breaking news
Marble floors
-
మెరిసేవన్నీ ఇటాలియన్ మార్బుల్స్ కావు..
అందమైన సొంతింటి కల.. కల కాకూడదంటే ఇంటి నిర్మాణ సమయంలో మనం వేసే అడుగులు కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. ప్రధానంగా ఇంటి అందాన్ని తళుక్కుమనిపించే ఇటాలియన్ మార్బుల్స్ విషయంలో తప్పటడుగులు వేసి నిట్టూర్చే కన్నా దాని గురించి పూర్తిగా తెలుసుకుంటే మీ అందమైన ఇల్లు జిగేల్మంటూ మెరిసిపోవడం ఖాయం. – శంషాబాద్ విదేశీ మార్బుల్ దిగుమతిలో ప్రథమస్థానం ఇటలీ నుంచి వచ్చే ఇటాలియన్ మార్బుల్దే.. ప్రస్తుతం మార్కెట్లో అనేక దేశాల మార్బుల్స్‌ను ఇటాలియన్ పేరుతో విక్రయిస్తున్నారు. అందుకే ఇటాలియన్లో ఉన్న ప్రధాన రకాల గుర్తించి తెలుసుకోవాలి. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్నవి సత్వారియో ఇందులో(తెలుపు, గ్రే), కరారా, వెనటినో, గ్రేవిలియం వీటితో పాటు పాత రకాలైన డైనా, పర్లాటో, బోటోచినోతో పాటు ఔట్‌సైడ్ ఎలివేషన్‌కు మాత్రమే ఉపయోగపడే ట్రావెటైన్ రకాలున్నాయి. నాణ్యత గుర్తించడం ఎలా..? ఇంటికి కచ్చితంగా ప్రీమియం బ్రాండ్ ఎంచుకోవడమే ఉత్తమం.. ప్రీమియం బ్రాండ్‌లో కొనుగోలు చేసే ముందు తీసుకునే మార్బుల్ కచ్చితంగా స్క్వార్ ఆకారంలోనే ఉండాలి. అంతేకాకుండా 18ఎంఎం–20ఎంఎం మందం ఉండాలి. రాయికి నాలుగు వైపులా వ్యాకూమ్ చేసిన దాన్ని ఎంచుకోవాలి. రాయి ప్రాసెస్‌లో రెగ్జిన్‌తో చేసిందా లేదా అపాక్సితో చేసిందా అనే విషయం కూడా తెలుసుకోవాలి. సాఫ్ట్ రాయి కంటే హార్డ్ ఉన్న రాయినే ఎంచుకోవాలి. రాయిలో కెమికల్ ఫిల్లింగ్ ఉంటే కచ్చితంగా తక్కువ క్వాలిటీదిగా గుర్తించాలి. ఇటాలియన్ మార్బుల్స్‌లో కనిష్టంగా రూ.300 ఫీట్ మొదలుకొని గరిష్టంగా రూ.5 వేల వరకు హైదరాబాద్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. పోటీగా ఉన్నవి ఇవే.. మార్కెట్లో ఇటాలియన్తో సమానంగా స్పెయిన్ మార్బుల్స్ పోటీలో ఉన్నాయి. ఇందులో బెల్లాచినో, హర్మానివైట్, గ్రేకార్నికో, స్పానిషన్బెజ్, స్పానిష్ బ్రౌన్, పోర్చుగల్‌కు చెందిన మెకలాంజిలో మార్బుల్స్ అధికంగా విక్రయాలు జరుగుతున్నాయి. వీటితో పాటు గ్రీస్‌కు చెందిన ఒలకాస్, గోర్టెన్ ఇన్స్పైడర్, థాసోస్వైట్ కూడా ఉన్నాయి. వియత్నాంకు చెందిన వైట్ మార్బుల్స్ కూడా ప్రత్యేకంగా పూజ గదులకు ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇక బ్రెజిల్‌కు చెందిన క్వార్టజైట్ రాళ్లు టేబుల్ టాప్, కిచెన్, క్లాడింగ్, ఎలివేషన్ ఎక్కువగా వినియోగంలో ఉన్నాయి. వీటితో పాటు మార్కెట్లో ఇరాన్, ఇరాక్, తునేషియా సంబంధిత దేశాల మార్బుల్స్ కూడా ఉన్నాయి.చైనా.. టర్కీ.. చైనా వివిధ దేశాల మార్బుల్స్‌ను దిగుమతి చేసుకుని తిరిగి ప్రాసెస్ చేసి విక్రయించే రకాలు కూడా ప్రస్తుతం మార్కెట్లో ఉన్నాయి. ఇందులో ప్రీమియంతో పాటు మీడియం క్వాలిటీ రకాలు కూడా ఉన్నాయి. టర్కీ నుంచి వచ్చే మార్బుల్స్ కొంత తక్కువ నాణ్యతతో ఉంటున్నాయి. క్రాక్ ఫిల్లింగ్, అధికంగా కెమికల్ ప్రాసెస్ చేసిన మార్బుల్స్ ఉంటాయి. వీటి రీ పాలిష్ మెయింటెనెన్స్ ఎక్కువగా ఉంటుంది. సో.. సొంతింటిలో మీ అడుగులు అందమైన మార్బుల్స్‌పై వేసే ముందు ఈ జాగ్రత్తలు తీసుకుంటే బెటర్.. ఆల్ ది బెస్ట్..! -
తాజ్‌మహల్‌లో తెలంగాణ రాళ్లు!
సాక్షి, హైదరాబాద్ : పాలరాతిని పేర్చి అద్భుత కట్టడంగా తాజ్‌మహల్‌ను మొఘల్ వంశీయులు ఎలా సృష్టించారో నిగ్గు తేల్చేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎందరో నిపుణులు అధ్యయనాలు చేస్తున్నారు. అలా కాలిఫోరి్నయాలోని విఖ్యాత జెమోలాజికల్ లైబ్రరీ అండ్ రీసెర్చ్ సెంటర్ నుంచి రిటైర్డ్ లైబ్రేరియన్ డిర్లామ్, రీసెర్చ్ లైబ్రేరియన్ రోజర్స్, సంస్థ డైరెక్టర్ వెల్డన్లు కూడా నాలుగైదేళ్లలో విడతలవారీగా వచ్చి అధ్యయనం చేపట్టారు. పైకి పాలరాతి నిర్మాణమే అయినప్పటికీ తాజ్ నిర్మాణంలో వజ్రాలు, వైఢూర్యాలు, రత్నాలు, ముత్యాలు, స్ఫటికాలు, పచ్చలు.. ఇవి కూడా పొందికగా ఒదిగిపోయాయని తెలిసి వారు అధ్యయనానికి వచ్చారు. అలా జరిగిన వారి అధ్యయనం ద్వారానే తాజ్‌మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలు పనిలోపనిగా మన దేవరకొండ, మహబూబ్‌నగర్ ప్రాంతం నుంచి వచ్చిన రాళ్లనూ మోశారని వెలుగు చూసింది. పర్చిన్కారీ పద్ధతిలో.. పాలరాతిపై వివిధ ఆకృతులతో కూడిన నగిషిలను విడిగా పేర్చినట్లుగా కాకుండా పాలరాతిలో అంతర్భాగంగా ఉండేలా చేయాలని అప్పట్లో నిర్ణయించారు. ఇందుకు పర్చిన్‌కారి పద్ధతిని అనుసరించారు. ఇటలీ, గ్రీస్‌లలో పుటిన పియెట్రా డ్యురాకు కాస్త దగ్గరి పోలికుండే ఈ పర్చిన్‌కారి కళ 16వ శతాబ్దంలో భారత్‌లో అభివృద్ధి చెందింది. ముందుగా పాలరాతిపై ఆ ఆకృతిని గీసి దాని ప్రకారం రాయిని కట్ చేశారు. అదే ఆకృతిలో రంగురాళ్లును అరగదీసి సానబెట్టి మెరుపు తెప్పించాక, పాలరాయిని కట్ చేసిన భాగంలో పొదిగారు. దీంతో ఆ డిజైన్ రాయిలో భాగమనే భ్రమ కలిగిస్తోంది. అలా తాజ్‌మహల్ కట్టడంలో పాలరాతిలో ఇలాంటి ఎన్నో ఆకృతులు ఒదిగిపోయాయి. వాటిల్లో మన తెలంగాణ ప్రాంత రాళ్లు కూడా చిరస్థాయిగా మిగిలిపోయాయి. ఇంకొన్ని రాళ్లను పియెట్రా డ్యురా పద్ధతిలో పాలరాతిపై ప్రత్యేక జిగురుతో అతికించి కళాత్మకంగా ఆకృతులద్దారు. పలుగురాయిలో