బిగ్ బాస్ చరిత్రలోనే ఇది దారుణమైన టాస్క్.. వీడియో వైరల్
హిందీ బిగ్ బాస్ 17 దాదాపు పూర్తి కావస్తోంది. ప్రస్తుతం 95 రోజుకు ఈ సీజన్ చేరుకుంది. తాజాగా చివరి నామినేషన్ ప్రక్రియ జరిగింది. తెలుగులో మాదిరి కాకుండా వీరిని రెండు గ్రూపులుగా విభజించి ఒక టాస్క్ ఇచ్చి నామినేషన్ చేయమని బిగ్ బాస్ చెప్పాడు. ప్రస్తుతం హౌస్‌లో ఎనిమిది మంది కంటెస్టెంట్లు ఉన్నారు. వారిని రెండు గ్రూపులుగా విభిజించి టాస్క్‌లు పెట్టాడు. టాప్-5 లిస్ట్‌లో ఉంటారని అనుకున్న వారిలో నలుగురిని ఒక టీమ్‌లో బిగ్ బాస్ ఉంచాడు. ఆ నలుగురిని కూడా రెండు జంటలుగా ఉంచాడు. మున్నావర్, అరుణ్, అభిషేక్, మన్నారా చోప్రా గ్రూపు-Aలో ఉన్నారు. అంకిత, ఇషా,విక్కీ, ఆయేషా ఈ నలుగురు గ్రూప్-Bలో ఉన్నారు.
గ్రూప్-ఏ వాళ్లు అందరూ దాదాపు టాప్-5 రీచ్ అయ్యే కంటెస్టెంట్లు.. గ్రూప్ -బీ సభ్యుల్లో ఉన్న విక్కీ, ఆయేషా ఎలిమినేట్ అవడం దాదాపు ఖాయం అయిపోయింది.. దీంతో ఎలాగైనా చివరి వారం ఎలిమినేషన్ తప్పించుకుంటే ఫైనల్ రేసులోకి ఎంట్రీ ఇవ్వచ్చు అని తాజాగా బిగ్ బాస్ పెట్టిన టాస్క్‌లో విక్కీ, అయేషా చాలా ఎక్స్ట్రీమ్కు వెళ్లారు. దీంతో మన్నారా చోప్రా, అభిషేక్ తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.
చివరి వారంలో బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్
గేమ్‌లో భాగంగా అక్కడ ఒక బజర్‌ను బిగ్ బాస్ ఏర్పాడు చేశాడు. ఆ బజర్‌ను నొక్కి పట్టుకున్నంత సేపు అక్కడ ఒక లైట్ వెలుగుతుంది. బజర్ నుంచి చెయి తీసేస్తే ఆ లైట్ ఆఫ్ అయిపోతుంది. ఎవరు ఎంత సమయం పాటు బజర్‌ను నొక్కి పట్టుకుంటారనేది టాస్క్... ఆ సమయంలో ఆపోజిట్ టీమ్ వాళ్లు పలు ఇబ్బందులు క్రియేట్ చేవయవచ్చని బిగ్ బాస్ చెప్తాడు. అక్కడ గెలుస్తే టాప్-5 వెళ్తారు.. లేదంటే నామినేషన్ లిస్ట్‌లో ఉంటారని బిగ్ బాస్ చెప్తాడు. గేమ్‌లో భాగంగా మొదట గ్రూప్-ఏ నుంచి మన్నారా చోప్రా, అభిషేక్ జోడీగా టాస్క్ ప్రారంభిస్తారు. వీరిద్దరూ కూడా టాప్ -5 లిస్ట్‌లో దాదాపు ఖాయం అని చెప్పవచ్చు.
వీరిద్దరూ జోడీగా బజర్‌ను నొక్కి పట్టుకుంటారు. ఆ సమయంలో వారిని ఇబ్బంది పెట్టేందుకు గ్రూప్- బీ నుంచి విక్కీ, అయేషా వస్తారు. వారిద్దరూ టాప్ -5 రేసులో లేరు.. చివరి వారంలో దాదాపు ఎలిమినేట్ అవడం ఖాయం అని వారికి కూడా తెలుసు. దీంతో ఎలాగైనా ఈ టాస్క్ గెలిచి టాప్-5లో చేరిపోవాలని వారిద్దరూ విచక్షణ కోల్పోయి టాస్క్‌లో ఎక్స్ట్రీమ్కు చేరుకుంటారు. బజర్ మీద చెయి పెట్టి ఉన్న మన్నారా చోప్రా, అభిషేక్ ముఖం మీద ఏకంగా కారం పొడి, కిచెన్‌లో ఉన్న మసాల పొడులు తీసుకొని వచ్చి పూస్తారు. అంతటితో ఆగకుండా నీటిలో కారం పొడి కలిపి వారి మొఖం మీద కొడుతారు. ఆ సమయంలో వారిద్దరూ అల్లాడిపోయారు.
అలా సుమారు 29 నిమిషాల పాటు వారు భరించి బజర్ మీది నుంచి చేతిని తీసేస్తారు. చివరకు వారిద్దరూ మెడికల్ రూమ్‌కు వెళ్లి చికిత్స పొందారు. కొన్ని గంటల తర్వాత ఆగిపోయిన గేమ్ మళ్లీ ప్రారంభం అవుతుంది. ఆ సమయంలో విక్కీ, అయేషా ఎలా విచక్షణ కోల్పోయి కారం పొడి చల్లారో ఆ వీడియోను టీవీలో బిగ్ బాస్ చూపిస్తాడు. అప్పుడు బిగ్ బాస్ గ్రూప్-A వారికి ఒక ఆఫర్ ఇస్తాడు.. మీరు కూడా ఇలాగే కారం పొడి కొట్టి గేమ్ అడుతారా..? లేదా గ్రూప్ -B వారిని డైరెక్ట్‌గా నామినేట్ చేస్తారా..? అని అడుగుతాడు..
అప్పుడు గ్రూప్ ఏ వారు తాము ఈ గేమ్ ఆడలేమని చెప్పి గ్రూప్ బీ వారిని డైరెక్ట్‌గా నామినేట్ చేయమని బిగ్ బాస్‌ను కోరుతారు. దీంతో అంకిత, ఇషా, విక్కీ, ఆయేషా ఈ వారం నామినేషన్ లిస్ట్‌లో ఉన్నారు. విచక్షణ కోల్పోయి గేమ్ ఆడిన ఆయేషా, విక్కీ పట్ల నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇలాంటి చర్య జరుగుతుంటే ఆపాల్సింది పోయి గేమ్‌ను కొనసాగించడం ఏంటి..? అని బిగ్ బాస్ టీమ్ పట్ల కూడా వారు ఫైర్ అవుతున్నారు. ఈ శనివారంలో హౌస్ట్ సల్మాన్ ఖాన్ ఈ అంశంపై ఎలా రియాక్ట్ అవుతాడో చూడాల్సి ఉంది.
It was a tough one, uff! Thank you fam for the support and wishes 🙏💖 #MannaraChopra #BB #BB17 #Mannara #BiggBoss #biggBoss17 pic.twitter.com/rEn6PGdJ1B
— Mannara Chopra (@memannara) January 17, 2024
#BiggBoss really wanted to show how much torture this Sherni #MannaraChopra went through compared to the boys #AbhishekKumar, #MunawarFaruqui & #ArunMashettey. #BB17 #BiggBoss17 #MunAra #MKJW pic.twitter.com/M6MjmTGOAh
— dw🍼🍼 (@doodhwaali) January 17, 2024
View this post on Instagram
A post shared by ColorsTV (@colorstv)