Marriage Relations
-
3 సార్లు పెళ్లి వరకు.. దేవుడు దయతో బయటపడ్డ: స్టార్ హీరోయిన్
Sushmita Sen Says Why She Never Get Married Till Now: మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హిందీ చిత్రసీమలో స్టార్ హీరోయిన్గా వెలుగొందిన సుస్మితా 'ఆర్య' వెబ్ సిరీస్‌తో మరోసారి తన మార్క్ చూపించింది. అంతకుముంచి ఇటీవల కాలంలో తన బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్ వార్తలతో మరింత పాపులర్ అయింది. తాజాగా ట్వింకిల్ ఖన్నా హోస్ట్ చేస్తున్న 'ట్వీక్ ఇండియా: ది ఐకాన్స్' కార్యక్రమంలో వివాహ బంధం గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది సుస్మితా సేన్. 'అదృష్టవశాత్తు నేను చాలా ఆసక్తికరమైన వ్యక్తులను కలుసుకున్నాను. కానీ నేను ఎప్పుడూ పెళ్లి చేసుకోకపోవడానికి ఏకైక కారణం వారు నిరాశ చెందటమే. దీనికి నా పిల్లలకు ఎలాంటి సంబంధం లేదు. నా పిల్లలతో నాకు ఎప్పుడు మంచి సాన్నిహిత్యమే ఉండేది. నా జీవితంలో వచ్చిన ప్రతి ఒక్కరిని ముక్తకంఠంతో అంగీకరించారు. ప్రతి ఒక్కరికీ సమానమైన ప్రేమ, గౌరవాన్ని ఇచ్చారు. ఇది చాలా సంతోషమైన విషయం. నిజానికి నేను సుమారు మూడు సార్లు పెళ్లి చేసుకునే పరిస్థితి ఏర్పడింది. మూడు సార్లు వివాహ బంధానికి అతి దగ్గరగా వెళ్లాను. కానీ ఆ దేవుడు నన్ను రక్షించాడు. వారి జీవితంలో జరిగిన విషయాలను నేను మీకు చెప్పలేను. కానీ దేవుడు నన్ను, నా పిల్లలను కాపాడుతున్నాడు. అతను ఎలాంటి చెడు బంధంలోకి వెళ్లనివ్వడు' అని సుస్మితా సేన్ తెలిపింది. చదవండి: ఫ్రెండ్‌తో బెడ్ షేర్.. అబార్షన్.. ఎలాంటి పశ్చాత్తాపం లేదు: నటి నగ్నంగా విజయ్ దేవరకొండ.. ఫొటో వైరల్ సుస్మితా సేన్ గతేడాది మోడలైన బాయ్‌ఫ్రెండ్ రోహ్మాన్తో బ్రేకప్ చేసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా సుస్మితా సేన్‌కు ఇద్దరు కుమార్తెలు. 2000 సంవత్సరంలో రెనీని, 2010లో అలీసాను దత్తత తీసుకుంది. 1994లో మిస్ యూనివర్స్ కిరీటాన్ని కైవసం చేసుకున్న సుస్మితా సేన్ 1996లో వచ్చిన 'దస్తక్' చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. తర్వాత బీవీ నెంబర్ 1, డు నాట్ డిస్టర్బ్, మై హూ నా, మైనే ప్యార్ క్యూ కియా, తుమ్కో నా భూల్ పాయేంగే, నో ప్రాబ్లమ్ వంటి చిత్రాలతో పాటు ఆర్య, ఆర్య 2 వెబ్ సిరీస్‌లో నటించి మెప్పించింది. చదవండి: నా రిలేషన్ గురించి దాచాలనుకోవట్లేదు: శ్రుతి హాసన్ తొలిసారిగా మోహన్ బాబు, మంచు లక్ష్మీల కాంబినేషన్.. View this post on Instagram A post shared by Sushmita Sen (@sushmitasen47) -
ఎన్నారై పెళ్లి సంబంధాలా.. జాగ్రత్త సుమా..!
