ఆ యాప్‌తో మీ సొమ్ము మాయం ! | CBI Warns Of Covid Apps That Can Steal Your Money | Sakshi
Sakshi News home page

కోవిడ్‌ యాప్స్‌పై సీబీఐ హెచ్చరిక

Published Tue, May 19 2020 8:11 PM | Last Updated on Tue, May 19 2020 8:11 PM

CBI Warns Of Covid Apps That Can Steal Your Money - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ మహమ్మారి సమాచారం కోసం స్మార్ట్‌ఫోన్లలో యాప్‌లను ఇబ్బడిముబ్బడిగా డౌన్‌లోడ్‌ చేసుకుంటే మీ జేబు గుల్లయ్యే ప్రమాదం ఉందని సీబీఐ హెచ్చరించింది. కరోనా వైరస్‌ సంబంధిత అప్‌డేట్స్‌ను ఉపయోగిస్తూ ఓ హానికర యాప్‌ దాన్ని ఇన్‌స్టాల్‌ చేసుకున్న యూజర్‌ క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల వంటి ఆర్థిక సమాచారాన్ని దొంగిలించి ఆయా ఖాతాల నుంచి నగదును విత్‌డ్రా చేస్తాయని సీబీఐ పేర్కొంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలితప్రాంతాలను అప్రమత్తం చేసింది. స్మార్ట్‌ఫోన్‌ యూజర్లను నిండాముంచుతున్న ఈ యాప్‌ నిర్వాకంపై సీబీఐకి  ఇంటర్‌పోల్‌ సమాచారం అందించింది. ఈ హానికారక సాఫ్ట్‌వేర్‌ కోవిడ్‌-19 కంటెంట్‌ పేరుతో ఎస్‌ఎంఎస్‌ను పంపి దానిద్వారా ఈ లింక్‌ను డౌన్‌లోడ్‌ చేసకునేలా యూజర్లను బోల్తాకొట్టిస్తుందని సీబీఐ పేర్కొంది. కాగా పలు రాష్ట్రాల పోలీసులకు ఈ తరహా మోసాలపై పెద్దసంఖ్యలో ఫిర్యాదులు వస్తున్న సంగతి తెలిసిందే.

చదవండి : విజయ్‌ మాల్యాకు భారీ షాక్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement