స్వతంత్ర వీరులు
సిరిసిల్ల: జాతీయ, రాష్ట్ర రాజకీయాల్లో ఉమ్మడి కరింనగర్ జిల్లాది ప్రత్యేక స్థానం. దేశం యావత్తు గర్వించదగిన నేతలను కరీంనగర్ జిల్లా అందించింది. 1952 నుంచి ఇప్పటివరకు 14 సార్లు ఎన్నికలు జరగ్గా, ఇపుడు మరోసారి 2018 ఎన్నికలు తెరపైకి వచ్చాయి. ప్రధాన పార్టీల పక్షాన టికెట్లు ఆశించి భంగ పడిన నేతలు... టక్కెట్ రాని అభ్యర్థులు రెబల్‌గా పోటీ చేయడం పరిపాటి. ఇండిపెండెంట్‌గా పోటీ చేసి విజయం సాధించడమూ విశేషం.ప్రజాక్షేత్రంలో జనబలంతో అత్యధిక ఓట్లు సాధించిన వారూ ఉన్నారు. రాజకీయంగా చైతన్యమున్న ఉమ్మడి కరీంగర్ జిల్లా లో 66 ఏళ్లలో 18 మంది స్వతంత్ర అభ్వర్థులు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు.
తిరుగుబాటు..గెలుపు బాట..
ఎన్నికల్లో పార్టీ టిక్కెట్లు ఆశించే నేతలు చివరకి టిక్కెట్ రాకపోవడంతో తిరుగుబాటు ప్రకటించి ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. ప్రస్తుత తరుణంలో ఎన్నికలు ఎంతో ఖరీదయ్యాయి. కానీ పార్టీల టికెట్‌తో సంబంధం లేకుండా అనేక మంది స్యతంత్రులుగా విజయకేతంఎగురవేశారు. రెబల్‌గా పోటీ చేసిన సందర్బాల్లో ఆ పార్టీ నుంచి అభ్యర్థులను సస్పెండ్ చేయడం పరిపాటి. పోటీ చేసిన వారు విజయం సాధించిన వారు తర్వాత ఏదో ఒక పార్టీ పంచన చేరడం సహజం. తిరుగుబాటు అభ్యర్థులు విజేతలు అయిన సందర్బాల్లోనూ ఆయా పార్టీలు మళ్లీ పార్టీలోకి తిసుకున్నాయి.
సత్తా చాటిన స్వతంత్రులు..
1952లో మేడారం నుంచి ఎం. రాంగోపాల్రరెడ్డి, మేట్పల్లి నుంచి గంగుల భూమయ్య ఇండిపెండెంట్లుగా విజయం సాధించారు. 1957లో హుజూరాబాద్ నుంచి పి. నర్సింగరావు, జి.రాములు, బుగ్గారం నుంచి మోహన్‌రెడ్డి గెలుపొందారు. 1962లో కమలాపూర్ నుంచి కేవి నారాయణరెడ్డి, జగిత్యాల నుంచి ఎం. ధర్మారావు. విజయం సాధించారు. 1967లో జగిత్యాల నుంచి కాసుగంటి లక్ష్మీనర్సింహవు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదే ఏడాది నేరేళ్ల నుంచి గొట్టె భూపతి, 1972లో రెండోసారి గొట్టె భూపతి ఇండిపెండెంట్‌గానే గెలిచారు. 1972లో మేట్పల్లి నుంచి సీహెచ్ ఎ. నారాయణరెడ్డి, కమలాపూర్ నుంచి పి.జనార్థన్‌రెడ్డి, పెద్దపల్లి నుంచి మల్లారెడ్డి ఎన్నికయ్యారు 1989లో కరీంనగర్ నుంచి వి.జగపతిరావు, హుజూరాబాద్ నుంచి కేతిరి సాయిరెడ్డి.
బుగ్గారం నుంచి జె.రత్నాకర్‌రావు ఇండిపెండెంట్‌గా విజయ కేతనం ఎగురవేశారు. 1989లో సిరిసిల్లలో ఇండిపెండెంట్ ఆభ్యర్థిగా బరిలో దిగిన నెల్లూరుకు చెందిన ఎన్వీ కృష్ణయ్య విజయం సాధించారు. ఆయనకు జనశక్తి నక్సలైట్లు అండగా ఉన్నారు. జనశక్తి బ్యానర్‌పై పోటీచేసే అవకాశం లేకపోవడంతో జనశక్తి బలపరిచిన వ్యక్తిగా ఎన్.వి.కృష్ణయ్య సిరిసిల్లలో గెలిచారు. 1994లో టీడీపీ టికెట్ రాకపోవడంతో మేడారం నుంచి ఇండిపెండెంట్‌గా బరిలొ దిగిన మాలంమల్లేశం ఎన్నికయ్యి విజయం సాధించారు.2009లో రామగుండం నిమోజకవర్గం ఏర్పడిన తరువాత సోమారపు సత్యనారాయణ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు.తరువాత తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో టీఆర్ఎస్లో చేరి 2014 తరువాత కేబినేట్లో చోటు సంపాందించారు.
ఉమ్మడి జిల్లాలో స్వతంత్రలుగా సత్తా చాటినవారు ఏదో పార్టీలో చేరి తరువాత రాజకీయాల్లో రాణించారు.1952 ఎన్నికల్లో తొలిసారిగా మేడారం నియోజకవర్గంలో ఎం. రాంగోపాల్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించగా.. చివరిసారిగా 2009లో రామగుండం నియోజకవర్గంలో సోమారపు సత్యనారాయణ ఇండిపెండెంట్‌గా విజయం సాధించడం విశేషం. 1994 తరువాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలలో ఇక ఇండిపెండెంట్లు ఎవరూ ఎన్నికల్లో విజయం సాధించలేదు. 1967,1972లోనూ రెండు సార్లు గొట్టె భూపతి నేరేళ్లలో ఇండిపెండెంట్‌గా విజయం సాధించడం విశేషం. ఉమ్మడి కరీంనర్ జిల్లా చరిత్రలో రెండు సార్లు స్వతంత్రుడిగా విజయం సాధించిన వ్వక్తి గొట్టె భూపతి ఒక్కరే ఉన్నారు. బుగ్గారం నియోజకవర్గంలో మూడు పర్వాయాలు స్వతంత్ర అభ్యర్థులు గేలిచారు. జిల్లాలో 18మంది స్వతంత్రులు ఎమ్మేల్యే ఎన్నికల్లో విజయం సాధించడం విశేషం.
మంథని: 1983లో జరిగిన ఆసెంబ్లి ఎన్నికల ప్రచారంలో మంథని జూనియర్ కళాశాల మైదానంలో సంజయ్ విచార్ మంచ్ అభ్యర్ధి చందుపట్ల రాజిరెడ్డి మద్దతుగా టీడీపీ వ్వవస్తాపకుడు నందమూరి తారకరామారావు ప్రచారం నిర్వహించారు. వేదికపై విచార్‌మంచ్ జాతీయ పార్టీ అధ్యక్షురాలు మేనక గాంధీ, అభ్యర్థి చందుపట్ల రాజిరెడ్డి,దిగవంత మాజీ ఎమ్మెల్యే గీట్ల జనార్థన్ రెడ్డి ఉన్నారు.