Maluru
-
పావురాలు కొనడానికి వచ్చి...కత్తితో దాడి
మాలూరు: పావురాలు కొనడానికి వచ్చిన వ్యక్తి ఒకే కుటుంబంలోని ఏడుగురిని కత్తితో పొడిచి తీవ్రంగా గాయపరిచిన ఘటన కోలారు జిల్లా మాలూరు పట్టణంలోని పటాలమ్మ కాలనీలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. కాలనీలో నివాసం ఉంటున్న రాము, భార్య హేమావతి, నాగవేణి, రాజేశ్వరి, రూపా, నాగరాజ్,మరొకరు కత్తిపోట్లకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రాత్రి ఎందుకు వచ్చావనడంతో వివరాలు.... నాగరాజ్ తమ్ముడు రాము పావురాల వ్యాపారం చేస్తున్నాడు. మంగళవారం రాత్రి పావురాలు ఖరీదు చేయడానికి ఇమ్రాన్ ఖాన్ అనే వ్యక్తి వచ్చాడు. అప్పటికే మద్యం తాగి ఉన్న ఇమ్రాన్‌ను చూసిన నాగరాజ్ రాత్రి సమయంలో ఎందుకు వచ్చావని అడిగాడు. దీంతో కోపోద్రిక్తుడైన ఇమ్రాన్‌ఖాన్ తన వెంట తెచ్చుకున్న కత్తితో ఇంట్లో ఉన్న వారిపై దాడి చేసి ఏడుగురిని గాయపరిచాడు. చుట్టుపక్కల వారు వచ్చి బాధితులను ఆస్పత్రిలో చేర్పించారు. మాలూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుని ఇమ్రాన్‌ఖాన్‌ను అరెస్టు చేశారు. దాడి వెనుక పాత కక్షలు ఏవైనా ఉన్నాయా? అని విచారణ చేపట్టారు. ఈ దాడి ఘటన పట్టణంలో తీవ్ర కలకలం సృష్టించింది. (చదవండి: మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ పేరిట వికృత చేష్టలు.. రంగంలోకి పోలీసులు) -
అప్పు కట్టలేదని ఇంట్లోకి చొరబడి..
బెంగళూరు : తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వనందుకు రుణదాత అనుచరులతో వచ్చి రివాల్వర్‌తో బెదిరించిన ఘటన మాలూరు తాలూకాలోని జయమంగల గ్రామంలో చోటు చేసుకుంది. తుపాకీతో హల్చల్ చేయడం చూసి గ్రామస్థులు మూకుమ్మడిగా తిరగబడడంతో తోకముడిచారు. తాలూకాలోని లక్కూరు ఫిర్కా జయమంగల గ్రామంలో బోళేగౌడ అనే వ్యక్తి బెంగుళూరుకు చెందిన హేమంత్ అలియాస్ మున్నాభాయ్ అనే వ్యక్తి నుంచి కొంత డబ్బు అప్పు తీసుకున్నాడు. వడ్డీలు, అప్పు చెల్లించలేదంటూ ఆ వ్యక్తి తన అనుచరులు అయిన సురేష్, మంజునాథ్, నబీద్ అనే వారితో జయమంగల గ్రామంలోని బోళేగౌడ ఇంటికి వచ్చాడు. ఇంట్లో ఉన్న బోళేగౌడ భార్య కామాక్షమ్మ, కూతురు అంజలీదేవి తలుపులు తెరిచారు. వెంటనే వారు లోపలికి చొరబడి అప్పు కట్టకుంటే చంపేస్తామని రివాల్వర్‌తో బెదిరించారు. ఇంట్లో భర్త లేడని చెప్పినా వినిపించుకోకుండా వారితో గొడవ పడ్డారు. ఈ సమయంలో కామాక్షమ్మ, కూతురు అంజలీదేవి గట్టిగా అరవడంతో చుట్టుపక్కల ఇండ్ల వారు అక్కడికి రావడంతో వారు అక్కడి నుంచి పరారయ్యారు. ఘటనపై అనంతరం బోళేగౌడ కుటుంబం మాలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి లైసెన్స్డ్ రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బండరాయి పడి కార్మికుల దుర్మరణం
మాలూరు:బండరాయి మీదపడడంతో ఇద్దరు కార్మికులు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే... తాలూకాలోని వీరకపుత్ర గ్రామ సమీపంలోని క్వారీలో కెంపసంద్ర గ్రామానికి చెందిన ప్రభాకర్(30), నాగరాజు(32) మరికొందరు కా ర్మికులు పనిచేస్తున్నారు. ఆదివారం సా యంత్రం వీరు క్వారీలో పనిచేస్తుండగా నాలుగుగంటలకు కొండపై ఉన్న డైనమేట్ పేలి పక్కనే ఉన్న పెద్ద బండరాయి దొర్లుకుంటూ వచ్చి కార్మికులపై పడింది. ఘటనలో ప్రభాకర్, నాగరాజు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు కార్మికులు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిలో పరిస్థితి ఆందోళన కరంగా ఉన్న మంజునాథ్, అంబరీష్ అ నే కార్మికులను మెరుగైన చికిత్స కోసం కోలారుకు తీసుకెళ్లారు. బండ కింద ఇరుక్కుపోయిన మృతదేహాలను జేసీబీ సాయంతో అతి కష్టంపై వెలికి తీశారు. ఘటనాస్థలాన్ని సీఐ శివకుమార్, తహశీల్దార్ సి.ఎల్.శివకుమార్ తదితరులు పరిశీలించారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.