malicious links
-
వామ్మో.. పేరు నుంచి పాస్వర్డ్ దాకా అన్నీ ఫసక్
సురక్షితంకానీ యాప్‌ల జోలికి వెళ్లొద్దని, ఫోన్లో గనుక అలాంటివి ఉంటే వాటిని తక్షణమే తొలగించాలని స్టోర్లు(గూగుల్, యాపిల్) ఎప్పటికప్పుడు యూజర్లను హెచ్చరిస్తూనే ఉంటాయి కదా. కానీ, ఈసారి ఆ అలర్ట్ భారీ లెవల్లోనే రిలీజ్ అయ్యింది. ఒక్క గూగుల్ ప్లేస్టోర్‌లోనే 19 వేల అరక్షితమైన యాప్‌లు ఉన్నాయని పరిశోధనలో వెల్లడైంది. డిజిటల్ సెక్యూరిటీ కంపెనీ ఎవాస్ట్.. ఒక్క గూగుల్ ప్లేస్టోర్‌లో సేఫ్కాని 19,300 యాప్‌ల్ని గుర్తించింది. డేటాబేస్(ఫైర్‌బేస్ అంటారు)లో భద్రతలేని ఈ యాప్‌ల వల్ల వ్యక్తిగత సమాచారం బయటకు పొక్కడం, తద్వారా దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని ఎవాస్ట్ హెచ్చరించింది. యాప్స్ కోసం గూగుల్ ప్లే స్టోర్‌ను సురక్షితమైన సోర్స్‌గా భావిస్తుంటారు. కానీ, ఇందులో ఉన్న యాప్స్ కూడా యూజర్ డాటాకు ముప్పు తెచ్చేవే అని తర్వాతి కాలంలో వెలుగు చూసింది. ప్రస్తుతం గుర్తించిన యాప్‌ల వివరాల్ని గూగుల్‌కు అందజేశామని, తద్వారా యాప్ డెవలపర్స్ అప్రమత్తం అవుతారని ఆశిస్తున్నామని ఎవాస్ట్ తెలిపింది. పొరపాటు ఇదే.. సాధారణంగా ఆండ్రాయిడ్ డివైజ్‌లలో యాప్స్(మొబైల్-వెబ్ యాప్స్) డెవలపింగ్ కోసం ఫైర్‌బేస్‌ను ఉపయోగిస్తారు డెవలపర్స్. ఆ మొత్తాన్ని ఇతర డెవలపర్స్‌కు కనిపించేలా ఉంచుతారు. ఈ క్రమంలో ఈ డేటాబేస్ ద్వారా ఆ సమాచారం మొత్తం అందరికీ చేరుతుంది. వీటిలోని యాప్స్ మిస్కన్ఫిగరేషన్ ప్రభావం వల్ల.. లైఫ్‌స్టైల్, వర్కవుట్, గేమింగ్, మెయిల్స్, ఫుడ్ డెలివరీ ఇతరత్ర యాప్‌ల నుంచి డేటా లీక్ కావొచ్చు. అంటే యూజర్ల పేర్లు, చిరునామా, లొకేషన్ డేటా, ఒక్కోసారి పాస్వర్డ్లు కూడా హ్యాకర్ల చేతికి అందుతాయి. మొత్తంగా లక్షా ఎనభై వేల మూడు వందల యాప్స్‌ను ఎవాస్ట్ థ్రెట్ ల్యాబ్ రీసెర్చర్స్ పరిశీలించారు. అందులో 10 శాతం అంటే.. 19,300 యాప్స్ ఓపెన్‌గా, గుర్తింపులేని డెవలపర్స్ నుంచి డాటాను లీక్ చేసే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. జాగ్రత్తలు.. ►వెరిఫై మార్క్ లేని యాప్స్ లేని డౌన్లోడ్ చేయకపోవడం బెటర్. ►యాప్ పర్మిషన్ విషయంలో అలర్ట్‌గా ఉండాలి. లేకుండే డాటా మొత్తం లీక్ అవుతుంది ►ప్లేస్టోర్లలో కింద రివ్యూలు, సమాచారం పూర్తిగా చదవాలి. ఒక్కోసారి ఫేక్ రివ్యూలు బోల్తా కొట్టిస్తుంటాయి. కాబట్టి, జెన్యూన్ రీజన్ ఉంటేనే డౌన్లోడ్ చేయాలి. ►రివార్డులు ఆఫర్ చేసే యాప్స్ విషయంలో మరింతజాగ్రత్త అవసరం. ►యాంటీ వైరస్ ఎంపికలోనూ ఆచీతూచీ వ్యవహరించాలి. ►ఒక్కోసారి ‘మొబైల్స్’కు హాని చేస్తాయనే సందేశాన్ని పట్టించుకోకుండా ‘టెంప్టింగ్’ యాప్స్‌ను డౌన్ లోడ్ చేస్తుంటారు. ఈ చర్య తెలిసిమరీ గోతి తవ్వుకున్నట్లే.. ►గేమ్స్ ఆడేటప్పుడు లేదంటే అశ్లీల వీడియోలు చూసేటప్పుడు వచ్చే యాప్స్ నోటిఫికేషన్ సురక్షితమైనది ఎంతమాత్రం కాదు ►అవతలివాళ్ల సోషల్ మీడియా ప్రొఫైల్స్‌ను అన్‌లాక్ చేసి చూడాలనే ఉత్సుహకతతో ఇలాంటి అరక్షితమైన యాప్స్‌ను ప్రొత్సహిస్తుంటారు కొంతమంది. కానీ, మిగతా యాప్స్ కన్నా ఇలా డౌన్ లోడ్ చేసే యాప్స్ ఎక్కువగా డ్యామేజ్ చేస్తుంటాయి. చదవండి: యాప్ మార్కెట్.. గూగుల్, యాపిల్‌కు భారీ షాక్ -
ఆ యాప్‌తో మీ సొమ్ము మాయం !
