market recovery
-
ఫండమెంటల్స్ పరుగు పెట్టిస్తాయ్
ప్రస్తుతం స్టాక్ మార్కెట్లను లిక్విడిటీ లీడ్ చేస్తున్నట్లు సుందరం మ్యూచువల్ ఫండ్(ఎంఎఫ్) సీఐవో ఎస్ కృష్ణకుమార్ పేర్కొంటున్నారు. అయితే రానున్న 6-12 నెలల కాలంలో ఫండమెంటల్స్ వెలుగులోకిరానున్నట్లు అంచనా వేస్తున్నారు. తద్వారా భవిష్యత్‌లో లిక్విడిటీ ఆవిరైనప్పటికీ మార్కెట్లను ఫండమెంటల్స్ పరుగు పెట్టిస్తాయని చెబుతున్నారు. మార్కెట్ల తీరు, పెట్టుబడి అవకాశాలు, వినియోగ డిమాండ్ తదితర అంశాలపై ఒక ఇంటర్వ్యూలో పలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వివరాలు చూద్దాం.. కేంద్ర బ్యాంకులు ప్రధానంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోత, భారీ ప్యాకేజీల కారణంగా లిక్విడిటీ పెరిగింది. దీంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు పరుగు తీస్తున్నాయి. అయితే ఇటీవల చైనాసహా యూఎస్, యూరోపియన్ దేశాలలో పరిస్థితులు కుదుటపడుతున్న సంకేతాలు వెలువడుతున్నాయి. గత నెల రోజులుగా దేశీయంగానూ కార్పొరేట్, తదితర రంగాలలో యాక్టివిటీ పెరిగింది. ఎన్బీఎఫ్సీ, బ్యాంకుల వసూళ్లు ప్రస్తావించదగ్గ స్థాయిలో నమోదవుతున్నాయి. పెరుగుతున్న డిమాండ్ కారణంగా డీలర్ల నుంచి ఆసక్తి వ్యక్తమవుతోంది. ప్రపంచ దేశాలతోసహా దేశీయంగానూ ఇదే ధోరణి కనిపిస్తోంది. అయితే కోవిడ్ తలెత్తకముందున్న పరిస్థితులు నెలకొనేందుకు 6 నెలల నుంచి ఏడాది కాలం పట్టవచ్చు. వెరసి మార్కెట్లు పూర్తిగా లిక్విడిటీ ఆధారితంగానే బలపడటం లేదని చెప్పవచ్చు. మెరుగుపడుతున్న ఫండమెంటల్స్ సైతం ప్రభావం చూపుతున్నాయి. ఇందువల్లనే మార్చిలో నమోదైన పతనంనుంచి మార్కెట్లు తిరిగి కోలుకున్నాయ్. ఆర్థిక వ్యవస్థలు బలపడితే.. ఫెడ్, ఈసీబీ, బీవోజే తదితర కేంద్ర బ్యాంకులు లిక్విడిటీని కఠినతరం చేస్తాయ్. ఇలాంటి పరిస్థితుల్లో ఫండమెంటల్స్ మాత్రమే మార్కెట్లను ఆదుకోగలవు. అయితే ప్రస్తుత స్థాయిల నుంచి పటిష్ట ర్యాలీ వచ్చేందుకు అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. ఆటుపోట్లు, దిద్దుబాట్ల మధ్య మార్కెట్లు నెమ్మదిగా రికవరీ సాధించే వీలుంది. టూ వీలర్స్ ఇటీవల గ్రామీణ ప్రాంతాల నుంచి డిమాండ్ బలపడుతోంది. వ్యవసాయ రంగ ఆదాయాలు పెరుగుతున్నాయ్. ప్రభుత్వం నుంచి లభిస్తున్న తోడ్పాటు సైతం ఇందుకు సహకరిస్తోంది. ఈ ఏడాది సాధారణ వర్షపాత అంచనాలు వ్యవసాయ రంగానికి మరింత ప్రోత్సాహాన్ని అందించనున్నాయి. పంటల విస్తీర్ణం, దిగుబడులు పెరగడం ద్వారా వ్యవసాయం, గ్రామీణ ప్రాంతాల ఆదాయాలు పుంజుకునే అవకాశముంది. దీంతో గ్రామ ప్రాంతాలలో వినియోగం ఊపందుకోనుంది. ఇది సమీప కాలంలో పారిశ్రామిక రంగానికి ఊతమివ్వవచ్చు. ప్రధానంగా ఎఫ్ఎంసీజీ, అప్లయెన్సెస్, ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్లు వంటి విభాగాలలో డిమాండ్ ఏర్పడుతుంది. ఇక మరోపక్క ఆగ్రోకెమికల్స్, స్పెషాలిటీ కెమికల్స్ రంగాలు వెలుగులో