
6 నెలలు గడచినా.. జాడలేని 'ఎంహెచ్ 370'
కౌలాలంపూర్: మలేసియన్ ఎయిర్‌లైన్స్ విమానం ఎంహెచ్ 370 అదృశ్యమై ఆరు నెలలు పూర్తయినా ఇంకా ఎలాంటి ఆచూకీ దొరకలేదు. ఈ విమానం కోసం విస్తృతంగా గాలించినా ఒక్క ఆధారం కూడా కనుగొనలేకపోయారని ఆస్ట్రేలియా అధికారులు చెప్పారు.
గత మార్చి 8న 239 ప్రయాణికులతో కౌలాలంపూర్ నుంచి బీజింగ్ బయల్దేరిన ఎంహెచ్ 370 విమానం గల్లంతయిన సంగతి తెలిసిందే. టేకాఫ్ అయిన 40 నిమిషాల తర్వాత సాంకేతాలు అందుకుండా పోయాయి. విమానం దక్షిణ హిందూ మహాసముద్రంలో కూలిపోయి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. సముద్రంలో గాలించినా ఇప్పటికీ జాడ తెలుసుకోలేకపోయారు. బాధితుల కుటుంబ సభ్యులు ప్రమాదం గురించి తెలుసుకోవాలని ఎదురుచూస్తున్నారు.