mahila committee
-
పవన్ తక్షణమే క్షమాపణ చెప్పాలి : వాసిరెడ్డి పద్మ
-
పవన్ కల్యాణ్ కు నోటీసులు జారీ
-
51 మందితో జిల్లా మహిళా కాంగ్రెస్ కమిటీ
37 మండలాలకు మహిళా కమిటీలు జిల్లా అధ్యక్షురాలు పోశాల పద్మ వరంగల్ : జిల్లా మహిళా కాంగ్రెస్ కమిటీ పూర్తి స్థాయి కార్యవర్గాన్ని జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పోశాల పద్మ ప్రకటించారు. హన్మకొండలోని డీసీసీ భవన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిటీ జాబితాను విడుదల చేశారు. పీసీసీ మహిళా అధ్యక్షురాలు నేరెళ్ల శారద ఆమోదంతో జిల్లా కమిటీలో 51మందికి స్థానం కల్పించినట్లు తెలిపారు. 13 మంది ఉపా««దl్యక్షులు, 18 మంది ప్రధాన కార్యదర్శులు, 20 మంది కార్యదర్శులను నియమించామని పేర్కొన్నారు. ఉపా««దl్యక్షురాళ్లుగా రాజమల్లమ్మ, కాసారపు నర్మద, ఇర్సవడ్ల ఝూన్సీరాణి, కొమురం ధనలక్ష్మి, కామటి పార్వతి, గుండాల అరుణారెడ్డి, ఎడబోయిన మంగమ్మ, బొమ్మగాని రమ, పసునూరి సువర్ణ, లాలిగాపు లక్ష్మి, తోట విజయ, జాలిగపు లక్ష్మి, వనజారెడ్డి, ప్రధాన కార్యదర్శులుగా రామగిరి విజయ, గుర్రం జ్యోతి, సింగారపు అరుణ, జక్కుల విజయ, కౌడగాని ఉమ, వజ్జ వెంకటలక్ష్మి, కొంగరి సుమలత, తుమ్మల సుధారాణి, బండారి కళ్యాణి, ఐలాపురం పారిజాతం, యాల పుష్పలీల, జన్ను ప్రమీల, నసీం జహాం, శోభ, పులి వెంకటలక్ష్మీ, ఆకారపు నర్మద, గడ్డం జ్యోతి, యారపు లల్లీపుష్పతోపాటు మరో 10మంది కార్యదర్శులకు కార్యవర్గంలో చోటు కల్పించినట్లు వివరించారు. జిల్లా కమిటీతోపాటు జిల్లాలోని 37 మండలాలకు అధ్యక్షులను నియమించినట్లు లె లిపారు. సమావేశంలో మద్దెల శోభారాణి, నసీంజాహా, బండారు కళ్యాణి, కాస్క లక్ష్మి, పార్వతమ్మ, యాకూబీ, ప్రమీల, మేరీలు పాల్గొన్నారు. మండల మహిళా అధ్యక్షులు వీరే... తాళ్లపెల్లి నీలారాణి (హసన్‌పర్తి), ఎలమకంటి అరుణ (వర్ధన్నపేట), జన్ను మంజుల (హన్మకొండ), బొమ్మెర జ్యోతి (పర్వతగిరి), తూనం రోజా (తొర్రూరు), ఎడ్ల హరిత(దేవరుప్పుల), అంబటి జయశ్రీ (రాయపర్తి), మల్లమ్మ (పాలకుర్తి), నేతి ఉమ (కొడకండ్ల), తాటిపర్తి నాగేంద్ర (ములుగు), పసునూటి జయక్క (వెంకటాపురం), పన్నాల పూలమ్మ (గోవిందరావుపేట), పాయం కవిత (తాడ్వాయి), పినగాని సంతోష (ఏటూరునాగారం), ఆళ్ల రాధారాణి (మంగపేట), సిద్దబోయిన రాధ (కొత్తగూడ), దారావత్ అమ్మి (చెన్నారావుపేట), మొడగాని స్వరూప (నెక్కొండ), ఇడ్ల నాగమణి (ఖానాపురం), వాంకుడోతు కవిత (నర్సంపేట రూరల్), చెల్పూరి జ్యోతి (నల్లబెల్లి), వజినపల్లి శారద (నర్సంపేట అర్బన్), ముండ్రాతి రాగమణి (ఆత్మకూరు), గంట కళావతి (పరకాల), చొప్పరి స్వరూప (పరకాల), గుర్రం గీత (సంగెం), బోడ సుమిత్ర (గూడూరు), గట్ల సునీత (మహబూబాబాద్), వలబోజు పద్మ (రఘునాథపల్లి), చింబుల స్వాతి (స్టేçÙన్ఘనపురం), బత్తిని పావని (జఫర్‌గఢ్), ఎర్ర పూలమ్మ (ధర్మసాగర్), రేకులపల్లి రాజేశ్వరీ (చేర్యాల), నాంపల్లి సరోజన (మద్దూరు), కళ్యాణం లలిత (నర్మెట్ట), గిరిబోయిన భాగ్యలక్ష్మి (బచ్చన్నపేట), టి.రాధిక (జనగామ టౌన్) నియమితులయ్యారు. -
అందని ఉచిత వడ్డీ
చీపురుపల్లి : మహిళలను ఆర్థికంగా ఆదుకునేందుకు స్వయం సహా యక సంఘాలకు వడ్డీలేని రుణా లు అందిస్తున్నట్టు ప్రభుత్వంచెబుతోంది.అయితే వాస్తవ పరి స్థితి మాత్రం దీనికి విరుద్దంగా ఉంది. మహిళా సం ఘాలకు 2012లో రావాల్సిన వడ్డీ రాయితీ ఏడాదిన్నర గడిచినా ఇంతవరకూ రాలేదు. మరికొద్ది రోజుల్లో ప్రభు త్వం గడువు తీరుతున్న సమయంలో ఇంక రాయితీ రాదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రుణాలు తీసుకున్న మహిళా సంఘాల సభ్యులు ఏకంగా రూపాయి వడ్డీ చెల్లించుకునే దుస్థితి ఏర్పడింది. దీంతో మండలంలో మహిళా సంఘాల సభ్యులు లబో దిబోమంటున్నారు. మండలంలో 17 పంచాయతీ ల్లోను 1014 మహిళా సంఘాలు ఉన్నాయి. వీరందరూ అప్పటి వరకూ పావలావడ్డీపై రుణాలు పొందేవారు. తరువాత ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం వడ్డీలేని రుణాలు పొందేందుకు అర్హత పొందారు. దీనిలో భాగంగా రుణాలు తీసుకున్నారు. 