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ మహమ్మారి సమాచారం కోసం స్మార్ట్ఫోన్లలో యాప్‌లను ఇబ్బడిముబ్బడిగా డౌన్లోడ్ చేసుకుంటే మీ జేబు గుల్లయ్యే ప్రమాదం ఉందని సీబీఐ హెచ్చరించింది. కరోనా వైరస్ సంబంధిత అప్డేట్స్ను ఉపయోగిస్తూ ఓ హానికర యాప్ దాన్ని ఇన్స్టాల్ చేసుకున్న యూజర్ క్రెడిట్, డెబిట్ కార్డుల వంటి ఆర్థిక సమాచారాన్ని దొంగిలించి ఆయా ఖాతాల నుంచి నగదును విత్‌డ్రా చేస్తాయని సీబీఐ పేర్కొంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలితప్రాంతాలను అప్రమత్తం చేసింది. స్మార్ట్‌ఫోన్ యూజర్లను నిండాముంచుతున్న ఈ యాప్ నిర్వాకంపై సీబీఐకి ఇంటర్‌పోల్ సమాచారం అందించింది. ఈ హానికారక సాఫ్ట్వేర్ కోవిడ్-19 కంటెంట్ పేరుతో ఎస్ఎంఎస్ను పంపి దానిద్వారా ఈ లింక్‌ను డౌన్లోడ్ చేసకునేలా యూజర్లను బోల్తాకొట్టిస్తుందని సీబీఐ పేర్కొంది. కాగా పలు రాష్ట్రాల పోలీసులకు ఈ తరహా మోసాలపై పెద్దసంఖ్యలో ఫిర్యాదులు వస్తున్న సంగతి తెలిసిందే. చదవండి : విజయ్ మాల్యాకు భారీ షాక్ -
ఈ యాప్‌లు మీ ఫోన్లో ఉన్నాయో.. ఇక అంతే!
ప్లే స్టోర్‌లో ఉన్న ప్రమాదకరమైన 85 రకాల అప్లికేషన్లను తొలగిస్తున్నట్టు గూగుల్ తెలిపింది. ఆండ్రాయిడ్ ప్లే స్టోర్‌లో గేమ్, టీవీ అండ్ రిమోట్ కంట్రోల్ సిములేటర్ వంటి యాప్స్ ద్వారా డేటా చోరీకి గురయ్యే అవకాశం ఉందని పేర్కొంది. కాగా ఈ విషయాన్ని ట్రెండ్ మైక్రో అనే సైబర్ సెక్యూరిటీ కంపెనీ మొదట రిపోర్టు చేసింది. ‘ఫుల్ స్క్రీన్ యాడ్స్‌ను ప్రజెంట్ చేస్తూ, డివైస్ స్క్రీన్ అన్లాకింగ్ పనితీరును గమనించే ఇటువంటి యాప్‌లు చాలా ప్రమాదకరం. అయితే ఇప్పటికే ఈజీ యూనివర్సల్ టీవీ రిమోట్ అనే యాప్‌ను యూజర్లు 50 లక్షల సార్లు డౌన్లోడ్ చేశారు. అంతేకాదు ఇటువంటి మరిన్ని 85 హానికారక యాప్‌లు కూడా 9 మిలియన్ల సార్లు డౌన్లోడ్ చేయబడ్డాయి. ఈ యాప్‌లు ఓపెన్ చేసిన ప్రతిసారీ ఫుల్ స్క్రీన్ యాడ్ డిస్ప్లే అవుతుంది. దాని నుంచి బయటికి వచ్చేందుకు వరుసగా వివిధ రకాల బటన్స్ నొక్కమంటూ ఆప్షన్స్ వస్తూనే ఉంటాయి. అలా అనేక రకాల వెబ్‌పేజీల్లోకి మన వివరాలు వెళ్లిపోతాయి. యాప్ క్రాష్ అయ్యేంతవరకు ఇలాగే జరుగుతూ ఉంటుంది. అదే సమయంలో మన ఫోన్ లాక్ ప్యాట్రన్‌తో పాటు ఇతర కీలక సమాచారం హ్యాకర్ల చేతికి సులభంగా చిక్కుతుంది’ అని ట్రెండ్ మైక్రో పరిశోధకులు తమ బ్లాగులో కథనం వెలువరించారు. ఇక గూగుల్ ఇలా హానికారక యాప్‌లను తొలగించడం ఇదే తొలిసారి కాదు. గతేడాది నవంబరులో 13, డిసెంబరులో మరో 22 ఫేక్ యాప్‌లను తొలగించింది. మన ఫోన్లలో ఉండకూడని కొన్ని యాప్‌లు - స్పోర్ట్ టీవీ - ప్రాడో పార్కింగ్ సిములేటర్ 3డీ -టీవీ వరల్డ్ -సిటీ ఎక్స్‌స్ట్రీమ్‌పోలీస్ -అమెరికన్ మజిల్ కార్ -ఐడిల్ డ్రిప్ట్ -టీవీ రిమోట్ -ఏసీ రిమోట్ -బస్ డ్రైవర్ -లవ్ స్టిక్కర్స్ -క్రిస్మస్ స్టిక్కర్స్ -పార్కింగ్ గేమ్ -బ్రెజిల్ టీవీ - వరల్డ్ టీవీ - ప్రాడో కార్ -చాలెంజ్ కార్ స్టంట్స్ గేమ్ - యూకే టీవీ - ఫొటో ఎడిటర్ కొలాగ్ 1 - మూవీ స్టిక్కర్స్ - రేసింగ్ కార్ 3డీ - పోలీస్ చేజ్ -ఫ్రాన్స్ టీవీ - చిలీ టీవీ - సౌతాఫ్రికా టీవీ మొదలైనవి -
