింకా, ఆలపాటి, కామిరెడ్డి, కోనూరువారి వంశస్తులు తమ గుర్రాలకు రంగులు వేసి ఊరేగింపుగా తెచ్చి స్వామివారికి సమర్పించారు. ఈ గుర్రాలను రథంపై ముందు భాగంలో అలంకరించారు. అమరేశ్వరుడిని గాలిగోపురంలో ఉంచి పూజలు నిర్వహించారు. స్వామి వారి దివ్యరథానికి ఆలయ స్థానాచార్యుడు కౌశిక చంద్రశేఖరశాస్త్రి పర్యవేక్షణలో పలు పూజలు నిర్వహించి రథోత్సవ ప్రారంభ క్రతువును పూర్తి చేశారు. రథాన్ని సర్వాంగసుందరంగా పూలతో అలంకరించి ఉభయదేవేరులతో కూడిన అమరేశ్వరుని అందులో కొలువుదీర్చారు. ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, ఆలయ అనువంశిక ధర్మకర్త రాజావాసిరెడ్డి మురళీకృష్ణప్రసాద్‌లు కొబ్బరికాయ కొట్టి రథోత్సవాన్ని ప్రారంభించారు. వేలాది మంది భక్తులు స్వామి వారి రథాన్ని క్రోసూరు జంక్షన్ వరకు లాగారు. అక్కడ నుంచి వెనుదిరిగి శివనామస్మరణ చేస్తూ రథాన్ని యథాస్థానానికి చేర్చారు. నేత్రపర్వంగా ముక్కంటీశుని రథోత్సవం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తిలో ముక్కంటీశుని రథోత్సవం బుధవారం కనులపండువగా సాగంది. రథోత్సవ సమయంలో ఉత్సవమూర్తులకు దేవస్థానానికి చెందిన స్వర్ణాభరణాలను అలంకరించడంతో భక్తులు స్వామి, అమ్మవార్ల తేజస్సును చూసి పరవశించిపోయారు. రాత్రి 8 గంటలకు స్వామి అమ్మవార్ల తెప్పోత్సవం నిర్వహించారు. రథోత్సవంలో స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
శివోహం..
సాక్షి నెట్వర్క్: ‘హరహర మహాదేవ.. శంభోశంకరా..’ అంటూ మంగళవారం రాష్ట్రం ప్రతిధ్వనించింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ముక్కంటి దర్శనానికి రాష్ట్రవ్యాప్తంగా శివాలయాలు భక్తులతో పోటెత్తాయి. ఏ నోట విన్నా శివనామ స్మరణే వినిపించింది. అభిషేకాలతో భక్తవశంకరుడిని ప్రసన్నం చేసుకున్నారు. పలుచోట్ల పరమేశ్వరుడిని మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తదితర ప్రజాప్రతినిధులు దర్శించుకున్నారు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు దేదీప్యమానంగా జరిగాయి. శ్రీగిరి క్షేత్రం జనసంద్రమైంది. నల్లమల కొండలు శివనామ స్మరణతో పరవశించాయి. మల్లన్న, భ్రామరీలకు విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మంగళవారం రాత్రి శివపార్వతుల కల్యాణోత్సవం కమనీయంగా జరిగింది. పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు, పరిమళభరిత పుష్పాలతో అలంకరించిన స్వామి, అమ్మవారు.. వేదమంత్రాల నడుమ ఒక్కటయ్యారు. ఆదిదంపతుల కల్యాణ మహోత్సవాన్ని తిలకించిన భక్తులు హరోంహరా.. శంభో.. శివశంకరా అంటూ పరవశించారు. నీలకంఠుడికి పాగాలంకరణ శ్రీశైలంలో మహాశివరాత్రి ఉత్సవాల్లో శివుడి లింగోద్భవ సమయంలో నిర్వహించే పాగాలంకరణ ప్రత్యేకం. రాత్రి 10 గంటల నుంచి పాగాలంకరణ ప్రారంభమైంది. ప్రకాశం జిల్లా హస్తినాపురానికి చెందిన చేనేత కార్మికుడు పృధ్వీ వెంకటేశ్వర్లు పాగాలంకరణ చేశారు. పండితులు, ప్రధాన అర్చకులు శాస్త్రోక్తంగా జ్యోతిర్లింగ మల్లికార్జునుడికి లింగోద్భవకాల మహన్యాస ఏకాదశ రుద్రాభిషేకానికి శ్రీకారం చుట్టారు. వెంటనే దేదీప్యకాంతులతో కనువిందుచేసిన విద్యుద్దీపాలను ఆపేశారు. క్షణాల్లో శంభో శివశంభో.. ఓం నమఃశివాయ అంటూ భక్తుల శివనామస్మరణ నలుమూలల నుంచి మిన్నంటింది. పృధ్వీ వెంకటేశ్వర్లు స్వామి గర్భాలయ విమాన గోపురాన్ని, ముఖమండపంపై