mantech singh
-
‘ఆయనను ఎప్పుడూ అగౌరవపరచలేదు’
న్యూఢిల్లీ: దోషులుగా తేలిన చట్టసభల సభ్యులకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో విభేదిస్తూ నాటి యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం విషయం తెలిసిందే. అయితే ఆనాటి సంఘటన మాజీ ప్రధాని మన్మోహన్‌కు ఇబ్బందికర పరిస్థితిని తీసువచ్చిందని మాజీ ప్రణాళికా సంఘం అధ్యక్షుడు అహ్లూవాలియా ఇటీవల వెల్లడించారు. ఈ విషయంపై కాంగ్రెస్ ముఖ్య ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా స్పందించారు. 2013 నాటి ఆర్డినెన్స్ సమయంలో మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, రాహుల్ గాంధీకి మధ్య ఏం జరిగిందో తెలియదు.. గానీ, మన్మోహన్‌ను.. రాహుల్ గాంధీ ఒక మార్గదర్శి, గురువుగా భావించేవారని తెలిపారు. కాంగ్రెస్‌పార్టీ కూడా ఏనాడు మన్మోహన్ సింగ్‌ను అగౌరవపరచలేదని అయన స్పష్టం చేశారు. (ప్రశాంత్‌కిశోర్‌కు జడ్ కేటగిరీ భద్రత !) కాగా, అన్ని పార్టీలు దోషులుగా తేలినవారిని చట్టసభల్లోకి అనుమతించాలని చేసే చట్టానికి ఆమోదం కోసం ప్రయత్నిస్తున్న సమయంలో రాజకీయాలను శుభ్రపరిచి.. పార్టీ స్థాయిని పెంచే నాయుకుడిగా రాహుల్ ప్రవర్తించారని సుర్జేవాలా తెలిపారు. ‘ఆర్డినెన్స్ కాగితాల్ని చింపడం సమస్య కాదు. స్వచ్ఛమైన రాజకీయాల్లో నేరస్తులు ఉండాలా.. వద్దా.. అనేది సమస్య’ అని ఆయన అన్నారు. ఈ ఘటన తర్వాత సుప్రీంకోర్టు ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు వారిపై ఉన్న కేసులను బహిరంగపరచాలని అన్నిపార్టీలకు ఆదేశాలు జారీ చేసిందని సుర్జేవాలా గుర్తు చేశారు. -
సీమాంధ్రకు హామీలను అమలు చేయండి
ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షునికి వెంకయ్య విజ్ఞప్తి సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లులోని 13వ షెడ్యూల్లోని అంశాలపై ఇచ్చిన హామీల అమలు ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని కేంద్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లువాలియాకు బీజేపీ అగ్రనేత ఎం.వెంకయ్యనాయుడు విజ్ఞప్తి చేశారు. ప్రధాని ఇచ్చిన హామీలను ప్రణాళికా సంఘం, కేబినెట్ ఆమోదించాలని, ఈ ప్రక్రియంతా ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే జరగాలని కోరారు. ఈ మేరకు రాజ్యసభలో 20వ తేదీన సీమాంధ్రకు ప్రధాని ఇచ్చిన హామీల పత్రాన్ని జతపరుస్తూ వినతి పత్రాన్ని అందచేశారు. బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్‌తో కలిసి వెంకయ్య నాయుడు గురువారం మాంటెక్ సింగ్ అహ్లువాలియాను కలిసి హామీల అమలుపై చర్చించారు. అనంతరం తన నివాసంలో వెంకయ్య మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు, సీమాంధ్రకు ప్రత్యేక రాష్ట్ర హోదా, వెనకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్యాకేజీ, ఇతర ప్రస్తావిత ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లడానికి ప్రణాళిక సంఘం, కేబినెట్ ఆమోదం తీసుకోడానికి తక్షణమే చర్యలు చేపట్టాలని కోరామన్నారు. ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామని, వివిధ విభాగాల నుంచి సమాచారాన్ని తెప్పిస్తున్నట్టు అహ్లువాలియా చెప్పారన్నారు. పనులన్నీ సూత్రప్రాయంగా ఆమోదిస్తే మా ప్రభుత్వం వచ్చాక మందుకు తీసుకెళ్తామని తెలిపారు. ఇంకా వెంకయ్య ఏమన్నారంటే.. ఏపీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్ల ఆగ్రహంతో ఉన్నారు. సీమాంధ్రలో పది, పదిహేనేళ్ల పాటు కాంగ్రెస్ మొహం చూపించే పరిస్థితి లేదు. జన్మలో కాంగ్రెస్‌ను క్షమించరు. సీమాంధ్రలో జనం బాధ ఆరలేదు. అప్పుడే విశాఖ, తిరుపతి, కర్నూలు.. ఇలా రాజధాని కోసం సంతకాల సేకరణ మొదలు పెట్టారు. దీన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. సోనియా వల్లే ప్రత్యేక హోదా అని జైరాం అంటారు. సోనియా ఇవ్వదలుచుకుంటే లోక్‌సభలో బిల్లు పెట్టినప్పుడు రాహుల్, సోనియా, ప్రధాని సభకు ఎందుకు రాలేదు? సభలో చిర్చించి ఉంటే ప్రజలు నమ్మేవారు. -
ద్వితీయార్ధం బాగుంటుంది
హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో భారత ఆర్థిక రంగం మంచి పనితీరును ప్రదర్శిస్తుందన్న విశ్వాసాన్ని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా వ్యక్తం చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2014-15) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 6 శాతం పైనే ఉంటుందని కూడా ఆయన అంచనావేశారు. అయితే కొత్త ప్రభుత్వ విధానాలు ఇందుకు దోహదపడాల్సి ఉంటుందని వివరించారు. ఐదవ ఐడియా ఛాలెంజ్ బూట్ క్యాంప్‌లో (నవంబర్ 25వ తేదీ నుంచి 30వ తేదీ వరకూ) భాగంగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) ఇక్కడ నిర్వహించిన ఒక కార్యక్రమంలో బుధవారం మాంటెక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన దేశ ఆర్థిక వ్యవస్థ గురించి వివిధ అంశాలపై మాట్లాడారు. ఆర్థిక వ్యవస్థలో పటిష్ట రికవరీ ఇంకా చోటుచేసుకోలేదన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అయితే వృద్ధి రేటు ప్రస్తుత స్థాయికన్నా ఇంకా పడిపోదని మాత్రం భావిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 5శాతం మించబోదని పలు అంచనాలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. కాగా క్యాపిటల్ ఇన్‌ఫ్లోస్ మినహా దేశంలోకి వచ్చీ-బయటకు ప్రవహించే విదేశీ మారకద్రవ్య విలువ వ్యత్యాసానికి సంబంధించిన కరెంట్ అకౌంట్ లోటు (సీఏడీ) 2013-14 స్థూల దేశీయోత్పత్తిలో 2.5 శాతం నుంచి 2.7 శాతం శ్రేణిలో ఉంటుందని మాంటెక్ పేర్కొన్నారు. వ్యవస్థ మారాలి... స్పెక్ట్రమ్, బొగ్గు క్షేత్రాల కేటాయింపులపై వస్తున్న ఆరోపణల గురించి మాంటెక్ మాట్లాడుతూ, వ్యవస్థలో ఉన్న ఇబ్బందులే దీనికి కారణమన్నారు. ఈ తరహా వ్యవస్థ మార్పు అవసరమని ఉద్ఘాటించారు. ఆయా ఆరోపణలకు సంబంధించి ప్రభుత్వం పారదర్శకతను పాటిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తంచేశారు. విచారణనూ అదే స్ఫూర్తితో ఎదుర్కొంటుందని అభిప్రాయపడ్డారు. దేశం మౌలిక రంగం అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందని అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వృద్ధి మందగమనంలోకి జారదని పేర్కొన్నారు.