భాగమే.. తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో పలుగురాళ్లు కనిపిస్తాయి. అలాంటి రాళ్లలో కొన్ని క్రిస్టల్ (పారదర్శకంగా) లక్షణాలు కలిగి ఉంటాయి. వాటినే క్రిస్టల్ క్వార్ట్జ్గా పేర్కొంటారు. అవి విలువైన స్ఫటికంలో భాగమే. వాటిని నగల నగిషిల్లో వినియోగిస్తారు.మన రాళ్లే ఎందుకు?.. తాజ్ కట్టడం గోడలపై పాలరాయి పరుచుకుంది. కానీ ప్రతి నిర్మాణంలోనూ కొత్తదనాన్ని కోరుకున్న మొఘల్ వంశీయులు ఆ పాలరాతి మీదుగా పూలతో కూడిన లతలు అల్లుకున్న అనుభూతిని కలిగించాలనుకున్నారు. నగల్లో వాడే వజ్రాలు, పచ్చలు, కెంపులు.. ఇలా అన్నింటినీ ఈ నగిషిలకు వాడాలని నిర్ణయించి వాటికి ప్రపంచంలో ఏయే ప్రాంతాలు ప్రసిద్ధో గుర్తించారు. ఆయా దేశాలను గాలించి వాటిల్లో మేలిమి వాటిని సేకరించి తెచ్చి తాజ్‌మహల్ నిర్మాణంలో వాడారు. అలా వాడే విలువైన రాళ్ల జాబితాలో క్రిస్టల్ క్వార్ట్జ్ (ఓ రకమైన స్పటికం) కూడా ఒకటి. వాటికి ఏ ప్రాంతాలు ప్రసిద్ధిగాంచాయో గాలిస్తే.. గోల్కొండ మైన్ అనే సమాధానం వచ్చిoది. కృష్ణా నదీ తీరాన్ని ఆసరా చేసుకొని గోల్కొండ గనులు విస్తరించాయి. ఇది వజ్రాలతోపాటు క్రిస్టల్ క్వార్ట్ జ్ కూడా ప్రసిద్ధే. అయితే ఇది ఆ గనుల ఆమూలాగ్రంలో లభించదు. మేలిమి రాళ్లు ప్రస్తుత దేవరకొండ, మహబూబ్నగర్లలోనే దొరికేవి. దీంతో ఈ ప్రాంతం నుంచి క్రిస్టల్ క్వార్ట్జ్ రాళ్లను తెప్పించారన్నది ఇప్పుడు వెలుగుచూస్తున్న విషయం. నాణ్యత ఆధారంగా చూస్తే ఈ ప్రాంతానివే.. తాజ్మహల్లోని రాళ్లలో మేలిమి స్ఫటికంలా ఉన్నవి లభించే ప్రాంతాలు దేవరకొండ, మహబూబ్‌నగర్ పరిసరాలే. మేలిమి రాళ్లను సేకరించిన షాజహాన్.. ఈ రాళ్ల విషయంలోనూ నాణ్యమైనవే గుర్తించారు. అప్పటి వర్తకంలో కీలకంగా ఉన్న ప్రాంతాల నుంచే సేకరించినందున అవి ఈ ప్రాంతాలకు చెందినవిగానే పరిగణించాల్సి ఉంటుంది. – చకిలం వేణుగోపాలరావు, జీఎస్ఐ రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ -
గచ్చు అందం రెట్టింపు..!