2012 జనవరి నుం చి జూన్ వర కూ వీరికి ప్రభుత్వం వడ్డీలను బ్యాంకులకు జమ చేయలేదు. దీంతో మహిళా సంఘాలు చేసేది లేక వారు తీసుకున్న రుణాలకు వడ్డీ చెల్లిం చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. మండల వ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాలకు 2012 లో ఆరు నెలలకు గాను ఏకంగా ప్రభుత్వం రూ.75 లక్షలు బకాయి పడింది. 1014 మహిళా సంఘాలకు గాను ఒక్కో నెలకు 11 నుంచి 15లక్షల రూపాయిలు వరకు బకాయి లు ఉన్నాయి. 2012 జూన్ తరువాత వడ్డీ రాయితీ కల్పించిన ప్రభుత్వం పాత బకా యిలు మాత్రం పట్టించుకోవడం లేదని మహిళలు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికా రులు స్పందించి తమకు ఆరు నెలలకు రావాల్సిన వడ్డీ రాయితీలు విడుదల చేయాలని కోరుతున్నారు. -
కాంగ్రెస్ పిల్లిమొగ్గలు
కాకినాడ, న్యూస్‌లైన్ : కాకినాడ నగర మహిళా కాంగ్రెస్ కమిటీ నియామకంపై ఆ పార్టీ పిల్లిమొగ్గలు వేసింది. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆకుల లలిత ఈనెల 24న స్వయంగా జారీ చేసిన నియామక ఆదేశాలను శనివారం వెనక్కి తీసుకున్నారు. ఈ నియామకంతో జరిగిన పరిణామాలతో కాకినాడ మాజీ మేయర్ సరోజ శుక్రవారం డీసీసీ కార్యాలయం ఎదుట బైఠాయించారు. దీంతో వివాదం రాష్ట్ర కమిటీకి దృష్టికి వెళ్లింది. జిల్లాకు చెందిన కొందరు నేతలు నామాల బ్రహ్మకుమారి అధ్యక్షురాలిగా ఏర్పాటు చేసిన కాకినాడ నగర మహిళా కాంగ్రెస్ కమిటీని రద్దు చేయాల్సిందిగా ఒత్తిడి చేశారు. దానికి తలొగ్గిన లలిత ఈ నెల 24న ప్రకటించిన కమిటీని రద్దు చేస్తున్నట్టు డీసీసీ అధ్యక్షుడు దొమ్మేటి వెంకటేశ్వర్లుకు లేఖ పంపారు. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని, త్వరలోనే మరో కమిటీని ప్రతిపాదించాలని ఆ లేఖలో పేర్కొన్నారు. పట్టుమని నాలుగు రోజులు గడవకుండానే ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకోవడం పార్టీలో చర్చనీయాంశమైంది. ఇలా పిల్లి మొగ్గలు వేయడం వల్ల పార్టీ ప్రతిష్ట మంటగలుస్తుందంటూ పలువురు నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ ప్రాతిపదికన నియామకాలు చేస్తున్నారో, ఎందుకు రద్దు చేస్తున్నారో అర్థం కావడం లేదని పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. గతంలో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సమర్థంగా పనిచేసిన బ్రహ్మకుమారిని తొలగించారన్న సమాచారం ఆ వర్గానికి మింగుడు పడడం లేదు. పీసీసీ అధ్యక్షుడిపైనా, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిపైనా ఒత్తిడి తెచ్చి కమిటీని రద్దు చేయించారని తెలియడంతో ఈ వ్యవహారాన్ని మాజీ మేయర్ సరోజ వర్గీయులు అఖిల భారత మహిళా విభాగం అధ్యక్ష, ఉపాధ్యక్షులు దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. దీంతో ఢిల్లీకి చెందిన కొందరు ముఖ్యమహిళా నేతలు సరోజతో, ఇతర నేతలతో కూడా మాట్లాడారని చెబుతున్నారు. కమిటీ యథావిధిగా కార్యకలాపాలు కొనసాగించాలని తమకు సూచించారని సరోజ వర్గీయులు అంటున్నారు. ఏదేమైనా బ్రహ్మకుమారి, ఆమెతో పాటు నియమితులైన నూతన కార్యవర్గ సభ్యులు శనివారం పార్టీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. కమిటీని రద్దు చేస్తున్నట్టు తమకు ఎలాంటి సమాచారం లేదని, కాకినాడ నగరంలో పార్టీ పటిష్టత కోసం శ్రమిస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ కమిటీ విషయంలో ఆదివారం డీసీసీ అధ్యక్షుడు దొమ్మేటి ఎలా వ్యవహరిస్తారన్నది ఆసక్తిగా మారింది.