ఉన్న 14 నందులను కలుపుతూ పాగాలంకరణ చేశారు. అనంతరం వెలిగిన విద్యుద్దీపాల కాంతుల్లో పాగాలంకరణ భక్తులను కనువిందు చేసింది. అనంతరం కల్యాణోత్సవం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం నిర్వహించిన ప్రభోత్సవం కనులపండువగా సాగింది. లక్షలాదిగా భక్తులు వచ్చిన వాహనాలతో శ్రీశైలంలో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ఔటర్ రింగ్‌రోడ్డులో ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాలు నిండిపోవడంతో అనేక వాహనాలను రోడ్డుమీదే నిలపాల్సి వచ్చింది. దీంతో మంగళవారం రాత్రి 7 గంటల నుంచి తెలంగాణలోని మన్ననూరు ఫారెస్ట్ చెక్‌పోస్ట్ నుంచి శ్రీశైలానికి వచ్చే వాహనాలను నిలిపేశారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో.. శ్రీకాళహస్తీశ్వరాలయం మంగళవారం తెల్లవారుజామున మూడుగంటల నుంచే భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచి రాత్రి వరకు శాస్త్రోక్తంగా అభిషేక పూజలు నిర్వహించారు. ఉదయం స్వామి, అమ్మవారు ఇంద్రవిమానం–చప్పరంపై ఊరేగారు. రాత్రి స్వామి నంది వాహనంపై, అమ్మ సింహ వాహనంపై నాలుగు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. మంగళవారం అర్ధరాత్రి తరువాత ఒంటిగంట నుంచే దేవస్థానంలో లింగోద్భవ దర్శనానికి ఏర్పాట్లు చేశారు. బుధవారం ఉదయం పదిగంటలకు రథోత్సవం నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. భక్తజనసంద్రంగా కోటప్పకొండ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండ భక్తులతో పోటెత్తింది. త్రికోటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాదిమంది భక్తులు తరలివచ్చారు. 17 భారీ విద్యుత్ ప్రభలు తరలివచ్చాయి. స్వామికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పట్టువస్త్రాలు, వెండిప్రభను సమర్పించారు. త్రికోటేశ్వరస్వామిని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సోమయాజులు, జస్టిస్ కృష్ణమనోహర్, జస్టిస్ పద్మావతి దర్శించుకున్నారు. పంచారామమైన అమరావతిలోని శ్రీబాలచాముండికా సమేత అమరేశ్వరస్వామి ఆలయంలో స్వామికి ఏక రుద్రాభిషేకాలను, అమ్మవారికి కుంకుమార్చనలు చేశారు. రామతీర్థంలో.. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థానికి భక్తులు పోటెత్తారు. వైష్ణవాలయమైనా ఏటా మాదిరే శివరాత్రికి భక్తులు హాజరై శ్రీరాముడిని, పక్కనే ఉన్న ఉమాసదాశివుడిని పూజించారు. ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు బోడికొండపై శిఖరజ్యోతి వెలిగించారు. శ్రీకాకుళం జిల్లాలోని శ్రీముఖలింగంలో భక్తులు పోటెత్తారు. వైఎస్సార్ జిల్లాలోని శైవక్షేత్రాల్లో అభిషేకాలు, పూజలు చేశారు. పంచారామక్షేత్రాల్లో.. ఉభయ గోదావరి జిల్లాల్లోని పంచారామ క్షేత్రాలైన ద్రాక్షారామ, భీమారామ, క్షీరారామ, కుమారభీమారామాల్లో పరమశివుడిని, అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. పిఠాపురం పాదగయ క్షేత్రంలో శ్రీ ఉమాకుక్కుటేశ్వరస్వామి, రాజరాజేశ్వరీదేవిలను, శక్తిపీఠమైన పురుహూతిక అమ్మవారికి భక్తులు పూజలు చేశారు. వీరంపాలెంలోని శ్రీ బాలాత్రిపుర సుందరి పీఠంలో స్పటిక లింగానికి నిర్వహించిన పూజల్లో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆకుల శేషసాయి పాల్గొన్నారు. విశాఖలో మహాకుంభాభిషేకం మహా శివరాత్రిని పురస్కరించుకొని టి.సుబ్బిరామిరెడ్డి ఆధ్వర్యంలో విశాఖ సాగరతీరంలో మంగళవారం 37వ మహాకుంభాభిషేకం ఘనంగా జరిగింది. శారదా పీఠా«ధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి, స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పంచామృతం, సుగంధద్రవ్యాలు, పళ్లరసాలతో కోటి ఎనిమిది లక్షల శివలింగాలకు మహాకుంభాభిషేకం నిర్వహించారు. -