► అన్ని అంశాలపై స్పష్టత వచ్చాకే పెళ్లి చేసుకోవాలి ► ‘ఎన్ఆర్ఐ పెళ్లిళ్లు–సమస్యలు’ అంశంపై సమావేశంలో నిపుణుల అభిప్రాయం హైదరాబాద్: ‘‘ఎన్ఆర్ఐ పెళ్లి సంబంధమంటే గుడ్డిగా ముందుకెళ్లొద్దు. అబ్బాయి వ్యవహారశైలిని పూర్తిగా తెలుసుకోవాలి. వీసా మొదలు... పనిచేసే కంపెనీలో వైఖరి ఎలా ఉందనే అంశాన్ని ఆరా తీయాలి. స్పష్టత వచ్చాకే పెళ్లికి ఒప్పుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్ఆర్ఐ సంబంధాలు బెడిసి కొడుతున్నాయి. అలా బలైన మహిళలకు న్యాయం చేయలేకపోతున్నాం’’ అని మహిళా కమిషన్ సమావేశంలో సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు. శనివారం ప్లాజా హోటల్లో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ త్రిపురాణ వెంకటరత్నం అధ్యక్షతన ‘ఎన్ఆర్ఐ పెళ్లిళ్లు-సమస్యలు’ అంశంపై సమావేశం జరిగింది. రాజ్యసభ సభ్యులు కేశవరావు, పోలీసు ఉన్నతాధికారులు సౌమ్య మిశ్రా, స్వాతిలక్రా, సీనియర్ న్యాయవాదులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఎన్ఆర్ఐ పెళ్లిలకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భారీ మార్పులు చేయాలని, ముఖ్యంగా రిజిస్ట్రేషన్ ప్రొఫార్మాలో అబ్బాయి/అమ్మాయి పాస్‌పోర్టు వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. ఇందుకు కమిషన్ తరపున లేఖను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తే సరిపోతుందని విశ్రాంత ఐపీఎస్ అధికారి ఉమాపతి సూచించారు. ఎన్ఆర్ఐలతో పెళ్లి తర్వాత భాగస్వామిని విదేశాలకు తీసుకెళ్లకుండా ఇబ్బందులు పెడుతున్న సందర్భాలు వెలుగు చూస్తున్నాయి. అయితే వారిపై కేసులు పెడితే విదేశాల్లో చెల్లడం లేదని, దీంతో వారిపై చర్యలు క్లిష్టతరమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ముందుగా తల్లిదండ్రుల వైఖరిలో మార్పు వస్తేనే ఫలితం ఉంటుందన్నారు. రాష్ట్రంలో మహిళా కమిషన్ చురుకుగా పనిచేయడం లేదని, కొత్త రాష్ట్రంలో కమిషన్ మరింత బలోపేతం కావాల్సిన ఆవశ్యకత ఉందని ఎన్జీఓలు అభిప్రాయపడ్డారు. మైనార్టీ కుటుంబాల్లోని మహిళలు ఆర్థిక ఇబ్బందుల కారణంగా విదేశీయులతో పెళ్లిళ్లకు అంగీకరిస్తున్నారని, దుబాయ్, అబుదాబీ, ఒమన్, సుడాన్ దేశాల్లో హైదరాబాద్‌కు చెందిన అమ్మాయిలు నరకం అనుభవిస్తున్నట్లు సమావేశంలో బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో వచ్చిన సూచనలు, సలహాలు జాతీయ కమిషన్‌కు సమర్పించనున్నట్లు కమిషన్ పేర్కొంది. -
మాటలు కుదిరితే ముహూర్తమే..
నెలాఖరు వరకే సుముహూర్తాలు * ఆపై ఆగస్టు వరకూ ఆగాల్సిందే.. * జిల్లాలో ఎక్కడ చూసినా పెళ్లి సందడే.. * 21, 22 తేదీల్లో 10 వేలకు పైగా వివాహాలు అమలాపురం : నెలాఖరు వరకే సుముహూర్తాలు.. అక్కడి నుంచి మూఢం.. ఆ తరువాత ఆషాఢం.. శుభకార్యాలకు అవసరమైన ముహూర్తాలు ఆగస్టులో కానీ లేవు. దీంతో పెళ్లి సంబంధాల సంప్రదింపులు జరుపుతున్న కుటుంబాలు.. మాటలు కుదిరితే తక్షణం ముహూర్తాలు పెట్టిస్తున్నారు. జిల్లాలో ఇప్పుడు ఎటుచూసినా పెళ్లి సందడి కనిపిస్తోంది. ఈనెల 16, 20, 21, 22 తేదీల్లోని ముహూర్తాలకు వేల పెళ్లిళ్లు జరగనున్నా యి. 21, 22 తేదీల్లో బలమైన ముహూర్తాలు ఉండడంతో ఆ రెండు రోజుల్లోనే జిల్లాలో పది వేలకు పైగా పెళ్లిళ్లు జరుగుతాయని అంచనా. తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యదేవుని సన్నిధిలో ఈ రెండు రోజుల్లో 200కు పైగా వివాహాలు జరగనున్నాయి. ఆ తేదీల్లో ఇక్కడ రూమ్‌లు, పెళ్లిళ్లు నిర్వహించేందుకు వేసే మండపాలు ఇప్పటికే భర్తీ అయ్యూయి. కాగా ఒకే సమయంలో ఎక్కువ పెళ్లిళ్లు జరగనుండడంతో పురోహితుల నుంచి భజంత్రీల వరకూ, లైటింగ్ వారి నుంచి మండపం డెకరేషన్ చేసేవారి వరకూ గిరాకీ పెరిగింది. ఇప్పటికిప్పుడు ముహూర్తాలు పెట్టుకున్నవారు పెళ్లికి అవసరమైన వేదిక, వేదమంత్రాలు చదివే పురోహితులు, ఇతర సరంజామా, సాధనాలు దొరక్క హైరానా పడుతున్నారు. కల్యాణమండపాలు దొరక్క అనేకులు కమ్యూనిటీ భవనాలు, పాఠశాలలు, ఇండ్ల వద్దే పెళ్లి వేడుకలకు సన్నాహాలు చేసుకుం టున్నారు. అన్నవరంలో సత్యదేవుడు,అమలాపురంలో శ్రీభూసమేత వెంకటేశ్వరస్వామి ఆలయాలతో జిల్లాలో పలు దేవాలయాలు పెళ్లిళ్లతో హోరెత్తనున్నాయి.