ఆ ఇద్దరు హీరోల రూటే సెపరేటు! | Burgeoning heroes | Sakshi
Sakshi News home page

ఆ ఇద్దరు హీరోల రూటే సెపరేటు!

Published Wed, Oct 1 2014 4:47 PM | Last Updated on Sat, Sep 2 2017 2:14 PM

మోహన్ లాల్ -ముమ్ముట్టి

మోహన్ లాల్ -ముమ్ముట్టి

సినీ ప్రపంచంలో స్టార్ హీరోలు సాధారణంగా  ఏడాదికి ఒకటో రెండో సినిమాలు చేస్తుంటారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌, శాండిల్‌వుడ్‌... ఎక్కడైనా  టాప్‌ స్టార్లంతా ఇదే ఫార్మాట్‌ను పక్కగా అనుసరిస్తుంటారు. కానీ మల్లూవుడ్‌లో  ఇద్దరు పెద్ద హీరోలు మాత్రం అందుకు భిన్నంగా వెళుతున్నారు.  వరుసపెట్టి  సినిమాలుపై సినిమాలు చేసుకుంటూ విజయపధంలో దూసుకుపోతున్నారు. టాప్ హీరోలలో కొందరి సినిమాలు ఏడాదికి ఒకటి కూడా రావడం గగనమే. మలయాళీ స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్‌లాల్‌లు వరుసుగా సినిమాలు చేస్తూ అభిమానుల్ని అలరిస్తున్నారు.

ఈ ఏడాదిలో మోహన్‌లాల్‌ ఇప్పటి వరకు మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ వరుసలో రీసెంట్‌గా రిలీజైన పేరుచాళి సినిమా మిక్సడ్‌ టాక్‌ని సొంతం చేసుకుంది. ఇక మమ్మట్టి అయితే ఏకంగా ఆరు సినిమాలతో అభిమానుల్ని అలరించే ప్రయత్నం చేశారు. వీటిలో రాజాది రాజా,  మునియారప్ప, మంగ్లీష్‌ వంటి సినిమాలు వరుసుగా హిట్ అయ్యాయి. వయసు మీదపడుతున్నా ఈ స్టార్ హీరోలు మాత్రం ఎక్కడా స్పీడు తగ్గించడంలేదు. దాంతో  అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు.
**
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement