mallu wood
-
ప్రముఖ నటి అపర్ణ మృతికి భర్తే కారణం.. ఏం జరిగిందంటే
మలయాళ ప్రుమఖ నటి అపర్ణ నాయర్ ఆత్మహత్యకు కుటుంబ సమస్యలే కారణమని పోలీసులు ఎఫ్ఐఆర్ చేశారు. ఆమె ఆగష్టు 31 రాత్రి 7 గంటలకు కేరళ, తిరువనంతపురంలోని కరమణ తలియాల్లో ఉండే తన ఇంట్లో అచేతన స్థితిలో మృతిచెందిన విషయం తెలిసిందే. అపర్ణ మృతి పట్ల విచారించిన పోలీసులు.. భర్తతో గొడవల కారణంగానే ఆమ ఆత్మహత్య చేసుకుందని వారు తెలిపారు. భర్త అతిగా తాగడం, ఆమెను నిర్లక్ష్యం చేయడం వల్లే అపర్ణ ఆత్మహత్య చేసుకుందని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. దీంతో ఇంట్లో నిత్యం గొడవలు జరుగుతుండేవని నివేదిక పేర్కొంది. ఇంట్లో గొడవల కారణంగానే ఆత్మహత్య చేసుకుందని అపర్ణ కుటుంబ సభ్యులు కూడా పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. ఆత్మహత్యకు ముందు అపర్ణ తన తల్లికి వీడియో కాల్ చేసి ఇంట్లోని సమస్యల గురించి విలపించినట్లు సమాచారం. నేను వెళ్లిపోతున్నాను పిల్లలు జాగ్రత్త అంటూ కన్నీళ్లు పెట్టుకున్న అపర్ణ.. తన అమ్మగారితో కొంత సమయం మాట్లాడి ఫోన్ కట్ చేసింది. ఈ వీడియో కాల్ ఆగష్టు 31 సాయంత్రం 6 గంటలకు జరిగింది. అనంతరం రాత్రి 7 గంటలకు అపర్ణ ఆత్మహత్యకు పాల్పడింది. (ఇదీ చదవండి: మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన తమ్ముడు.. ఏడ్చేసిన బేబి హీరోయిన్!) ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు భర్త సంజిత్ గుర్తించి వెంటనే అపర్ణ తల్లి బీనా, సోదరి ఐశ్వర్యలకు సమాచారం అందించాడు. దీని ఆధారంగా ఐశ్వర్య వెంటనే అక్కడికి చేరుకునే సరికి అపర్ణ మంచంపై పడి ఉంది. వెంటనే అంబులెన్స్‌లో సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. అపర్ణకు రెండో పెళ్లి అపర్ణ కుటుంబ సభ్యుల వాంగ్మూలం ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ సిద్ధం చేశారు. ప్రస్తుతం సంజిత్ను పోలీసులు విచారిస్తున్నారు. అపర్ణ, సంజిత్లకు ఇది రెండో వివాహం. అపర్ణకు మొదటి వివాహం నుంచి ఒక కుమార్తె ఉండగా.. ఆమెకు సంజిత్‌కు జన్మించిన మూడేళ్లు కుమార్తె ఉంది. మొదట్లో వీరి జీవితం బాగానే సాగినా భర్త అతిగా తాగడం వల్ల తరచూ గొడవలు జరిగేవి. అపర్ణ తన బంధువులకు చాలాసార్లు ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పిందని బంధువులు తెలిపారు. అపర్ణా నాయర్ 2005లో మయూఖం సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. అలా సుమారు 50 పైగా సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. -
Aparna Nair: 50 పైగా సినిమాలతో మెప్పించిన ప్రముఖ నటి మృతి.. పలు అనుమానాలు
కన్నడ నటుడు విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన మరణవార్త అక్కడ పరిశ్రమను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కేరళ పరిశ్రమలో సినీ నటి మరణవార్త కలిచి వేసింది. మలయాళంలో సుమారు 50 సినిమాలతో పాటు బుల్లితెరపై పలు సీరియల్స్‌తో చురుగ్గా ఉండే నటి అపర్ణా నాయర్ (33).. తెలుగులో కూడా 'చిన్ని చిన్ని ఆశ' అనే సినిమాలో హీరోయిన్గా నటించారు. ఆమె నిన్న (ఆగస్టు 31) రాత్రి 7 గంటలకు రాజధాని తిరువనంతపురంలోని కరమణ తలియాల్లోని తన ఇంట్లో మృతి చెందారు. కానీ ఆమె మరణానికి పూర్తి వివరాలు ఇంకా తెలియలేదు. (ఇదీ చదవండి: మెగాస్టార్ చిరంజీవి వాచ్ ధర తెలిస్తే.. ఎవరైనా నోరెళ్ల బెట్టాల్సిందే) అపర్ణ మరణం పట్ల పలు అనుమానాలు ఉన్నాయని అక్కడి పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కుటుంబ తగాదాల కారణంగా ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందని సన్నిహితులు చెబుతున్నారు. అపర్ణా నాయర్ మలయాళం సినిమాలు, సీరియల్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అక్కడ ఆమె తెలియని సినీ ప్రేక్షకులు ఉండరనేది నిజం.. దీంతో ఆమె అభిమానులు తీవ్ర శోకంలో ఉన్నారు. అపర్ణ మృతదేహాన్ని తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. నటుడు సంజిత్ను ఆమె వివాహం చేసుకుంది. వారికి త్రయ, కృతిక అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. (ఇదీ చదవండి: 'ఖుషి' రిజల్ట్‌పై విజయ్ దేవరకొండ ఫస్ట్ రియాక్షన్) ఇప్పటికే ఆమె మృతిపై కరమన పోలీసులు విచారణ చేపట్టారు. త్వరలో నటి మృతికి గల కారణాలు తెలుపాతమని చెప్పారు. అపర్ణా నాయర్ తిరువనంతపురంలో ఉండేవారు. ఈ ఘటన జరిగినప్పుడు ఇంట్లో ఆమె తల్లి, సోదరి ఉన్నట్లు సమాచారం. ఇంట్లో అపస్మారక స్థితిలో ఉన్న అపర్ణను చూసి వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె తుదిశ్వాస విడిచినట్లు తెలిసింది. కూతురిని పోగొట్టుకోవడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. అపర్ణ మృతికి అభిమానులు సంతాపం నటి అపర్ణ మృతి కుటుంబ సభ్యులతో పాటు అభిమానులను, సన్నిహితులను తీవ్ర వేదనకు గురిచేసింది. నటి మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. అంతేకాకుండా సినీ పరిశ్రమకు చెందిన సహచరులు కూడా తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. అపర్ణా నాయర్ 2005లో మయూఖం సినిమాతో అరంగేట్రం చేసి, ఆ తర్వాత రన్ బేబీ రన్, సెకండ్స్, అచ్చయాన్స్, మేఘతీర్థం, ముద్దుగౌ, కార్ట్ సమక్షమ బాలన్ వాకిల్, కల్కి వంటి అనేక చిత్రాలతో పాటు చందనమజ, ఆత్మసఖి సీరియల్స్‌లో నటించారు. -
ఆ ఇద్దరు హీరోల రూటే సెపరేటు!
సినీ ప్రపంచంలో స్టార్ హీరోలు సాధారణంగా ఏడాదికి ఒకటో రెండో సినిమాలు చేస్తుంటారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, శాండిల్‌వుడ్... ఎక్కడైనా టాప్ స్టార్లంతా ఇదే ఫార్మాట్‌ను పక్కగా అనుసరిస్తుంటారు. కానీ మల్లూవుడ్‌లో ఇద్దరు పెద్ద హీరోలు మాత్రం అందుకు భిన్నంగా వెళుతున్నారు. వరుసపెట్టి సినిమాలుపై సినిమాలు చేసుకుంటూ విజయపధంలో దూసుకుపోతున్నారు. టాప్ హీరోలలో కొందరి సినిమాలు ఏడాదికి ఒకటి కూడా రావడం గగనమే. మలయాళీ స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్‌లాల్‌లు వరుసుగా సినిమాలు చేస్తూ అభిమానుల్ని అలరిస్తున్నారు. ఈ ఏడాదిలో మోహన్‌లాల్ ఇప్పటి వరకు మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ వరుసలో రీసెంట్గా రిలీజైన పేరుచాళి సినిమా మిక్సడ్ టాక్ని సొంతం చేసుకుంది. ఇక మమ్మట్టి అయితే ఏకంగా ఆరు సినిమాలతో అభిమానుల్ని అలరించే ప్రయత్నం చేశారు. వీటిలో రాజాది రాజా, మునియారప్ప, మంగ్లీష్ వంటి సినిమాలు వరుసుగా హిట్ అయ్యాయి. వయసు మీదపడుతున్నా ఈ స్టార్ హీరోలు మాత్రం ఎక్కడా స్పీడు తగ్గించడంలేదు. దాంతో అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. **