నకిలీ నోట్ల తయారీ కేసులో ఇద్దరి అరెస్టు
కురవి: మహబూబాబాద్ జిల్లా కురవిలో కలర్ జిరాక్స్ మిషన్‌తో నకిలీ రూ.2వేల నోట్లను తయారు చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం మహబూబాబాద్ రూరల్ సీఐ కృష్ణారెడ్డి వివరాలు వెల్లడించారు. కురవి మండలం తట్టుపల్లి శివారు చంద్యాతండాకు చెందిన మైనర్ గత ఆదివారం స్థానిక పెట్రోల్ బంకులో నకిలీ రూ.2వేల నోటు ఇచ్చి పె ట్రోల్ పోరుుంచుకున్నాడు. అక్కడి వారు నకిలీ నోటుగా గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాలుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, తనకు నారాయణ పురం గ్రామానికి చెందిన తేజావత్ ప్రమోద్ నోటు జిరాక్స్ ఇచ్చినట్టు చెప్పా డు. ప్రమోద్ కురవిలో జిరాక్స్ సెంటర్ నడుపుతున్నాడు. ఇటీవల విడుదలైన కొత్త రూ.2వేల నోటును బ్యాంకు నుంచి డ్రా చేసిన ప్రమోద్.. కొత్త నోటు ఇంకా ప్రజల్లోకి చేరకపోవడంతో సదరు నోటును జిరాక్స్ చేసి బాలుడికి ఇచ్చాడు. నోటు చెల్లించుకొని వస్తే చెరిసగం పంచుకుందా మని చెప్పాడు. ఈ క్రమంలో పెట్రోల్ బంక్‌కు వచ్చిన బాలుడు దొరికిపోయాడు. అతడిచ్చిన సమాచారం మేరకు ప్రమోద్ ను పోలీసులు అరెస్టు చేశారు.