male domination
-
న్యాయవ్యవస్థలో పురుషాధిక్యత
న్యూఢిల్లీ: భారతీయ న్యాయవ్యవస్థలో తొలినుంచీ పురుషాధిక్యత వేళ్లూనుకొని ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ఆవేదన వ్యక్తం చేశారు. మన దేశంలో న్యాయ వృత్తి ఫ్యూడల్, పితృస్వామ్య తరహాతో, మహిళలను సముచిత వాటా కల్పించని స్వభావంతో కూడుకున్నదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఢిల్లీలో హిందుస్తాన్ టైమ్స్ లీడర్షిప్ సమిట్‌లో ఆయన మాట్లాడారు. మహిళలు, సమాజంలోని అణగారిన వర్గాల వారు న్యాయపాలికలోకి మరింత పెద్ద సంఖ్యలో ప్రవేశించాలని అభిప్రాయపడ్డారు. అందుకు వీలుగా మొత్తం న్యాయ వ్యవస్థను మరింత ప్రజాస్వామ్యయుతంగా, ప్రతిభాధారితంగా మార్చాల్సిన అవసరం చాలా ఉందంటూ కుండబద్దలు కొట్టారు. ‘‘ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. న్యాయ వ్యవస్థకు మానవ వనరులను అందించేందుకు మనకు ఒక నిర్ధారిత వ్యవస్థ ఉంది. దాని నిర్మాణం ఇప్పటికీ ఫ్యూడల్, పితృస్వామ్య పోకడలతోనే నిండి ఉందన్నది వాస్తవం. పురుషాధిక్యత మన న్యాయవ్యవస్థ స్వరూపంలోనే గూడుకట్టుకుపోయింది. సీనియర్ లాయర్లున్న ఏ చాంబర్లోకి వెళ్లినా అక్కడ మొత్తం పురుషులే కనిపిస్తారు. మార్పు అక్కడి నుంచే రావాలి. మహిళలు, అణగారిన వర్గాలకు చెందిన ప్రతిభావంతులకు ఆ చాంబర్లలో చోటు దక్కాలి. అప్పుడు గానీ న్యాయపాలికలో వారి సంఖ్య పెరగదు! మహిళా న్యాయవాదులు, న్యాయమూర్తుల ద్వారానే భవిష్యత్తులో మెరుగైన న్యాయవ్యవస్థను నిర్మించుకోగలం’’ అన్నారు. ‘‘నేడు న్యాయవ్యవస్థ ముందు ఎన్నో సవాళ్లున్నాయి. వాటిలో మొట్టమొదటిది, అతి ముఖ్యమైనది సుప్రీంకోర్టుపై ప్రజలు పెట్టుకున్న ఆశలు. ఎందుకంటే ప్రతి సామాజిక, న్యాయపరమైన అంశమూ, రాజకీయ అంశమూ సుప్రీంకోర్టు న్యాయ పరిధిలోకి వచ్చేవే’’ అని చెప్పారు. న్యాయమూర్తులకు ఆ నేర్పుండాలి చట్టం అణచివేతకు సాధనంగా కాక న్యాయమందించే సాధనంగా ఉండాలని సీజేఐ అభిప్రాయపడ్డారు. ఆ బాధ్యత పాలకులదే తప్ప న్యాయమూర్తులది కాదని స్పష్టం చేశారు. ‘‘మాపై ప్రజలకు ఎన్నో ఆశలు, అంచనాలున్నాయి. కానీ కోర్టుల పరిమితులను కూడా అర్థం చేసుకోవాలి. ‘‘చట్టాలు, న్యాయం కొన్నిసార్లు ఒకే సరళరేఖపై వెళ్లకపోవచ్చు. కానీ చట్టాలున్నది అంతిమంగా న్యాయ వితరణకే. వాటిని అణచివేతకు దుర్వినియోగం చేయొద్దు’ అని సీజేఐ అన్నారు. ‘‘దీర్ఘకాలంలో న్యాయవ్యవస్థను నిలబెట్టేది దయా భావన, సహానుభూతితో ప్రజల వేదనను పోగొట్టగలిగిన సామర్థ్యం మాత్రమే. ఎవరూ పట్టించుకోని అణగారిన వర్గాల ఆక్రందన వినగలిగి, వారి బాధలను చూడగలిగి చట్టాన్ని, న్యాయాన్ని నేర్పుగా బ్యాలెన్స్ చేయగలిగిన నాడు న్యాయమూర్తిగా బాధ్యతలను సరిగా నిర్వర్తించినట్టు లెక్క’’ అన్నారు అమెరికాతో పోలికేల...? మన సుప్రీంకోర్టును అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల అత్యున్నత న్యాయస్థానాలతో పోల్చడం సరికాదని సీజేఐ అభిప్రాయపడ్డారు. ‘‘అమెరికా సుప్రీంకోర్టు ఏడాదంతా కలిపి మహా అయితే 180 పై చిలుకు కేసులు పరిష్కరిస్తుంది. బ్రిటన్‌లోనైతే 85 కేసులు దాటవు! కానీ మన సుప్రీంకోర్టులో ప్రతి న్యాయమూర్తీ సోమ, శుక్రవారాల్లో 75 నుంచి 80 కేసుల దాకా ఆలకిస్తారు. మంగళ, బుధ, గురువారాల్లో 30 నుంచి 40 దాకా కేసులు చూస్తారు. మన సుప్రీంకోర్టు విస్తృతి అంత సువిశాలమైనది! మేం పరిష్కరించే చాలా ముఖ్యమైన కేసుల్లో కొన్ని వార్తాపత్రికల్లో, సామాజిక మాధ్యమాల్లో కన్పించకపోవచ్చు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూడా పెన్షన్, భరణం వంటి చిన్నాచితకా కేసులనూ విచారించాల్సిందేనా అంటే, అవునన్నదే నా సమాధానం. ఎందుకంటే ప్రజలకు నిజమైన భరోసా కల్పించగలిగినప్పుడే న్యాయ వ్యవస్థ పరిఢవిల్లుతుంది’’ అన్నారు. మేము మానసికంగా పక్కా యూత్! న్యాయమూర్తులు నల్లకోటుతో పాత, రాచరిక కాలపు వస్త్రధారణలో కన్పించి బోరు కొట్టిస్తుంటారని సీజేఐ అన్నారు. ‘‘మా లుక్స్ జనాలకు బాగా విసుగు పుట్టిస్తాయన్నది నిజమే కావచ్చు. కానీ నిజానికి మానసికంగా మాత్రం మేమంతా నవ యవ్వనంతో ఉరకలేస్తుంటాం’’ అంటూ చమత్కరించారు! ..అందుకే ప్రత్యక్ష ప్రసారాలు రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యాల్లో ఒక్కోసారి పారదర్శకత లేమి పెద్ద ప్రమాదంగా మారుతుందని సీజేఐ అభిప్రాయపడ్డారు. దానికి అడ్డుకట్ట వేసేందుకే సుప్రీంకోర్టు విచారణల ప్రత్యక్ష ప్రసారానికి తెర తీసినట్టు చెప్పారు. తద్వారా న్యాయపాలికలో ఏం జరుగుతోందనే పౌరులు తెలుసుకునే అవకాశం దక్కడమే గాక న్యాయవ్యవస్థ మరింత జవాబుదారీతనంతో వ్యవహరించేందుకు వీలు కలుగుతుందన్నారు. ‘‘కోర్టు విచారణల ప్రత్యక్ష ప్రసారాలు మేం చేపట్టిన ఓ నూతన ప్రయోగం. న్యాయవ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేయడంలో టెక్నాలజీ ఎంత పాత్ర పోషించగలదో దీని ద్వారా అర్థమైంది. న్యాయం కోసం సామాన్యుడు తొలుత ఆశ్రయించే జిల్లా కోర్టుల విచారణలనూ ప్రత్యక్ష ప్రసారం చేయాలి’’ అన్నారు. ‘సోషల్’ సవాలుకు తగ్గట్టు అప్డేట్ కావాలి ‘‘కోర్టు గదిలో న్యాయమూర్తులు మాట్లాడే ప్రతి చిన్న మాటనూ రియల్ టైంలో రిపోర్ట్ చేస్తూ సోషల్ మీడియా పెను సవాలుగా విసురుతోంది. న్యాయమూర్తుల పనితీరు నిత్యం మదింపుకు గురవుతోంది’’ అని సీజేఐ అభిప్రాయపడ్డారు. ‘‘మనమిప్పుడు ఇంటర్నెట్, సోషల్ మీడియా యుగంలో ఉన్నాం. కనుక న్యాయమూర్తులుగా మనల్ని మనం నిత్యం కొత్తగా ఆవిష్కరించుకోవాలి. ఈ కొత్త తరపు సవాళ్లను ఎదుర్కోవడంలో మన పాత్రపై పునరాలోచించుకోవాలి. ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచించాలి’’ అని పిలుపునిచ్చారు. -
కరోనా కట్టడిలోనూ ‘పురుషాధిక్యమే!’
సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో మహిళల నాయకత్వంలోని దేశాలే ముందున్నాయని, పురుషుల నాయకత్వంలోని దేశాలు వెనకబడి పోయాయంటూ గతంలో వచ్చిన వార్తలు పూర్తిగా నిరాధారమని, అది మీడియా సష్టించిన వార్త మాత్రమేనని అమెరికా, బ్రిటన్‌కు చెందిన నిపుణులు అభిప్రాయపడ్డారు. కరోనా కట్టడి చేయడంలో న్యూజిలాండ్ ప్రధాన మంత్రి జసిందా ఆర్డెర్న్, జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ చూపిన చొరవను రెట్టింను చేసి చూపిన మీడియా, వియత్నాం అధ్యక్షుడు ఫూ త్రాంగ్ తీసుకున్న చర్యలను పూర్తిగా విస్మరించిందని వారన్నారు. వియత్నాంలో అప్పటికి కరోనా మతులు 40 కన్నా తక్కువ ఉన్న విషయాన్ని కూడా మీడియా పరిగణలోకి తీసుకోలేదని వారు చెప్పారు. వాస్తవానికి పురుషుల నాయకత్వంలోని దేశాలే కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో ఎక్కువ విజయం సాధించాయని 175 దేశాల్లో కరోనా వైరస్ విస్తతి, మరణాల శాతానికి సంబంధించిన డేటాను విశ్లేషించడం ద్వారా తాము ఈ అభిప్రాయానికి వచ్చామని తెలిపారు. 175 దేశాల్లో 159 దేశాలు పురుషుల నాయకత్వంలో ఉండగా, కేవలం 16 దేశాలు మాత్రమే మహిళల నాయకత్వంలో ఉన్నాయి. టెన్నెస్సీలోని మెంపిస్ యూనివర్సిటీలో పొలిటికల్ ప్రొఫెసర్‌గా పని చేస్తోన్న లీ విండ్సర్, ఆయన బందం ఈ తాజా అధ్యయనాన్ని నిర్వహించింది. కరోనా కట్టడి చేయడంలో కొంత మంది మహిళల నాయకత్వంలోని దేశాల కషిని తాము విస్మరించడం లేదాని, అయితే కరోనా మరణాల సంఖ్యా శాతాన్ని పరగణలోకి తీసుకొని, నిజమైన డేటాను విశ్లేషించినట్లయితే పురుషు నాయకత్వంలోని ప్రభుత్వాలే పటిష్ట చర్యలు తీసుకున్న విశయం స్పష్టం అవుతుందని ఆయన బందం పేర్కొంది. -
అధికారం ఎప్పుడూ వాళ్లకేనా?
సినిమా ఇండస్ట్రీ మేల్ డామినేటెడ్ అంటారు కొందరు. పవర్ ఎప్పుడూ మగవాళ్ల దగ్గరే ఎందుకు ఉండాలి? అంటున్నారు నయనతార. ఒకవైపు టాప్ హీరోలతో యాక్ట్ చేస్తూ మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ లేడీ సూపర్‌స్టార్‌గా ఎదిగారు నయనతార. తనకి సంబంధించిన పనులు తనకు నచ్చినట్టే జరగాలనుకుంటారట నయన. ఇండస్ట్రీలో అధికారం అనే టాపిక్ గురించి నయనతార మాట్లాడుతూ– ‘‘అధికారం ఎప్పుడూ మగవాళ్ల దగ్గరే ఎందుకు ఉండాలి? నేను సోలో హీరోయిన్గా చేసే సినిమాల్లో తుది నిర్ణయాలన్నీ నావే. సమస్య ఏంటంటే.. స్త్రీలు శాసించే స్థాయిలో ఉన్నప్పుడు కూడా ఉండాల్సి నంత కాన్ఫిడెంట్‌గా ఉండరు. నాకు అది కావాలి, నేను ఇది చేస్తాను అని ధైర్యంగా నిలబడరు. నిలబడాలి. ఇది జెండర్‌తో సంబంధం లేనిది. నేను నీ మాట విన్నప్పుడు, నువ్వు కూడా నా మాట వినాలి కదా?’’ అన్నారు. -
అవును పురుషాధిక్యమే!