నిలవనున్నాయి. సరఫరాల కోసం విదేశాల నుంచి భారీ కాంట్రాక్టులు లభించే వీలుంది. టెలికం ఏడాది కాలంగా టెలికం పరిశ్రమలో జరిగిన కన్సాలిడేషన్ కంపెనీలకు మేలు చేయగలదు. టెలికం పరిశ్రమకు మద్దతివ్వడం ద్వారా ప్రభుత్వం బ్యాంకుల రుణ వసూళ్లకు మరింత చేయూతనిచ్చే వీలుంది. అంతేకాకుండా కొద్ది రోజులుగా ఆదాయాలు, ఏఆర్పీయూలు మెరుగుపడటం వంటి అంశాలు పరిశ్రమకు చేయూతనివ్వనున్నాయి. ఇటీవల విదేశీ సంస్థలు దేశీ కంపెనీలలో పెట్టుబడులకు క్యూకట్టడం ద్వారా టెలికంతోపాటు.. సోషల్ కనెక్ట్, పేమెంట్స్ వ్యవస్థ, ఈకామర్స్ తదితర విభాగాల నుంచీ లబ్ది పొందాలని చూస్తున్నాయి. గ్రోసరీస్, అపారెల్స్, ఫుట్‌వేర్ తదితర పలు రిటైల్ అమ్మకాలపైనా కన్నేశాయి. వెరసి జియో బాటలో టెలికం కంపెనీలు డిజిటల్ బాటలో మరింత పెద్ద అడుగులు వేసే అవకాశముంది. -
తక్షణ అవరోధం 36,480
నాటకీయంగా గతవారం ద్వితీయార్థంలో అమెరికాతో పాటు జపాన్, యూరప్ తదితర ధనిక మార్కెట్లు కుదుటపడిన నేపథ్యంలో తీవ్ర పతనం నుంచి భారత్ సూచీలు సైతం కోలుకున్నాయి. అయితే అమెరికా మార్కెట్ల రికవరీ తక్కువ ట్రేడింగ్ పరిమాణంతో జరుగుతున్నది. ఇది ప్రపంచవ్యాప్తంగా బుల్స్‌ను ఆందోళనపర్చే అంశం. అయితే సాధారణంగా జనవరి తొలివారంలో దాదాపు ప్రపంచ సూచీలన్నీ స్థిరంగా ట్రేడవుతూవుంటాయి. జనవరి రెండోవారంలో ఒడిదుడుకులు మొదవుతుంటాయి. ఈ సందర్భంగా విదేశీ ఇన్వెస్టర్లు భారత్ మార్కెట్లో పెట్టుబడుల్ని పునర్ప్రారంభిస్తారా, అమ్మకాలకు తెరతీస్తారా అనే అంశం సమీప భవిష్యత్తులో మన మార్కెట్ ట్రెండ్‌ను నిర్దేశించగలదు. ఇక సూచీల సాంకేతిక అంశాల విషయానికొస్తే... సెన్సెక్స్ సాంకేతికాలు... డిసెంబర్ 28తో ముగిసిన వారం ప్రధమార్థంలో 35,010 పాయింట్ల కనిష్టస్థాయివరకూ పతనమైన బీఎస్ఈ సెన్సెక్స్ ద్వితీయార్థంలో వేగంగా 36,195 పాయింట్ల స్థాయికి కోలుకుంది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 335 పాయింట్ల లాభంతో 36,077 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం కూడా అప్‌ట్రెండ్ కొనసాగితే సెన్సెక్స్‌కు 36,480 పాయింట్ల వద్ద తక్షణఅవరోధం కలగవచ్చు. అటుపైన 36,560 పాయింట్ల వరకూ ర్యాలీ జరపవచ్చు. ఈ స్థాయిపైన ముగిస్తే ర్యాలీ 36,620–36,800 పాయింట్ల వరకూ కొనసాగవచ్చు. ఈ వారం తొలి అవరోధాన్ని అధిగమించలేకపోతే 35,780 పాయింట్ల వద్ద సెన్సెక్స్‌కు తక్షణ మద్దతు లభిస్తోంది. ఈ మద్దతు దిగువన 35,580 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఈ లోపున ముగిస్తే తిరిగి 35,000 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. నిఫ్టీ తక్షణ నిరోధం 10,965 గతవారం ప్రధమార్ధంలో 10,534 పాయింట్ల వరకూ పతనమైన ఎన్ఎస్ఈ నిఫ్టీ ద్వితీయార్థంలో 10,894 పాయింట్ల గరిష్టస్థాయికి పెరిగింది. చివరకు అంతక్రితంవారంకంటే 106 పాయి ంట్ల లాభంతో 10,860 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం నిఫ్టీ అప్‌ట్రెండ్ కొనసాగితే 10,965 పాయింట్ల వద్ద తక్షణ అవరోధం కలగవచ్చు. అటుపైన 10,985 పాయింట్ల వరకూ పెరగవచ్చు. ఈ స్థాయిపైన స్థిరపడితే క్రమేపీ 11,035–11,100 పాయింట్ల శ్రేణి వరకూ ర్యాలీ కొనసాగవచ్చు. ఈ వారం తొలి నిరోధాన్ని దాటలేకపోతే నిఫ్టీకి 200 డీఎంఏ రేఖ కదులుతున్న 10,770 పాయింట్ల స్థాయి తక్షణ మద్దతును అందించవచ్చు. ఈ లోపున ముగిస్తే వేగంగా 10,650 పాయింట్ల వరకూ పడిపోవచ్చు. ఈ స్థాయిని సైతం వదులుకుంటే తిరిగి 10,535 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. -
రికవరీకి బ్రేక్-సెన్సెక్స్192 పాయింట్లు డౌన్
వరుసగా రెండురోజులపాటు జరిగిన మార్కెట్ రికవరీకి గురువారం బ్రేక్‌పడింది. బీఎస్ఈ సెన్సెక్స్ తిరిగి 26,000 పారుుంట్ల దిగువకు జారిపోరుుంది. నవంబర్ డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు సందర్భంగా లాభాల స్వీకరణ జరగడం, రూపారుు రికార్డు కనిష్టస్థారుుకి తగ్గడం వంటి అంశాలు మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపించారుు. సెన్సెక్స్ 192 పారుుంట్లు క్షీణించి 25,860 పారుుంట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 68 పారుుంట్లు పతనమై 7,965 పారుుంట్ల వద్ద క్లోజరుు్యంది. గత రెండు సెషన్లలో సెన్సెక్స్ 287 పారుుంట్లు, నిఫ్టీ 104 పారుుంట్లు చొప్పున లాభపడ్డాయి. అమెరికా రేట్ల భయాలు... డాలరుతో రూపారుు మారకపు విలువ క్షీణిస్తూవుండటం, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స కాంట్రాక్టుల ముగింపు కారణంగా ఇన్వెస్టర్లు వారి లాంగ్ పొజిషన్లను వచ్చేనెలకు క్యారీ చేయడానికి బదులు, ఆఫ్‌లోడ్ చేసుకోవడంతో మార్కెట్ తగ్గిందని జియోజిత్ బీఎన్పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. అమెరికా ఆర్థిక గణాంకాలు మెరుగ్గావుండటంతో అక్కడ వడ్డీ రేట్లు పెరుగుతాయన్న అంచనాలు బలపడ్డాయని, దాంతో భారత్ వంటి వర్థమాన మార్కెట్ నుంచి నిధులు తరలివెళతాయన్న భయాలు ఇన్వెస్టర్లలో వున్నాయని ఆయన వివరించారు. ప్రైవేటు బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు... కొన్ని ప్రైవేటు బ్యాంకింగ్ షేర్లలో జరిగిన అమ్మకాల కారణంగా వివిధ రంగాల సూచీల్లో అన్నింటికంటే అధికంగా బీఎస్ఈ బ్యాంకెక్స్ 1.45 శాతం తగ్గింది. తదుపరి ఆటో (1.34 శాతం), రియల్టీ (1.25 శాతం) చొప్పున తగ్గారుు. బీఎస్ఈ-30 షేర్లలో 20 షేర్లు క్షీణతను నమోదుచేసారుు. యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లు 1.5-3 శాతం మధ్య క్షీణించారుు. టాటా మోటార్స్ 3.89 శాతం తగ్గగా, మహింద్రా 2.41 శాతం, మారుతి 0.88 శాతం చొప్పున తగ్గారుు. ఫార్మా షేర్లు సన్‌ఫార్మా, లుపిన్లు కూడా తగ్గిన షేర్లలో వున్నారుు. రిలయన్స ఇండస్ట్రీస్ 1.65 శాతం పడిపోరుుంది. పెరిగిన షేర్లలో పవర్‌గ్రిడ్, బజాజ్ ఆటో, టాటా స్టీల్, టీసీఎస్, ఇన్ఫోసిస్, హీరో మోటోకార్ప్, ఎస్బీఐలు వున్నారుు.