మహిళా మండలి భవనంలో జిమ్ పెడతారా?
రాజేంద్రనగర్: మహిళా మండలికి చెందిన భవనంలో జిమ్ ఏర్పాటు చేయటంపై రంగారెడ్డి జిల్లా మైలార్ దేవుపల్లిలోని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేటర్ తోకల శ్రీనివాస్‌రెడ్డి జిమ్‌కు సంబంధించిన పరికరాలను ఆ భవనంలో ఉంచగా మంగళవారం మహిళలంతా అక్కడికి తరలివచ్చి ధర్నాకు దిగారు. పరికరాలను తీసుకు వచ్చి బయటపడేశారు. మహిళల ఫిర్యాదు మేరకు స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్, రాజేంద్రనగర్ డిప్యూటీ కమిషనర్ దశరథ్ అక్కడికి చేరుకున్నారు. వారితో మాట్లాడి, మహిళా మండలికే భవనాన్ని కేటాయిస్తున్నట్లు స్పష్టం చేశారు. దీంతో మహిళలు ఆందోళన విరమించారు.