Malaysian bank officer
-
6 నెలలు గడచినా.. జాడలేని 'ఎంహెచ్ 370'
కౌలాలంపూర్: మలేసియన్ ఎయిర్లైన్స్ విమానం ఎంహెచ్ 370 అదృశ్యమై ఆరు నెలలు పూర్తయినా ఇంకా ఎలాంటి ఆచూకీ దొరకలేదు. ఈ విమానం కోసం విస్తృతంగా గాలించినా ఒక్క ఆధారం కూడా కనుగొనలేకపోయారని ఆస్ట్రేలియా అధికారులు చెప్పారు. గత మార్చి 8న 239 ప్రయాణికులతో కౌలాలంపూర్ నుంచి బీజింగ్ బయల్దేరిన ఎంహెచ్ 370 విమానం గల్లంతయిన సంగతి తెలిసిందే. టేకాఫ్ అయిన 40 నిమిషాల తర్వాత సాంకేతాలు అందుకుండా పోయాయి. విమానం దక్షిణ హిందూ మహాసముద్రంలో కూలిపోయి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. సముద్రంలో గాలించినా ఇప్పటికీ జాడ తెలుసుకోలేకపోయారు. బాధితుల కుటుంబ సభ్యులు ప్రమాదం గురించి తెలుసుకోవాలని ఎదురుచూస్తున్నారు. -
'ఎంహెచ్ 370' బాధితుల సొమ్ము చోరీ
కౌలాలంపూర్: ఎంహెచ్ 370 విమాన ప్రమాద బాధితుల సొమ్ము నొక్కేసిన మలేసియా బ్యాంకు అధికారి, ఆమె భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ చోరీతో సంబంధమున్న పాకిస్థాన్ వ్యక్తిని పట్టుకునేందుకు గాలిస్తున్నారు. బ్యాంకు అధికారి, ఆమె భర్త విమాన ప్రమాద బాధితుల బ్యాంకు ఖాతా నుంచి 34,850 డాలర్లు కాజేసినట్టు అధికారులు గుర్తించారు. ఇద్దరు మలేసియా, మరో ఇద్దరు చైనా బాధితుల ఖాతాల నుంచి వీరు డబ్బు తీసుకున్నట్టు గుర్తించారు. మలేసియా సీఐడీ అధికారులు వీరిని గురువారం సాయంత్రం అరెస్ట్ చేశారు. వీరికి ఆదివారం వరకు రిమాండ్ విధించారు. అరెస్టైన బ్యాంకు ఉద్యోగిని పదేళ్లుగా ఓ పేరులేని బ్యాంకులో పనిచేస్తుండగా, ఆమె భర్త అంపాంగ్ లో మెకానిక్ పనిచేస్తున్నాడని అధికారులు వెల్లడించారు.