నాట్ ఏ గ్లామ్ డాల్!
ఎంట్రీ ఫిల్మ్ ‘జిద్’ రిలీజ్‌కు ముందే క్రేజీ పోస్టర్లతో పిచ్చెక్కిస్తున్న ప్రియాంకచోప్రా కజిన్ మనారా కొత్తగా మాట్లాడుతోంది. ఇండస్ట్రీలోకి తానొచ్చింది నటించడానికని... అందాలు ఆరబోసే గ్లామర్ గాల్‌గానో...షో స్టాపర్‌గానే కాలక్షేపం చేయడానికి కాదని అంటోంది సెక్సీ సుందరి. ‘తొలి సినిమా అంటే అంచనాలు బాగా ఉంటాయి. కానీ... నాకలాంటివేవీ లేవు. చిత్రం ఫస్ట్ లుక్‌కు వస్తున్న రెస్పాన్స్ మాత్రం ఎంతో ఆనందాన్నిస్తోంది’ అంటూ మురిసిపోతోంది మనారా. అంతా బానే ఉంది గానీ.. జిద్ టీజర్‌లో అమ్మడు చేసిందేమిటో మరి అంటూ బీటౌన్ జనాలు గుసగుసలాడుతున్నారు.