mandal officers
-
డంపింగ్ యార్డుల నిర్మాణానికి స్థల సేకరణ
ఒంగోలు రూరల్: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్వచ్చ భారత్‌లో భాగంగా గ్రామాల్లో సాలీడ్ వెల్త్ ప్రోసెసింగ్ సెంటర్లను నిర్మించేందుకు మండల స్థాయి అధికారుల నియామకం జరిగింది. గ్రామ పంచాయతీల్లో సాలీడ్ వేస్టు మేనేజ్మెంట్ విధానం ద్వారా పారిశుధ్యం, ఆరోగ్య భద్రత కల్పించేందుకు ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డుల నిర్మాణానికి మండల స్థాయి అధికారులను నియమించారు. మండలంలోని ఎంపీడీఓ, ఈఓఆర్డి, డ్వామా ఏపీఓ, ఏపీఎం డీఆర్డీఏ, ఏఈఈపిఆర్, ఏఈఈఆర్‌డబ్ల్యూఎస్ నియామకం జరిగింది. జిల్లాలోని అన్ని మండలాల్లో మండల స్థాయి అధికారులు వారికి కేటాయించబడిన దత్తత గ్రామాల్లో డంపింగ్ యార్డుల నిర్మాణానికి కృషిచేయాలనీ ఆదేశించారు. దీనికోసం వెంటనే తగు చర్యలు తీసుకోవాలనీ ఆదేశించారు. గ్రామ పంచాయితీలో సాలీడ్‌వెల్త్ ప్రొసెసింగ్ నిర్మాణం కొరకు కావలసిన స్థల సేకరణ గుర్తించి స్థానిక పంచాయితీ కార్యదర్శి, సర్పంచ్ సహకారంతో మండల తహసీల్దార్ ద్వారా 31.03.2017లోగా స్థల సేకరణ పూర్తి చేయాల్సిందిగా ఆదేశించారు. ఒంగోలు మండలంలో ఎంపీడీఓ ఎం.వెంకటేశ్వరావు ఉలిచి గ్రామాన్ని, ఈఓఆర్డి పిఆర్ బాలచెన్నయ్య వలేటివారిపాలెం, ఏపీఓ కె.నాగరాజు యరజర్ల, ఏపీఎం ఐకెపి కె.విజయకుమారి సర్వేరెడ్డిపాలెం, ఏఈఈపిఆర్ ఎంవి శివప్రసాదరావు చేజర్ల, ఏఈఈ ఆర్డ్‌బ్ల్యూఎస్ సతీష్‌చంద్ర దేవరంపాడు దళితవాడ నియామకం జరిపారు. వీరు ఈ నెల 31లోగా డంపింగ్ యార్డు స్థల సేకరణ పూర్తి చేసి జిల్లా కలెక్టర్ పంచాయితీ రాజ్ విభాగానికి సమాచారం అందజేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేశారు. -
స్మార్ట్ ఫైట్
- స్మార్ట్ ఫోన్ కొనుక్కోండి: జిల్లా కలెక్టర్ - ఆర్డర్ పాస్ చేస్తే కొంటా: కోహీర్ ఎంపీడీవో బదులు - కలెక్టరేట్లో లడాయి - సమావేశాన్ని బహిష్కరించిన మండల అధికారులుమెస్సేజ్లు ఇస్తే మీ నుంచి రిప్లై రావడం లేదు. కోహీర్ ఎంపీడీవో స్టీవెనీల్ చేయి పైకి లేపారు కలెక్టర్: మీరో స్మార్ట్ ఫోన్ కొనుక్కోండి స్టీవెనీల్: వారం రోజుల్లో జీతం వచ్చాక కొనుక్కుంటా సార్ కలెక్టర్: దీనికి వారం ఎందుకు? డబ్బుల్లేకుంటే నేను ఇస్తా. తొందరగా ఫోన్ కొనుక్కోండి స్టీవెనీల్: మీరెందుకు నాకు డబ్బులివ్వాలి. నాకు భిక్షం వేస్తున్నారా? కచ్చితంగా స్మార్ట్ ఫోన్ కొనుక్కొమ్మని ఒక సర్క్యులర్ ఇచ్చి ఆర్డర్ పాస్ చేయండి కలెక్టర్: వాట్ ఆర్ యూ టాకింగ్.. ఫస్ట్ యూ గో అవుట్ స్టీవెనీల్: నేనెందుకు వెళ్లాలి. మీరేం మాట్లాడుతున్నారు? ... ఎంపీడీవోకు మద్దతుగా ఇతర ఎంపీడీవోలు సమావేశం బహిష్కరించి వెళ్లిపోయారు. పాలనపరమైన సౌలభ్యం కోసం ఒక్క స్మార్ట్ ఫోన్ కొనుక్కోమని చెప్పినందుకు ఎంపీడీవోలు హంగామా చేశారు. జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం జరిగిన ఎంపీడీవోలు, డ్వామా ఏపీవోల సమీక్ష సమావేశంలో చోటుచేసుకున్న ఈ ఉదంతం చర్చనీయాంశమైంది. అధికార వర్గాల్లో కలకలం స్మార్ట్ ఫోన్ వివాదం అధికార వర్గాల్లో కలకలం రేపింది. మునుముందు జిల్లా యంత్రాంగం నుంచి ఇలాంటి ధిక్కారాలు కలెక్టర్ రోనాల్డ్రాస్కు ఇంకా ఎన్ని ఎదురు కానున్నాయో అని పలువురు చర్చించుకుంటున్నారు. మొన్నటి వరకు ఏడాది పాటు జిల్లా యంత్రాంగం ఇష్టారాజ్యం నడిచింది. అప్పటి ‘పెద్ద సార్’ క్షేత్రస్థాయి పరిశీలన లేకుండానే పనులు చక్కబెట్టేసే వారనే అపవాదు ఉంది. అప్పట్లో ఎవరికీ ఎవరిపై అజమాయిషీ, పర్యవేక్షణ లేకుండాపోయాయి. నిజానికి జిల్లా అత్యున్నత స్థాయి అధికారులంతా క్షేత్రాధికారులే. వారంలో కనీసం రెండు మూడుసార్లైనా పల్లెలను సందర్శించి, ప్రజల మాట వినాలి. సమస్యలు తెలుసుకోవాలి. పరిష్కార మార్గాలు అన్వేషించాలి.. కానీ, ఉన్నత స్థాయి అధికారులంతా ప్రజలకు, పాలనకు దూరంగా గడిపారనే ఆరోపణలున్నాయి. కీలక శాఖల అధికారులంతా తమ సమయ పాలనను ‘అత్యున్నత స్థాయి అధికారి’ దినచర్యతో సెట్ చేసుకున్నారు. వాళ్లను చూసి సబార్డినేట్లు, వారిని చూసి క్షేత్రస్థాయి అధికారులు.. సిబ్బంది.. ఇలా ఏడాది పాటు ఆడింది ఆటగా కొనసాగింది. ఫలితంగా ముఖ్యమంత్రి కేసీఆర్.. జిల్లాకు రూ.వేల కోట్ల నిధులు మంజారు చేసినా పనులు మాత్రం నత్తనడక నడిచాయి. కొత్త కలెక్టర్ వచ్చీ రావడంతోనే క్షేత్రస్థాయి పర్యటనలతో బిజీగా గడుపుతున్నారు. ఇన్నాళ్లూ కుర్చీలకు అతుక్కుపోయిన క్షేత్రస్థాయి యంత్రాంగం ఆయన వెంట పరుగులు తీయలేక.. ఇలా ధిక్కార స్వరం వినిపించనున్నారనేందుకు గురువారం నాటి ఉదంతం ఓ ఉదాహరణ అని కొందరు అధికారులు అంటున్నారు. ప్రజలే రక్షణ కవచం... కొత్త కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన రోనాల్డ్‌రాస్ క్షేత్రస్థాయి పరిశీలనలతో అధికారులను హడలెత్తిస్తున్నారు. సమీక్షలు, సమావేశాల్లో వాస్తవ పరిస్థితికి, నివేదికలకు బేరీజు వేసి చూస్తున్నారు. తన వైఖరేమిటో ఆయన తన పనితీరు ద్వారా ఇప్పటికే అధికారులకు చూపించారు. ఇంతకాలం ఇష్టారాజ్యంగా వ్యవహరించిన అధికారులు ఈ తీరును ఇముడ్చుకోలేక ఘర్షణ వైఖరిని చాటుతున్నారని కలెక్టరేట్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అయితే, ప్రజలతో మమేకమవుతూ పనిచేస్తున్న కలెక్టర్‌కు ప్రజలు, ప్రజా సంఘాలే రక్షణ కవచంలా నిలుస్తారని పలువురు అంటున్నారు. -
మండల అధికారులపై కలెక్టర్ కు ఫిర్యాదు
శ్రీకాకుళం: ఆముదాల వలస నియోజక వర్గంలో స్థానిక ప్రజాప్రతినిధులను ప్రభుత్వ కార్యక్రమాల నుంచి విస్మరించడంతో మండల అధికారులపై వైఎస్సార్సీపీ హైపవర్ కమిటీ సభ్యులు తమ్మినేని సీతారాం జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.