తమిళసినిమా: అవును ఇక్కడ పురుషాధిక్యమే కొనసాగుతోందని నటి శ్రియ వక్కాణించారు. సినీ పరిశ్రమలో పురుషాధిక్యంపై కొందరు కథానాయికలు అప్పుడప్పుడూ గొంతెత్తుతుంటారు. అయితే వారిలో బిజీ హీరోయిన్ల కంటే సీనియర్ హీరోయిన్లే తన అనుభవంలో భాగంగా పురుషాధిక్యంపై తమ అక్కసును వెళగక్కుతుంటారు. అలాంటి వారిలో నటి శ్రియ చేరారు. గత దశాబ్దంన్నరగా దక్షిణాదిలో నటిస్తున్న ఈ ఉత్తరాది బ్యూటీ ఇటీవల రష్యాకు చెందిన బాయ్‌ఫ్రెండ్‌ను రహస్యంగా, చాలా సింపుల్‌గా పెళ్లి చేసేసుకున్నారు. ఒకప్పుడు తెలుగు, తమిళ భాషల్లో, అప్పుడప్పుడూ హిందీలో నటిస్తూ బిజీగా ఉన్న ఈ భామకు అవకాశాలు తగ్గు ముఖం పట్టాయి. అదే విధంగా హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలు ఒకటి రెండు చేసినా అవి పెద్దగా సక్సెస్ అవకపోవంతో ఆవిధంగా శ్రియ రాణించలేకపోయారు. ఇకపోతే కోలీవుడ్‌లో శింబుతో నటించిన అన్భానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రం తరువాత ఒక్క చిత్రం కూడా విడుదల కాలేదు. అరవింద్‌స్వామికి ప్రతినాయకిగా నటించిన నరకాసురన్ చిత్రం ఒక్కటే విడుదల కావలసి ఉంది. ఇక తెలుగులోనూ అవకాశాలు లేకపోవడంతో పెళ్లి చేసుకుని సంసార జీవితంలో సెటిల్ అవ్వాలని భావించిన శ్రియ పెళ్లి చేసుకున్నారు. అనంతరం రష్యాలో సెటిల్ అవనున్నట్లు ప్రచారం జరిగినా మళ్లీ నటించడానికి రెడీ అవుతున్నారు. తెలుగులో ఒక చిత్రం కమిట్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే ఇండియాకు తిరిగొచ్చారు. సమీప కాలంలో చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన శ్రియ మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే ఒక చిత్ర షూటింగ్లో పాల్గొంటున్నట్టు చెప్పారు. తనకు ఇప్పటికి చాలా అవకాశాలు వస్తున్నాయని అన్నారు. అయితే కథలు నచ్చకపోవడం నిరాకరిస్తున్నట్లు తెలిపారు. అన్ని చిత్రాల్లోనూ పురుషాధిక్యం ఎక్కువ అని అన్నారు. కథానాయిక పాత్రల పరిధి తక్కువగానే ఉంటుందని, అదీ చిత్రం పూర్తి అయ్యేసరికి ఇంకా తగ్గిపోతోందని ఆరోపించారు. మరో విషయం ఏమిటంటే తనకు తమిళంలో కంటే తెలుగులోనే మంచి కథా పాత్రలు లభిస్తున్నాయని శ్రియ పేర్కొన్నారు. -
హిట్ హీరోయిన్‌కు ఒక్క సినిమా లేదు!
నీరజ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్, ఆ సినిమా విడుదలై.. మంచి సక్సెస్ సాధించిన తర్వాత ఇంతవరకు ఒక్క సినిమాకు కూడా సైన్ చేయలేదు. చేతిలో సినిమాలు లేవని తాను బాగా ఒత్తిడికి గురవుతున్నట్లు ఆమె చెబుతోంది. విమానంలో హైజాకర్ల బారి నుంచి ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు తన సొంత ప్రాణాలను పణంగా పెట్టిన నీరజా భానోత్ అనే ఎయిర్ హోస్టెస్ పాత్రలో సోనమ్ నటించిన విషయం తెలిసిందే. గత కొన్నాళ్లుగా సినిమాల్లో మహిళలను చాలా ధైర్యవంతమైన పాత్రలలో చూపిస్తున్నారని, అయినా పారితోషికం విషయంలో మాత్రం వివక్ష కొనసాగుతూనే ఉందని వాపోయింది. నీరజ లాంటి సినిమాలకు మంచి కలెక్షన్లు వస్తున్నా థియేటర్లు దొరకడం లేదని.. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా కాబట్టి కేవలం 700 స్క్రీన్లలోనే సినిమా విడుదలైందని సోనమ్ చెప్పింది. పరిశ్రమ మనకు ఎంత ఇస్తోందన్నది విషయం కాదని, ప్రేక్షకులు సినిమా చూడాలనుకుంటున్నారా లేదా అనేది చూడాలని అంటోంది. తన సినిమాకు 6 కోట్ల ఓపెనింగ్ కలెక్షన్లు వస్తే.. ఆ డబ్బును నిర్మాత తనకు ఇవ్వాలా అక్కర్లేదా అని అడిగింది.