క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం రాలేదని ఆత్మహత్య!
కోల్ కతా: క్యాంపస్ ఇంటర్వ్యూలో ఆశించిన ఉద్యోగం రాలేదని మనస్తాపం చెందిన ఓ విద్యార్ధి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన జాదవ్ పూర్ యూనివర్సిటీలో మంగళవారం చోటు చేసుకుంది. మనీష్ టాండన్ అనే విద్యార్ధి క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం రాలేదని హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని యూనివర్సిటీ అధికారులు తెలిపారు.
మనీష్ తెలివైన విద్యార్ధి. అమెజాన్, మైక్రోసాఫ్ట్ కంపెనీల్లో ఉద్యోగం వస్తుందని ఆశపెట్టుకున్నాడు. కాని దురదృష్టం వెంటాడింది. రెండు కంపెనీల్లోనూ ఉద్యోగం లభించలేదు. దాంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డారు అని ఐటీ హెడ్ సమిరాన్ చటర్జీ తెలిపారు. మనీష్ మరణవార్తతో జాదవ్ పూర్ యూనివర్సిటీలో విషాదం నెలకొంది.