మోసాలపై సెబీ కొరడా...
ముంబై: మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2014-15) రూ.13,000 కోట్ల విలువైన 150 మోసపూరిత వ్యవహారాల గుట్టురట్టు చేసింది. తద్వారా ఇన్వెస్టర్ల నుంచి అక్రమంగా నిధుల సమీకరణ కార్యక్రమాలకు అడ్డుకట్ట వేసింది. వీటిలో పబ్లిక్ ఇష్యూల ముసుగులో ఇన్వెస్టర్లను మోసం చేసిన కేసులు 100కు పైన ఉండగా, వీటి విలువ దాదాపు రూ.2,200 కోట్లు. ఇక 45 కేసులు అక్రమ కలెక్టివ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ (సీఐఎస్). వీటి విలువ రూ.9,500 కోట్లు. బ్యాంకింగ్, ఆర్థిక సేవల్లో లోపాలు, చట్టాల్లో లొసుగులు వంటి అంశాలు దేశంలో ఇలాంటి మోసపూరిత కేసులు పెరిగిపోవడానికి కారణమని సెబీ సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు