Map of India
-
చెట్ల మధ్యలో మ్యాప్ ; అద్భుతం కాదు ఫేక్
సాక్షి, హైదరాబాద్ : హైవేకి ఇరువైపులా దట్టమైన చెట్లు.. కాస్తదూరంలో ఆ చెట్లు కలిసినట్లుగా కనిపించే చోట చక్కటి దృశ్యం. అచ్చుగుద్దినట్లు ఇండియా మ్యాప్ కనిపిస్తుంది! ఇది మామూలు విషయం కాదు.. ‘దైవిక అద్భుతం’ ప్రచారం మొదలైంది. చాలా కాలంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ ఫొటోకు సంబంధించి కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఫొటోని రోడ్డు..మధ్యప్రదేశ్‌లోని భోపాల్-ఇండోర్ హైవేగా గుర్తించారు. చిత్రీకరించిన దృశ్యాన్ని ఇండియా మ్యాప్ మాదిరిగా కనిపించేలా ఫొటోషాప్‌లో మార్పులు చేశారని జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఇలాంటి ఫేక్ ఫొటోలు ఎన్నో సోషల్‌మీడియాలో చక్కర్లుకొ డుతున్నాయని గుర్తుచేశాయి. మొత్తానికి ఈ ఫొటో ఫేక్ అయినంత మాత్రాన ఇండియా మ్యాప్ పట్ల మనకున్న గౌరవం, దేశభక్తి ఏమాత్రం తగ్గవన్నది నిజం. -
పాఠంలో పాత మ్యాపే!
తొమ్మిదో తరగతి పాఠ్యపుస్తకంలో తెలంగాణ లేకుండానే దేశ పటం సాక్షి, నిజామాబాద్: తెలంగాణ ఆవిర్భవించి మూడేళ్లు దాటినా ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించడంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు నిర్లక్ష్యం చేయడం విమర్శలకు దారి తీస్తోంది. తొమ్మిదో తరగతి సెంట్రల్ సిలబస్ సోషల్ సైన్స్ పుస్తకంలోని భారతదేశ పటంలో తెలంగాణను రాష్ట్రంగా ముద్రించలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్నే ముద్రించారు. తొమ్మిదో తరగతి కాంటెంపరరీ ఇండియా–1 (జియోగ్రఫీ) పుస్తకంలో ఐదో పేజీలో ఇండియా అండ్ ఎడ్జేసేంట్ కంట్రీస్ పటం ఉంది. ఇందులో తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా చూపలేదు. ఎన్సీఈఆర్టీ 2006లో మొదటిసారిగా ఈ పుస్తకాన్ని ముద్రించింది. 2016లో పదోసారి రీప్రింట్ సమయంలో పుస్తకంలోని పటాల్లో తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఎన్సీఈఆర్టీ చూపకపోవడం పట్ల విద్యావేత్తలు పెదవి విరుస్తున్నారు. -
భారత పటంపై జోక్యం సరికాదు
న్యూఢిల్లీ: భారతపటం విషయంలో పాక్ జోక్యం సరికాదని భారత్ మండిపడింది. భారత పటాన్ని తప్పుగా చూపేవారికి భారీ జరిమానా, జైలు శిక్ష విధించేందుకు ఉద్దేశించిన బిల్లు విషయంలో ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోవాలని మంగళవారం పాక్ విజ్ఞప్తి చేసింది. దీన్ని భారత్ తప్పుబట్టింది. భారత విదేశాంగ ప్రతినిధి వికాస్ స్వరూప్మాట్లాడుతూ ప్రతిపాదిత బిల్లు పూర్తిగా భారత చట్టాలకు సంబంధించిన అంతర్గత అంశమన్నారు. పాకిస్తాన్‌కు, ఇతరులకు దీనిపై మాట్లాడటానికి అధికారం లేదన్నారు. కాగా, ఈ బిల్లుపై పాక్ ఆందోళన వ్యక్తం చేసింది. భారత్.అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడం ఆపాలని ఐరాసను కోరింది. కశ్మీర్‌ను భారత్‌లో భాగంగా చూపొద్దని పేర్కొంది. -
అచ్చం భారతదేశ చిత్రం!
చూడడానికి అచ్చం భారతదేశం పటంలా ఉన్న ఈ దృశ్యం.. ఏ చిత్రకారుడు గీసిందో కాదు. బురదగుంటలో సహజసిద్ధంగా ఏర్పడింది. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం శాపల్లి గ్రామంలో శ్రీ కామలాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఎదురుగా ఉన్న బురద గుంట ఉంది. అందులో నిలిచిన నీరు ఇలా భారతదేశ చిత్రపటం ఆకారంలో కనిపిస్తోంది. ఆలయానికి వచ్చే భక్తులు, స్థానికులు ఈ దృశ్యాన్ని ఆసక్తిగా తిలకిస్తున్నారు. -నార్కట్‌పల్లి