సాక్షి, హైదరాబాద్: గ్రానైట్, మార్బుల్ కొత్తలో ఇట్టే ఆకట్టుకుంటాయి. నిర్వహణలో శ్రద్ధ లేకపోతే గచ్చుపై మురికి పేరుకుపోయి వికారంగా కనిపిస్తాయి. ఇలాంటి సమస్యలు వద్దనుకుంటే నిర్వహణలో నిర్లక్ష్యం వహించకూడదు. మల్లెకన్నా తెల్లనిది మార్చుల్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంత ప్రత్యేకత గత పాలరాతిని ఎంత ఇష్టంగా ఎంచుకుంటామో.. శుభ్రపరిచే విషయంలోనూ అంతే ఇష్టాన్ని కనబర్చాలి. ఠి ఫ్లోర్ మీద పడిన దుమ్ము, ధూళిని ఎప్పుడూ మెత్తని గుడ్డతో తుడవాలి. నీళ్లతో కడగాలనిపిస్తే గోరువెచ్చని నీటిని వాడండి. ఈ నీటిలో తక్కువ శక్తిగల డిటర్జెంట్ పౌడర్లను వాడాలి. ఎట్టి పరిస్థితుల్లోను ఎక్కువ వేడి గల నీటిని వినియోగించవద్దు. మరకల్ని తొలగించేందుకు పదునైన సాధనాలను వాడరాదు. ఠి నేలను కడిగాక మెత్తటి పేపర్ టవల్‌తో తుడిస్తే సరిపోతుంది. మార్కెట్లో నాణ్యమైన మార్బుల్ క్లీనర్లు దొరకుతున్నాయి. ధర తక్కువని నాసిరకం క్లీనర్లను వాడితే ఖరీదైన మార్బుల్ వెలవెలబోతుంది. ఠి మార్బుల్ కాంతులు వెలసిపోవద్దనుకుంటే కాఫీ, టీ వంటి ఇతరత్రా ద్రవ పదార్థాలను నేల మీద పడకుండా జాగ్రత్త పడితే మంచిది. నిత్యం మెరవాలంటే.. గట్టిదనానికి మారుపేరు గ్రానైట్. నిర్వహణ కూడా సులువే. ఈ ఫ్లోరింగ్ ఎప్పటికప్పుడు మెరిసిపోతూ ఉండాలంటే.. పాత్రలను తోమే డిటర్జెంట్ పౌడరును కలిపి గోరు వెచ్చని నీటితో ప్రతిరోజు కడిగి మెత్తటి బట్టతో తుడిస్తే గ్రానైట్ ఫ్లోర్ తళతళమెరుస్తుంది. ఠి వంట గదిలో కూరగాయలు, తదితరాలను కోసేందుకు గ్రానైట్ ఐల్యాండ్‌ను వాడొద్దు. అలాచేస్తే గీతలు పడి అసహ్యంగా కనిపిస్తుంది. ఠి గ్రానైట్‌ను కడిగే నీటిలో నాసిరకం డిటర్జెంట్ పౌడర్లను వాడొద్దు. అవి గ్రానైట్‌ను కాంతి విహీనం చేస్తాయి. ఠి మార్కెట్లో స్టోన్ పాలిష్ లభిస్తున్నాయి. వీటితో అప్పుడప్పుడు ఫ్లోర్‌ను పాలిష్ చేయించండి. -
ఈ గాలి.. ఈ నేల..
కాస్ట్లీ మార్బుల్ ఫ్లోర్లు.. ఆధునిక బాత్ టబ్బులు.. స్పాలు.. ఇలా ఎన్నో ఆధునిక సదుపాయాలున్న హోటళ్లను మీరు చూసుండొచ్చు. ఒక్కసారి ఇండోనేసియాలోని బాలీలో ఉన్న బాంబూ ఇండా హోటల్‌కు వెళ్లి చూడండి. అమ్మ ఒడిలో సేదదీరిన అనుభూతి కలుగుతుంది. పైగా.. ఈ హోటల్లోని ‘ష్రింప్’ గెస్ట్‌హౌస్‌కు వెళితే.. నదిపై నడిచినట్లు.. చేపలతో ముచ్చట్లాడిన ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే.. దీన్ని ఆయుంగ్ నదీ జలాలపైనే కట్టారు. బెస్తవారి గ్రామంలో ఉన్న ఫీలింగ్ కలగడానికి.. గదిలోనే తెడ్డు, వల వంటివీ ఉంటాయి. కెనడాకు చెందిన జాన్ హార్డీ దంపతులు ఇక్కడి పురాతన గృహాలను గెస్ట్‌హౌస్‌లుగా మార్చారు. ప్రకృతి ఒడిలో సేదదీరాలనుకునేవారికి ఈ గెస్ట్‌హౌస్‌లే కేరాఫ్ అడ్రస్‌లు. గదుల్లో కూడా దోమల మందుల్లాంటివి ఉండవు. తెరలే ఉంటాయి. చుట్టూ కొండలు, వరిచేలు, ఆయుంగ్ నది.. దగ్గర్లోనే హిందూ దేవాలయం.. చూస్తే వాహ్ అనకుండా ఉండలేం.. అతిథులు రూముల్లోకి వెళ్లాలంటే.. ఇలా రాళ్ల మీద నుంచే నడిచివెళ్లాలి. ఇందులో ఒక రోజు బస చేయడానికి గెస్ట్‌హౌస్ స్థాయిని బట్టి రూ.12 వేల నుంచి రూ.30 వేల వరకూ చెల్లించాల్సి ఉంటుంది.