major parties
-
ప్రధాన పార్టీలకు తలనొప్పిగా మారిన చిన్న పార్టీలు
ప్రధాన పార్టీలకు తలనొప్పిగా మారిన చిన్న పార్టీలు -
చిన్న పార్టీల జోరు.. అధిక సీట్ల కోసం బేరసారాలు
లక్నో: ఢిల్లీ పీఠానికి దగ్గర దారిగా భావించే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనుండడంతో ఇప్పట్నుంచే ఆ రాష్ట్రంలో పొత్తులు ఎత్తులు, వ్యూహాలు ప్రతివ్యూహాలతో రాజకీయాలు వేడెక్కాయి. అందులోనూ చిన్న పార్టీల జోరు ఎక్కువగా కనిపిస్తోంది. కుల ప్రాతిపదికన ఏర్పడిన ఈ పార్టీలపై ప్రధాన పార్టీలు వల వేశాయి. వారిని తమ వైపు లాక్కుంటే ఓట్లు చీలకుండా ఉంటాయన్న ఉద్దేశంతో ఎన్నికల్లో వారిని కలుపుకొని వెళ్లాలని ప్రధాన పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. ఎందుకంటే కొన్ని వందల ఓట్లను ఈ పార్టీలు దక్కించుకున్నా ఫలితాలు తారుమారు అయ్యే అవకాశం అధికంగా ఉంది. దీంతో డజనుకి పైగా చిన్న పార్టీలు గొంతెమ్మ కోర్కెలకి దిగుతున్నాయి. అధిక సీట్లను ఆశిస్తూ బేరసారాలకు దిగుతున్నాయి. 2017 ఎన్నికల్లో వివిధ చిన్న పార్టీలకు చెందిన ఎనిమిది మంది అభ్యర్థులు వెయ్యి ఓట్ల తేడాతో విజయాన్ని సాధించినట్టు ఎన్నికల కమిషన్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. చిన్న పార్టీలకు ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంటాయని సమాజ్‌వాదీ పార్టీ చెబుతూ ఉంటే, బీజేపీ కూడా వారితో పొత్తుకు సన్నాహాలు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం సంస్థాగతంగా బలపడి తాము ఒంటరిపోరాటానికి దిగుతామని స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ గడువు 2022 మార్చి 14తో ముగియనుంది. ఆలోపే రాష్ట అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఏ పార్టీ సత్తా ఎంత అప్నాదళ్, నిషాద్ పార్టీ, జేడీ(యూ), ఆర్పీఐ, వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ)లతో పొత్తు పెట్టుకోవాలని బీజేపీ యోచిస్తోంది. అయితే సీట్ల సర్దుబాటు ఇంకా జరగలేదు. మత్స్యకారుల సంక్షేమం కోసం ఏర్పాటైన నిషాద్ పార్టీకి దాదాపుగా ఆరు లోక్‌సభ స్థానాల్లో గణనీయమైన ఓటు బ్యాంకు ఉంది. ఇక అప్నాదళ్ (ఎస్), ఓం ప్రకాశ్ రాజ్‌భర్ నేతృత్వంలోని సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీలకు (ఎస్బీఎస్పీ) ఓబీసీల్లోని కుర్మీ వర్గంపై పట్టు ఉంది. బీజేపీతో కలిసి 2017 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఎస్బీఎస్పీ నాలుగు స్థానాల్లో గెలుపొందింది. రాష్ట్ర మంత్రిగా కూడా ఉన్న ప్రకాశ్ రాజ్‌భర్ 