Market Complex
-
‘కేటీఆర్ టీస్టాల్’ మూసివేత వివాదాస్పదం
సిరిసిల్ల టౌన్/హైదరాబాద్: సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ‘కేటీఆర్ టీస్టాల్’ను అధికారులు మూసివేయించడం చర్చనీయాంశంగా మారింది. ట్రేడ్‌లైసెన్స్ లేకపోవడంతోనే మూసివేయించామని అధికారులు పేర్కొంటుండగా.. కేటీఆర్ పేరుతో టీస్టాల్ నిర్వహిస్తుండటంతో అధికారులు ఉద్దేశపూర్వకంగా మూసివేయించారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. బుధవారం జిల్లా కేంద్రం మానేరుతీరంలోని మార్కెట్ కాంప్లెక్స్, బతుకమ్మఘాట్ పరిసర ప్రాంతాలను కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా పరిశీలించారు. మడేలేశ్వర ఆలయం ఎదుట రెండు మున్సిపల్ టేలాల్లో టీస్టాల్స్ ఉండగా.. అందులో ఒకటి కేటీఆర్ టీస్టాల్ పేరుతో బత్తుల శ్రీనివాస్ దంపతులు నడిపిస్తున్నారు. కలెక్టర్ పర్యటనలో భాగంగా ఆ టీస్టాల్స్‌కు అనుమతులున్నాయా? అంటూ ఆరా తీస్తూనే ఒకవేళ లేకపోతే మూసివేయాలని మున్సిపల్ అధికారులకు మౌఖికంగా ఆదేశాలిచ్చారు. విషయం తెలుసుకున్న శ్రీనివాస్ దంపతులు గుండెలు బాదుకుంటూ.. లైసెన్సు తీసుకోవాలని తమకు తెలియదని, అదేంటో చెబితే వెంటనే తీసుకుంటామని అధికారులను ప్రాధేయపడ్డారు. అయినా కలెక్టర్ ఆదేశించారని పేర్కొంటూ టీ స్టాల్ మూసివేయించారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు బొల్లి రామ్మోహన్, కత్తెర వరుణ్, దార్ల సందీప్, గెంట్యాల శ్రీనివాస్, సబ్బని హరీశ్ ఆందోళన చేపట్టారు. ప్రతీది గుర్తు పెట్టుకుంటున్నా.. ఎవర్నీ వదలను సిరిసిల్లలో జరిగిన ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ‘ఎక్స్’లో ఘాటుగా స్పందించారు. ‘చిరువ్యాపారిపై కలెక్టర్ అనుచిత ప్రతాపం చూపించారు. ప్రతీది గుర్తు పెట్టుకుంటున్నా.. ఎవర్నీ వదిలే ప్రసక్తే లేదు. ఇదే మాట మీద ఉంటానని మీకు మాట ఇస్తున్నా’అని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మేర కు టీ షాపు యజమాని బి.శ్రీనివాస్ మాట్లాడుతున్న వీడియోను షేర్ చేశారు. -
ఎక్కడో కన్నేసి... ఇక్కడ వదిలేసి!
సొంత ఆస్తులపై జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం భారీగా అద్దె బకాయిలు వసూలుపై శ్రద్ధ చూపని యంత్రాంగం సిటీబ్యూరో : తన ఖజానాను నింపుకొనేందుకు ఆస్తిపన్ను చెల్లింపుల్లో ఉల్లంఘనలు... నివాస గృహాల్లో కొనసాగుతున్న వాణిజ్య కార్యకలాపాలపై దృష్టి సారించిన జీహెచ్ఎంసీ తన ఎస్టేట్ విభాగంలోని దుకాణ సముదాయాలకు, మార్కెట్ కాంప్లెక్స్‌లకు రావాల్సిన అద్దె బకాయిలపై శ్రద్ధ చూపడ ం లేదు. ప్రజల నుంచి వివిధ రకాల పన్నులు, ట్రేడ్ లెసైన్సు ఫీజుల వసూలుకు ఎంతో శ్రద్ధ చూపుతున్నప్పటికీ... జీహెచ్ఎంసీకి చెందిన మార్కెట్, షాపింగ్ కాంప్లెక్స్‌లలోని మడిగెలు/ షాపులకు అద్దె రూపేణా రావాల్సిన మొత్తం ఏళ్ల తరబడి జమ కాకున్నా పట్టించుకోవడం లేదు. బహిరంగ మార్కెట్‌తో పోలిస్తే వీటి అద్దె తక్కువ. స్వల్ప మొత్తాన్ని సైతం చెల్లించకుండా దుకాణదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా పట్టించుకోవడం లేదు. 2012 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు 17 షాపింగ్ కాంప్లెక్స్‌లలోని 953 దుకాణాల నుంచి దాదాపు రూ.10.06 కోట్లు అద్దెగా రావాల్సి ఉండగా... కేవలం రూ.2.49 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. మిగతా రూ.7.57 కోట్లు బకాయిలు అలాగే ఉన్నాయి. 25 మార్కెట్లలోని 2310 మడిగెలకు 2012 ఏప్రిల్ నుంచి 2013 మార్చి వరకు రూ.2.99 కోట్లు రావాల్సి ఉండగా, రూ.65.37 లక్షలే వసూలయ్యాయి. మిగిలిన మొత్తం పెండింగ్‌లో ఉన్నాయి. ఈ రెండు కాంప్లెక్స్‌లకు సంబంధించిన రూ.10 కోట్లకు పైగా అద్దె బకాయిలు అలాగే ఉన్నాయి. ఇక 2013 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఎంత వసూలైందో... ఎన్ని బకాయిలు ఉన్నాయో కనీసం లెక్కలు లేవు. ఎంతలేదన్నా ఇవి మరో రూ.10 కోట్లకు పైనే ఉంటాయి. ఇతరుల ఆస్తుల నుంచి రావాల్సిన పన్నుపై శ్రద్ధ చూపుతున్న జీహెచ్ఎంసీ.. తన సొంత ఆస్తులపై రావాల్సిన అద్దెలను పట్టించుకోకపోవడం విడ్డూరం.