మజ్జిగ సరఫరా హెరిటేజ్ చేతికి
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మజ్జిగ సరఫరా పథకాన్ని సొంత కంపెనీ హెరిటేజ్‌కు కట్టబెట్టుకుంది. ఇప్పటికే చంద్రన్న సంక్రాంతి కానుకల్లో వరుసగా రెండేళ్లు హెరిటేజ్ నుంచి నెయ్యి కొనుగోలు చేసింది. తాజాగా ఏపీ మజ్జిగ సరఫరా పథకాన్ని కూడా హెరిటేజ్‌కే అప్పగించింది.
వడగాల్పుల నుంచి రక్షణ కోసమంటూ మజ్జిగ సరఫరాను ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 45 రోజుల పాటు మజ్జిగ సరఫరా చేస్తామంటూ స్వయంగా సీఎం చంద్రబాబు ప్రకటించారు. దీనికి సంబంధించి మజ్జిగ సరఫరాను అన్ని జిల్లాల్లో హెరిటేజ్ నుంచి కొనుగోలు చేయాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం కోసం జిల్లాకు రూ.3 కోట్లు చొప్పున రూ.39 కోట్లు కేటాయించింది. ఈ పథకాన్ని కూడా ప్రభుత్వం సహకార డైరీలకు అందకుండా చేసింది.