రమేష్ కోసం గాలింపు ముమ్మరం
భూపాలపల్లి : బ్యాంకు దోపిడీలో ప్రధాన నిందితుడు రమేష్ ఆచూకీ నేటికీ లభించలేదు. చోరీ జరిగి పది రోజులు గడిచినా పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఈనెల 15న పట్టణంలోని ఏపీజీవీబీ భూపాలపల్లి, ఆజంనగర్ బ్రాంచిల్లో అటెండర్ రమేష్ చోరీకి పాల్పడి లాకర్లలోని బంగారం, డబ్బు దోచుకెళ్లిన విషయం తెలిసిందే. కాగా, నిందితు డి భార్య రమాదేవి ఈనెల 22న పట్టుబడగా.. బంగా రం, రూ.2లక్షల నగదును పోలీసులు రికవరీ చేశారు. అయితే బంగారం పూర్తిస్థాయిలో రికవరీ చేసినప్పటి కీ అసలు నిందితుడి జాడ దొరకక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.
రమేష్ మహారాష్ట్రలోని గోదావరి సరిహద్దు గ్రామాల్లో తిరుగుతున్నట్లు సమాచారం. గతంలో తునికాకు కల్లాల్లో పని చేసినందున, ఆ పరిచయాలతో ఆయా గ్రామాల్లో తల దాచుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే గోదావరి సరిహద్దు గ్రామా ల్లో మావోయిస్టుల కదలికలు ఎక్కువగా ఉన్నాయని పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. ఈ మేరకు ఉన్నతాధికారులు సైతం గోదావరి పరీవాహక సరిహద్దు గ్రామాల్లోకి వెళ్లవద్దని సూచించినట్లు సమాచారం. గ్రామాల్లోకి వెళ్లే వీలు లేనప్పటికీ ఇరు రాష్ట్రాల సరిహద్దులో గల ముఖ్య పట్టణాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో నిందితుడి కోసం పోలీసు బృందాలు అలుపెరుగకుండా గాలింపు చేపడుతూనే ఉన్నాయి.