విశాఖ సాగరతీరాన మహాశివరాత్రి వేడుకలు
-
తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు
-
కోటప్పకొండ జాతర : తృటిలో తప్పిన ప్రమాదం
-
కోటప్పకొండ జాతర : తృటిలో తప్పిన ప్రమాదం
సాక్షి, గుంటూరు : మహా శివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలు ముస్తాబవుతుండగా.. కోటప్పకొండ జాతరలో అపశృతి చోటు చేసుకుంది. తిరునాళ్లలో భాగంగా కొండపైకి తరలిస్తున్న ప్రభ ఒక్కసారిగా విరిగిపడింది. ఉప్పలపాడు నుంచి ఊరెగింపుగా వస్తుండగా ఈ ఘటన జరిగింది. అయితే ఈ ఘటనలో భక్తులకు చిన్నపాటి గాయాలు తగిలాయని సమాచారం. రేపటి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇప్పటికే భక్తులు వేలాదిగా తరలివస్తుండగా.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శైవ క్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి. -
శివరాత్రి బ్రహ్మోత్సవాలపై కరువు ఎఫెక్ట్
శ్రీశైలానికి తగ్గిన భక్తజనం తీవ్ర వర్షాభావ పరిస్థితులతో పాటు ఇంటర్ పరీక్షల ప్రభావం ఆత్మకూరు: శ్రీశైలంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలపై తీవ్ర వర్షాభావ పరిస్థితులు, ఇంటర్ పరీక్షల ప్రభావం కనిపించింది. దీంతో ఈ సారి ఉత్సవాలకు భక్తజనం తగ్గారు. బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన ఫిబ్రవరి 29వ తేదీ నుంచి ఈ నెల 6వ తేదీ సాయంత్రం వరకు శ్రీశైలంలో భక్తుల రద్దీ అంతంత మాత్రంగానే కనిపించింది. ఆదివారం నుంచి క్యూలలో రద్దీ కొంత పెరిగింది. గత ఏడాది స్వైన్ ఫ్లూ, అంతకు మునుపు ఏడాది రాష్ట్ర విభజన ఎఫెక్ట్‌తో భక్తుల రద్దీ తగ ్గగా ఈసారి తీవ్రవర్షాభావం, ఇంటర్ పరీక్షల ప్రభావం కనిపించింది. శనివారం వరకు భక్తులు రెండు,మూడు గంటల వ్యవధిల్లోనే మల్లన్న దర్శనాలు ముగించుకుని బయటకు వచ్చారంటే వాటి ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉందో చెప్పవచ్చు. భక్తుల రద్దీ తగ్గడానికి గల కారణంపై శివస్వాములను ఆరా తీయగా తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు, కరువు కాటకాలతో కుటుంబసమేతంగా శ్రీశైలానికి రాలేకపోయామని చెప్పుకొచ్చారు. ఎప్పుడూ కుటుంబంతో వచ్చేవాళ్లం: శివరాత్రి సందర్భంగా శ్రీశైలక్షేత్రానికి రావడం ఇది ఎనిమిదోసారి. ఏడుసార్లు కుటుంబసభ్యులతో వచ్చాను. ఈ ఏడాది కొంత ఇబ్బందులు ఉండడంతో అందరం రాలేకపోయాం.ఒక్కడినే వచ్చాను.ఈ సంవత్సరం వర్షాలు కురవక పంటలు చేతికి రాలేదు. దేవుడు కరుణిస్తే వచ్చేసారి అందరం కలిసి వస్తాం. - శేషిరెడ్డి, మైదుకూరు ఒక్కడినే వచ్చాను: శివమాలతో శ్రీశైల క్షేత్రానికి ఒక్కడినే వచ్చాను. గతంలో కుటుంబ సమేతంగా వచ్చి మూడు,నాలుగు రోజులు ఇక్కడే ఉండేవాళ్లం. పాగాలంకరణ అనంతరం మాలను తొలగించి మొక్కులను చెల్లించి స్వగ్రామాలకు వెళ్లేవాళ్లం.ఈ ఏడాది సరైన పంటలు పండకపోవడంతో ఒక్కడిని రావడం కూడా ఇబ్బందిగా మారింది. - పోలయ్య, గుడిపాడు, -
వాయులింగేశ్వరస్వామి రధోత్సవం