శ్రీవారి పాదాల వద్ద మనగుడి పూజా సామాగ్రి
Published Fri, Nov 4 2016 12:39 PM | Last Updated on Mon, Sep 4 2017 7:11 PM
తిరుమల: మనగుడి కార్యక్రమ పూజా సామాగ్రిని అర్చకులు శ్రీ వెంకటేశ్వరుడి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని 12 వేల ఆలయాల్లో ఈ నెల 14న 8వ విడత మనగుడి కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమాన్ని దేవాదాయశాఖ, టీటీడీ అధికారులు సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. మనగుడి కార్యక్రమంలో భాగంగా శివాలయాల్లో ప్రత్యేక పూజలు, కంకణ ప్రసాదం వితరణ చేయనున్నారు.
Advertisement
Advertisement