రికవరీకి బ్రేక్-సెన్సెక్స్192 పాయింట్లు డౌన్
వరుసగా రెండురోజులపాటు జరిగిన మార్కెట్ రికవరీకి గురువారం బ్రేక్‌పడింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ తిరిగి 26,000 పారుుంట్ల దిగువకు జారిపోరుుంది. నవంబర్ డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు సందర్భంగా లాభాల స్వీకరణ జరగడం, రూపారుు రికార్డు కనిష్టస్థారుుకి తగ్గడం వంటి అంశాలు మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపించారుు. సెన్సెక్స్ 192 పారుుంట్లు క్షీణించి 25,860 పారుుంట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 68 పారుుంట్లు పతనమై 7,965 పారుుంట్ల వద్ద క్లోజరుు్యంది. గత రెండు సెషన్లలో సెన్సెక్స్ 287 పారుుంట్లు, నిఫ్టీ 104 పారుుంట్లు చొప్పున లాభపడ్డాయి.
అమెరికా రేట్ల భయాలు...
డాలరుతో రూపారుు మారకపు విలువ క్షీణిస్తూవుండటం, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్‌స కాంట్రాక్టుల ముగింపు కారణంగా ఇన్వెస్టర్లు వారి లాంగ్ పొజిషన్లను వచ్చేనెలకు క్యారీ చేయడానికి బదులు, ఆఫ్‌లోడ్ చేసుకోవడంతో మార్కెట్ తగ్గిందని జియోజిత్ బీఎన్‌పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. అమెరికా ఆర్థిక గణాంకాలు మెరుగ్గావుండటంతో అక్కడ వడ్డీ రేట్లు పెరుగుతాయన్న అంచనాలు బలపడ్డాయని, దాంతో భారత్ వంటి వర్థమాన మార్కెట్ నుంచి నిధులు తరలివెళతాయన్న భయాలు ఇన్వెస్టర్లలో వున్నాయని ఆయన వివరించారు.
ప్రైవేటు బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు...
కొన్ని ప్రైవేటు బ్యాంకింగ్ షేర్లలో జరిగిన అమ్మకాల కారణంగా వివిధ రంగాల సూచీల్లో అన్నింటికంటే అధికంగా బీఎస్‌ఈ బ్యాంకెక్స్ 1.45 శాతం తగ్గింది. తదుపరి ఆటో (1.34 శాతం), రియల్టీ (1.25 శాతం) చొప్పున తగ్గారుు. బీఎస్‌ఈ-30 షేర్లలో 20 షేర్లు క్షీణతను నమోదుచేసారుు. యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లు 1.5-3 శాతం మధ్య క్షీణించారుు. టాటా మోటార్స్ 3.89 శాతం తగ్గగా, మహింద్రా 2.41 శాతం, మారుతి 0.88 శాతం చొప్పున తగ్గారుు. ఫార్మా షేర్లు సన్‌ఫార్మా, లుపిన్‌లు కూడా తగ్గిన షేర్లలో వున్నారుు. రిలయన్‌స ఇండస్ట్రీస్ 1.65 శాతం పడిపోరుుంది. పెరిగిన షేర్లలో పవర్‌గ్రిడ్, బజాజ్ ఆటో, టాటా స్టీల్, టీసీఎస్, ఇన్ఫోసిస్, హీరో మోటోకార్ప్, ఎస్‌బీఐలు వున్నారుు.