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు మంత్రి పదవికి రాజీనామా చేసి బీజేపీ కూటమి నుంచి బయటకు వచ్చారు. సొంతంగా ఎన్నికల్లో పోటీ చేశారు. తూర్పు యూపీలో యాదవుల తర్వాత రాజ్భర్ల ప్రాబల్యమే ఎక్కువ. ఇటీవల ఓం ప్రకాశ్ రాజ్‌భర్ పార్టీ ఆధ్వర్యంలో 10 చిన్నాచితకా పార్టీలతో భగధారి సంకల్ప్ మోర్చా ఏర్పాటైంది. ఈ కూటమిలో అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ కూడా భాగస్వామిగా ఉంది. 100 సీట్లలో పోటీ చేయనుంది. బీజేపీ మినహా మరే ఇతర పార్టీలైనా తమతో చేతులు కలపవచ్చునని ఆ కూటమి పిలుపునిచ్చింది. ఇక సమాజ్‌వాదీ పార్టీకి రాష్ట్రీయ లోక్ దళ్, మహన్ దళ్, జన్వాడీ సోషలిస్టు పార్టీ, మరికొన్ని ఇతర పార్టీల మద్దతు ఉంది. మహన్ దళ్ పార్టీకి శక్య, సైని, మౌర్య, కుష్వాహ ఓబీసీ వర్గాల్లో పట్టు ఉంది. రాష్ట్రంలోని ఓబీసీ జనాభాల్లో వీరి ఓట్లే దాదాపు నలభై శాతం వరకు ఉన్నాయి. సంజయ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని జన్వాడీ సోషలిస్టు పార్టీకి బింద్, కశ్మప్ వర్గాల్లో మంచి పట్టు ఉంది. డజనుకు పైగా జిల్లాల్లో ఈ పార్టీ తన ప్రభావాన్ని చూపించగలదు. శివపాల్ యాదవ్ నాయకత్వంలోని ప్రగతి శీల సమాజ్‌వాదీ పార్టీ బీజేపీయేతర పార్టీలతో చేతులు కలపాలని ప్రణాళికలు రచిస్తోంది. గత ఎన్నికల్లోకి తొంగి చూస్తే.. ► 2012 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 200పైగా పార్టీలు తమ అభ్యర్థుల్ని బరిలో దింపాయి ► 2017 ఎన్నికల్లో ఏకంగా 290 పార్టీలు పోటీ చేశాయి ► ఎస్బీఎస్పీ పార్టీ ఎనిమిది స్థానాల్లో పోటీ చేస్తే నాలుగు స్థానాల్లో గెలిచింది. ఈ పార్టీ తాము పోటీ చేసిన స్థానాల్లో 34.14 శాతం ఓట్లను కొల్లగొట్టింది. ► అప్నాదళ్ (ఎస్) 11 స్థానాల్లో పోటీ చేసి 39.21 శాతం ఓట్లను సాధించింది. మొత్తం అన్ని స్థానాల ఓట్ల పరంగా చూస్తే 0.98 శాతం ఓట్లను దక్కించుకున్నట్టయింది. ► పీస్ పార్టీ 68 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ ఎక్కడా విజయం సాధించలేదు. అయితే తాము పోటీ చేసిన స్థానాల్లో 1.56 శాతం ఓట్లను సాధించింది. మొత్తం ఓట్లలో 0.26% ఓట్లు ఆ పార్టీకి వచ్చాయి. ► 2017 ఎన్నికల్లో 32 చిన్న పార్టీలకు 5 వేల నుంచి 50 వేల మధ్య ఓట్లు వచ్చాయి. ► మరో ఆరు చిన్న పార్టీలు 50 వేలకు పైగా ఓట్లు సాధిస్తే, ఇంకో ఆరు పార్టీలు లక్షకు పైగా ఓట్లు సాధించాయి. ► గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ చిన్న పార్టీలు 56 అసెంబ్లీ స్థానాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల విజయావకాశాలకు గండికొట్టాయి. -
సీమాంధ్ర లోక్ సభ అభ్యర్థుల జాబితా
అరకు (ఎస్టీ) కిశోర్‌చంద్రదేవ్ కొత్తపల్లి గీత గుమ్మడి సంధ్యారాణి శ్రీకాకుళం కిల్లి కృపారాణి రెడ్డి శాంతి కింజరాపు రామ్మోహన్నాయుడు పైడి రాజారావు విజయనగరం బొత్స ఝాన్సీలక్ష్మి ఆర్వీఎస్కేకే రంగారావు (బేబి నాయన) అశోక్ గజపతిబాబు తడివాక రమేష్‌నాయుడు విశాఖపట్నం బొలిశెట్టి సత్యనారాయణ వైఎస్ విజయమ్మ కంభంపాటి హరిబాబు సబ్బం హరి అనకాపల్లి తోట విజయలక్ష్మి గుడివాడ అమర్నాథ్ అవంతి శ్రీనివాసరావు కాకినాడ ఎం.ఎం.పల్లంరాజు చలమలశెట్టి సునీల్ తోట నర్సింహం తుమ్మలపల్లి సత్యరామకృష్ణ అమలాపురం(ఎస్సీ) ఏజేవీ బుచ్చి మహేశ్వరరావు పినిపే విశ్వరూప్ డాక్టర్ పి.రవీంద్రబాబు జీవీ హర్షకుమార్ రాజమండ్రి కె.లక్ష్మీదుర్గేశ్ప్రసాద్ బొడ్డు వెంకటరమణ చౌదరి మాగంటి మురళీమోహన్ ముళ్లపూడి సత్యనారాయణ నరసాపురం కనుమూరి బాపిరాజు వంకా రవీంద్ర గోకరాజు గంగరాజు పొలసపల్లి సరోజచేరియన్ ఏలూరు మసునూరి నాగేశ్వరరావు తోట చంద్రశేఖర్ మాగంటి వేంకటేశ్వర్రావు(బాబు) కె.వి.వి.సత్యనారాయణ మచిలీపట్నం రమేశ్ కె.పార్థసారథి కొనకళ్ల నారాయణ విజయవాడ దేవినేని అవినాశ్ కోనేరు ప్రసాద్ కేశినేని నాని చిన్నం ఐశ్వర్యలక్ష్మీ గుంటూరు షేక్ అబ్దుల్వాహిద్ వి.బాలశౌరి గల్లా జయదేవ్ మల్లెల వెంకటరావు నరసరావుపేట కొండపల్లి వెంకటేశ్వర్లు ఎ.అయోధ్యరామిరెడ్డి రాయపాటి సాంబశివరావు ఏలూరి శ్రీలత బాపట్ల(ఎస్సీ) పనబాక లక్ష్మి డాక్టర్ వరికూటి అమృతపాణి శ్రీరాం మాల్యాద్రి ఆర్.డి.విల్సన్ ఒంగోలు దర్శి పవన్ కుమార్ వై.వి.సుబ్బారెడ్డి మాగుంట శ్రీనివాసులురెడ్డి జి.కిషోర్‌కుమార్ రెడ్డి నంద్యాల బి.వై.రామయ్య ఎస్పీవై రెడ్డి ఎన్.ఎం.డి.ఫరూఖ్ డా.ఎన్.మల్లిఖార్జునరెడ్డి కర్నూలు కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి బుట్టా రేణుక బీటీ నాయుడు అనంతపురం అనిల్ చౌదరి అనంత వెంకట్రామిరెడ్డి జె.సి.దివాకర్‌రెడ్డి బోయ అనిల్‌కుమార్ హిందూపురం గుత్తూరు చిన్నవెంకటరాముడు డి.శ్రీధర్‌రెడ్డి నిమ్మల కిష్టప్ప షామీర్ బాషా కడప వీణా అజయ్‌కుమార్ వైఎస్ అవినాష్‌రెడ్డి ఆర్.శ్రీనివాసులురెడ్డి డా.గౌస్‌పీర్ నెల్లూరు వాకాటి నారాయణరెడ్డి మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఆదాల ప్రభాకర్‌రెడ్డి సయ్యద్ హనీఫ్ తిరుపతి(ఎస్సీ) చింతా మోహన్ వి.వరప్రసాదరావు కారుమంచి జయరాం రాజంపేట ఎ.సాయిప్రతాప్ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి దగ్గుబాటి పురందేశ్వరి జి.మజీబ్ హుస్సేన్ చిత్తూరు(ఎస్సీ) రాజగోపాల్ జి.సామాన్య కిరణ్ ఎన్.శివప్రసాద్ పాకాల పుష్పరాజు