marcket yard
-
‘మార్కెట్ యార్డ్లకు పూర్వ వైభవం తెస్తాం’
సాక్షి, గుంటూరు: రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. గుంటూరు మిర్చి యార్డు చైర్మన్గా చంద్రగిరి ఏసురత్నం ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆయన ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ.. ధరల స్థిరీకరణనిధి ఏర్పాటు చేసి.. రైతులను ఆదుకున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిది అని తెలిపారు. మార్కెటింగ్ యార్డ్లకు పూర్వ వైభవం తెస్తామని మోపిదేవి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నేడు మంచి రోజులు వచ్చాయని అన్నారు. అందరికీ చైర్మన్ పదవులు దక్కే అవకాశం కలిగిందని ఆమె పేర్కొన్నారు. మిర్చికి రికార్డుస్థాయిలో ధర దక్కుతోందని ఆమె గుర్తు చేశారు. క్వింటా రూ. 21వేలు పలకడం జగన్ పుణ్యమే అని హోంమంత్రి సుచరిత పేర్కొన్నారు. మంత్రి శ్రీరంగనాధ్ రాజు మాట్లాడుతూ.. గతంలో అగ్రవర్ణాలకే మార్కెటింగ్ పదవులు దక్కేవి అని అన్నారు. జగన్ చేసిన బీసీ డిక్లరేషన్లో భాగంగా అన్ని వర్గాలకి ఇప్పుడు న్యాయం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకం అని శ్రీరంగనాధ్ రాజు అన్నారు. -
ఎమ్మిగనూరు మార్కెట్ యార్డులో ఆందోళన
ఎమ్మిగనూరు: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని మార్కెట్లో కొనుగోళ్లు నిలిచిపోవడంతో మార్కెట్ ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. కూలి ధరలు పెంచాలని కోరుతూ హమాలీలు ఆందోళనకు దిగడంతో మార్కెట్లో కొనుగోళ్లు నిలిచిపోయాయి. దీంతో మార్కెట్ లో పెద్ద ఎత్తున ధాన్యం నిలిచిపోయంది. తమ ధాన్యం అమ్ముకోవడానికి వచ్చిన రైతులు ఆగ్రహించి మార్కెట్ యార్డు ఎదుట రోడ్డుపై బైఠాయించారు. దీంతో వాహనాలు భారీ ఎత్తున నిలిచిపోయి ట్రాఫిక్ జాం ఏర్పడింది. -
మార్కెట్ యార్డు వద్ద రైతుల ఆందోళన
అనంతపురం: అనంతపురం జిల్లా మార్కెట్ యార్డు వద్ద రైతులు ఆందోళనకు దిగారు. విత్తనాల పంపిణీ ని ఈ నెల 14 కు అధికారులు వాయిదా వేశారు. వేరుశెనగ విత్తనాలు ఎందుకు సరఫరా చేయడం లేదని అధికారులను రైతులు నిలదీశారు. దీంతో రైతులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. విత్తనాలను వెంటనే పంపిణీ చేయాలని వారు ధర్నాకు దిగారు. విత్తనాల కోసం జిల్లాలోని పూడేరు, పుట్టపర్తి లో కూడా రైతులు ధర్నా చేపట్టారు.