Managudi program
-
వామ్మో.. ఎంత పామో!
తిరుమల: తిరుమల జీఎన్సీ టోల్గేట్ సమీపంలోని నర్సరీలో మంగళవారం ఏడు అడుగుల జెర్రిపోతు భయభ్రాంతులకు గురిచేసింది. నర్సరీలో పనిచేస్తున్న కార్మికులు పామును చూసి, ఫారెస్ట్ స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడికి సమాచారం అందించారు. ఆయన పామును చాకచక్యంగా పట్టుకుని అవ్వాచారి కోనలో వదిలేశారు.9న శ్రీవారి ఆలయంలో పుష్పయాగం తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబరు 9న శనివారం పుష్పయాగ మహోత్సవం జరగనున్నది. నవంబరు 8న శుక్రవారం రాత్రి 8 నుంచి 9 గంటల వరకు పుష్పయాగానికి అంకురార్పణ నిర్వహించనున్నారు. పుష్పయాగం రోజున ఆలయంలో రెండో అర్చన, రెండో గంట, నైవేద్యం అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి ఉత్సవమూర్తులను సంపంగి ప్రదక్షిణంలోని కళ్యాణ మండపానికి వేంచేపు చేసి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. సాయంత్రం ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీమలయప్పస్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. కాగా పుష్పయాగానికి అంకురార్పణ సందర్భంగా సాయంత్రం సహస్రదీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది. అలాగే పుష్పయాగం రోజున కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, ఆర్జిత సేవలు రద్దయ్యాయి. 11 నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘మనగుడి’తిరుపతి (అలిపిరి): కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఈనెల 11 నుంచి 17 వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని ఎంపిక చేసిన శివాలయాల్లో ‘మనగుడి’ నిర్వహించనున్నట్టు టీటీడీ మంగళవారం ఓ ప్రకటలో తెలిపింది. దీన్లోభాగంగా ఏపీలోని 26 జిల్లాలు, తెలంగాణలోని 33 జిల్లాల్లో జిల్లాకు ఒకటి చొప్పున ఎంపిక చేసిన శివాలయాల్లో 7 రోజుల పాటు కార్తీకమాస విశిష్టతపై ధార్మికోపన్యాసాలు నిర్వహిస్తారు. ఒక్కో జిల్లాలో రెండు చొప్పున ఆలయాలను ఎంపిక చేసి నవంబరు 13న కైశిక ద్వాదశి పర్వదిన కార్యక్రమాలు, జిల్లాకు ఒకటి చొప్పున ఎంపిక చేసిన శివాలయాల్లో నవంబరు 15న కార్తీక దీపోత్సవం నిర్వహించనున్నట్లు టీటీడీ పేర్కొంది. -
శ్రీవారి పాదాల వద్ద మనగుడి పూజా సామాగ్రి
తిరుమల: మనగుడి కార్యక్రమ పూజా సామాగ్రిని అర్చకులు శ్రీ వెంకటేశ్వరుడి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని 12 వేల ఆలయాల్లో ఈ నెల 14న 8వ విడత మనగుడి కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమాన్ని దేవాదాయశాఖ, టీటీడీ అధికారులు సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. మనగుడి కార్యక్రమంలో భాగంగా శివాలయాల్లో ప్రత్యేక పూజలు, కంకణ ప్రసాదం వితరణ చేయనున్నారు. -
వైభవంగా రాఖీ పౌర్ణమి వేడుకలు
సిద్దిపేట టౌన్: సిద్దిపేటలో ఆదివారం రాఖీ పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి అన్నాచెల్లెళ్లు సిద్దిపేటకు రావడం, సిద్దిపేట నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లడంతో బస్టాండ్ రద్దీగా మారింది. ఇంటింటా పండుగ సంబురాలు జరిగాయి. సోదరులకు రాఖీలు కట్టి, మిఠాయిలు తినిపించి సోదరీమణులు మురిసారు. వారికి కానుకలు అందించి, వారి నుంచి ఆశీస్సులు అందుకున్నారు. మనగుడి కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని ఆలయాల్లో రక్షాబంధన్‌లకు పూజలు నిర్వహించి భక్తులకు వాటిని పూజారులు కట్టారు. ఈ సందర్భంగా పట్టణంలోని మహాగణపతి ఆలయం, వెంకటేశ్వరస్వామి ఆలయం, సంతోషిమాత గుడి, షిరిడి సాయిబాబా, వీరహనుమాన్ దేవాలయాలతో పాటు అన్ని ఆలయాల్లో దేవతామూర్తులను అలంకరించారు. విశేష పూజలు నిర్వహించారు. సంతోషిమాత గుడిలో మంత్రి హరీష్‌రావుకు రాఖీని కట్టి పూజరులు ఆశీర్వదించారు. క్షీరాభిషేకంలో పాల్గొన్న మంత్రి... సంతోషిమాత గుడిలో ఆదివారం అమ్మవారి జన్మదినోత్సవం కన్నుల పండువగా జరిగింది. రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఆలయంలో అమ్మవారి మూర్తికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఆయనతో పాటు భక్తులు ముఖ్యంగా మహిళలు భారీ సంఖ్యలో ఉత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ వృషాధీశ్వర్రెడ్డి, ఆలయ ప్రధాన పూజారి రామకృష్ణచార్యులు, మాజీ చైర్మన్లు కాచం కాశీనాథ్, తమ్మిశెట్టి వీరేశం, బండెపల్లి కిష్టయ్య మంత్రికి ఘన స్వాగతం పలికారు. శాలువాతో మంత్రిని సన్మానించారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా పట్టణంలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కాగా, మంత్రి హరీష్‌కు ఆదివారం ఆయన ఇంట్లో పార్టీ నాయకురాళ్లు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా పీఆర్టీయూ సమావేశంలో మహిళా ఉపాధ్యాయులు మంత్రికి రాఖీలు కట్టి అభినందనలు తెలిపారు.