బండరాయి పడి కార్మికుల దుర్మరణం | A stone slab falls and two worker died | Sakshi
Sakshi News home page

బండరాయి పడి కార్మికుల దుర్మరణం

Published Mon, May 11 2015 3:07 AM | Last Updated on Sun, Sep 3 2017 1:48 AM

A stone slab falls and two worker died

మాలూరు:బండరాయి మీదపడడంతో ఇద్దరు కార్మికులు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే... తాలూకాలోని వీరకపుత్ర గ్రామ సమీపంలోని క్వారీలో కెంపసంద్ర గ్రామానికి చెందిన ప్రభాకర్(30), నాగరాజు(32) మరికొందరు కా ర్మికులు పనిచేస్తున్నారు. ఆదివారం సా యంత్రం వీరు క్వారీలో పనిచేస్తుండగా నాలుగుగంటలకు కొండపై ఉన్న డైనమేట్ పేలి పక్కనే ఉన్న పెద్ద బండరాయి దొర్లుకుంటూ వచ్చి కార్మికులపై పడింది.

ఘటనలో ప్రభాకర్, నాగరాజు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు కార్మికులు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిలో పరిస్థితి ఆందోళన కరంగా ఉన్న మంజునాథ్, అంబరీష్ అ నే కార్మికులను మెరుగైన చికిత్స కోసం కోలారుకు తీసుకెళ్లారు. బండ కింద ఇరుక్కుపోయిన మృతదేహాలను జేసీబీ సాయంతో అతి కష్టంపై వెలికి తీశారు. ఘటనాస్థలాన్ని  సీఐ శివకుమార్, తహశీల్దార్ సి.ఎల్.శివకుమార్ తదితరులు పరిశీలించారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement