కృపామణి ఆత్మహత్య కేసులో కీలక మలుపు
కృపామణి ఆత్మహత్య కేసులో పోలీసులకు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ కేసులో ప్రథమ నిందితుడిగా పోలీసులు పేర్కొన్న గుడాల నివాస్ ఇంట్లోనే ఈ ఆధారాలు లభ్యమైనట్లు తెలుస్తోంది. సాయినివాస్ విశాఖపట్నం పరిసరాల్లో సంచరిస్తున్నట్లుగా సెల్ ఫోన్ సిగ్నళ్ల వల్ల తెలిసింది. ఆమె రాసిన సూసైడ్ నోట్‌తో పాటు సెల్ఫీ వీడియోను పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. నిందితుల కోసం 6 బృందాలుగా ఏర్పడిన పోలీసులు.. గాలింపు చర్యలు ప్రారంభించారు. గుడాల సాయినివాస్, అతడి కుటుంబ సభ్యులను విచారించారు. అతడికి చెందిన రెండు కార్లు, బైకును స్వాధీనం చేసుకున్నారు. సాయి నివాస్ సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
ఈ కేసులో ఎ1గా గుడాల సాయి నివాస్, ఎ2గా తల్లి లక్ష్మి, ఎ3గా తండ్రి రామలింగేశ్వరరావు, ఎ4గా రాజ్ కుమార్‌లను పోలీసులు పేర్కొన్నారు. నలుగురు నిందితులపై సెక్షన్ 344, 306, 370 క్లాజ్ 1, 2, 3, 376 క్లాజ్ 1, నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. కృపామణి కేసు విచారణాధికారిగా జంగారెడ్డిగూడెం డీఎస్పీ వెంకట్రావును నియమించారు. గుడాల సాయినివాస్పై పీడీ యాక్ట్ నమోదు చేసే అవకాశం కూడా కనిపిస్తోంది.