వాట్సప్‌లో ఈ లింకులు ఓపెన్ చేశారో..
వాట్సప్‌లో ప్రతిరోజూ వివిధ గ్రూపులలో వందలాది మెసేజిలు వస్తుంటాయి. కొంతమంది రకరకాల లింకులు పంపుతుంటారు. ఏవేవో ఆఫర్లు ఉన్నాయంటూ ఊదరగొడతారు. కానీ, అలా వచ్చిన లింకులన్నింటినీ ఓపెన్ చేసి చూశారో.. మీరు సైబర్ దాడుల బారిన పడటం ఖాయమని తాజాగా ఓ హెచ్చరిక వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాట్సప్ యూజర్లందరినీ ఈ మేరకు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజలను మోసం చేసి, సులభంగా వారిని బుట్టలో పడేసేందుకు హ్యాకర్లు ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్‌లు ఉపయోగిస్తున్నారని ద సన్ పత్రికలో వచ్చిన కథనం పేర్కొంది. వాట్సప్ వినియోగదారులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న వీడియో కాలింగ్ ఈమధ్య వచ్చింది. వాస్తవానికి గూగుల్ ప్లేస్టోర్‌లో వాట్సప్‌ను అప్డేట్ చేసుకుంటే చాలు.. ఈ వీడియో కాల్స్ వచ్చేస్తున్నాయి. కానీ, చాలామంది దానికి సంబంధించి ఓ లింకును విపరీతంగా ఫార్వర్డ్ చేశారు. పొరపాటున అలాంటి లింకులను ఓపెన్ చేస్తే వెంటనే మన ఫోన్ వాళ్ల నియంత్రణలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఫోన్లో భద్రపరిచిన వ్యక్తిగత డేటా మొత్తం ప్రమాదంలో పడుతుందని అంటున్నారు. గ్రూప్ వీడియో కాలింగ్ పేరుతో కూడా కొన్ని లింకులు వస్తున్నాయని, ఇవన్నీ చాలా ప్రమాదకరమని చెప్పాఉ. ఇక మరికొంతమంది అయితే.. నగరంలో ఏదో పెద్ద కార్యక్రమం జరుగుతోందని, దానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నామని చెబుతూ ఒక ఈమెయిల్ పంపుతున్నారు. సంబంధిత వెబ్‌సైట్‌ను ఓపెన్ చేస్తేనే దానికి రావడానికి వీలవుతుందంటారు. అలాంటి సైట్ ఓపెన్ చేస్తే వెంటనే మన సిస్టమ్ లేదా ఫోన్ హ్యాక్ అయిపోతుంది. డిజిటల్ నేరగాళ్లు ప్రపంచం నలుమూలలా ఉన్నారని.. వాళ్ల వలలో పడకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. భారతదేశంలో 16 కోట్ల మంది వాట్సప్ యూజర్లు ఉన్నట్లు ఈ నెల మొదట్లో ఆ సంస్థ తెలిపింది. అప్పుడే ప్రపంచవ్యాప్తంగా వీడియో కాలింగ్ సదుపాయాన్ని ప్రారంభించింది. ఇది ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్ అన్ని ప్లాట్‌ఫారాల మీద పనిచేస్తుంది. ప్రస్తుతం వాట్సప్ పది భారతీయ భాషల్లోను, ప్రపంచవ్యాప్తంగా 50 భాషల్లోను అందుబాటులో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ దీన్ని 10 కోట్లమంది ఉపయోగిస్తున్నారు.