చెట్టును ఢీకొన్న బస్సు..10 మందికి గాయాలు
మంచిర్యాల రూరల్: ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలం ఉరిపేట వద్ద బుధవారం రాత్రి ఆర్టీసీ బస్సు చెట్టును ఢీకొనడంతో 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఆర్టీసీ బస్సు ఆదిలాబాద్ నుంచి మంచిర్యాలకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. వర్షం పడుతుండడం, అదే సమయంలో డ్రైవర్ వేగంగా నడపడం వల్ల బస్సు అదుపుతప్పినట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.