marriage vehicle
-
చిత్తూరు జిల్లాలో పెళ్లింట తీవ్ర విషాదం
-
చిత్తూరులో విషాదం: నవ వధువు ప్రాణం తీసిన వర్షం
సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. జిల్లాలో అర్థరాత్రి కురిసిన భారీ వర్షం నవ వధువు ప్రాణం తీసింది. వర్షపు నీటిలో చిక్కుకుని పెళ్లి కుమార్తె మృతి చెందింది. ఆ వివరాలు.. కర్ణాటకకు చెందిన పెళ్లి బృందం వివాహం అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుపతి వచ్చారు. అయితే శుక్రవారం అర్థరాత్రి తిరుమలో కురిసిన భారీ వర్షానికి తిరుపతి బాలజీ కాలనీ నుంచి ఎమ్మార్ పల్లెకి వెళ్లే దారిలో వెస్ట్ చర్చి బ్రిడ్జ్ నీటి మునిగింది. (చదవండి: విషాదం: మూడు తరాలను మింగేసిన వరద) దాన్ని గమనించని పెళ్లి బృందం సుమో.. అదే దారిలో వెళ్లింది. ఈ క్రమంలో సుమో నీటిలో పూర్తిగా మునిగిపోవడంతో నవ వధువు సంధ్య మృతి ఊపిరాడక మృతి చెందింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి వాహనంలో ఉన్న మిగతా వారిని రక్షించారు. చికిత్స నిమిత్తం వీరిని రుయా ఆస్పత్రికి తరలించారు. చదవండి: వైరల్: పెళ్లంటే ఇదేరా.. వంట పాత్రలో వెడ్డింగ్ హాల్‌కి వచ్చిన కొత్త జంట -
పెళ్లి ట్రాక్టర్‌ను ఢీకొన్న కారు
20 మందికి పైగా గాయాలు ఇద్దరి పరిస్థితి విషమం బిట్రగుంట : బోగోలు మండలం ముంగమూరు కూడలి వద్ద శుక్రవారం జాతీయ రహదారిపై పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్‌ను కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో 12 మంది స్వల్పంగా, పది మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. పోలీసుల సమాచారం మేరకు.. కావలి మండలం తాళ్లపాళెం పంచాయతీ జువ్విగుంటపాళెంకు చెందిన కుడుముల వెంకయ్యకు మాతినవారిపాళెంకు చెందిన వెంకట శేషమ్మ వివాహాన్ని బిలకూట క్షేత్రం కొండపై నిర్వహించారు. ఈ వివాహ వేడుకలకు జువ్విగుంటపాళెంకు చెందిన బంధువులు, స్థానికులు ట్రాక్టర్లో తరలివచ్చారు. అనంతరం వధూవరులిద్దరూ ఆటోలో, వివాహానికి హాజరైన బంధువులు ట్రాక్టర్లో జువ్విగుంటకు బయలుదేరారు. ట్రాక్టర్ ముంగమూరు కూడలి వద్ద హైవేను క్రాస్ చేస్తుండగా కావలి నుంచి నెల్లూరు వైపు మితిమీరిన వేగంతో వెళ్తున్న కారు ఢీకొంది. దీంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జుకాగా ట్రాక్టర్ బోల్తా పడిపోయింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ ట్రక్కులో ఉన్న పెళ్లి బృందంలో 20 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో 12 మందికి స్వల్పంగా, 10 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన బాధితులను 108, ఇతర వాహనాల్లో కావలికి ఏరియా ఆసుపత్రికి, ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. క్షతగ్రాతుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. సమాచారం అందిన వెంటనే బిట్రగుంట పోలీసులు, హైవే సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగ్రాతులను ఆసుపత్రులకు తరలించడంతో పాటు రోడ్డుపై అడ్డుగా ఉన్న వాహనాలను పక్కకు తీసి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. అల్లిమడుగు సర్పంచ్ భర్త చిట్టమూరు మల్లికార్జున రెడ్డి కూడా సహాయక చర్యలు అందించారు. -
పెళ్లి ట్రాక్టర్‌ను ఢీకొన్న లారీ.. ముగ్గురి మృతి
-
పెళ్లి ట్రాక్టర్‌ను ఢీకొన్న లారీ.. ముగ్గురి మృతి
దువ్వూరు: శనివారం అర్ధరాత్రి జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. పెళ్లి ట్రాక్టర్‌ను లారీ ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. దువ్వూరు మండలం కృష్ణంపల్లెకు చెందిన పెళ్లి బృందం ట్రాక్టర్లో కడపకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ట్రాక్టర్‌కు డీజిల్ అయిపోవడంతో రోడ్డు పక్కన ఆపుకొని ఉన్నారు. ఈ వాహనాన్ని వెనుక నుంచి లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సంఘటనలో ట్రాక్టర్లో ఉన్న బాలరాజు(40), చిన్నపుల్లయ్య(24), లక్ష్మీప్రసన్న(10) మృతి చెందారు. చిన్నపుల్లయ్యకు ఇటీవల నిశ్చితార్థం అయింది. ట్రాక్టర్లో మొత్తం 20 మంది ఉన్నారు. వారిలో 17 మంది గాయాల పాలయ్యారు. వీరిని ప్రొద్దుటూరు, మైదుకూరులోని ఆస్పత్రులకు తరలించారు. కృష్ణంపల్లెకు చెందిన అమ్మాయికి, ఎర్రగుంట్ల అబ్బాయికి సోమవారం ఉదయం కడపలో వివాహం జరగాల్సి ఉంది. ఇందుకోసం అమ్మాయి తరఫు వారు ట్రాక్టర్లో వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. దువ్వూరు, మైదుకూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
వరదల్లో కొట్టుకుపోయిన పెళ్లి వాహనం
పెషావర్: వివాహ విందుకు వెళుతుండగా అకస్మాత్తుగా వచ్చిన వరదల్లో వాహనం కొట్టుకుపోవడంతో 26 మంది మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. మృతుల్లో 18 మంది చిన్నారులు, ఆరుగురు మహిళలు ఉన్నారు. ఈ ఘటన వాయువ్య పాకిస్తాన్లో ఖైబర్ పక్తుంక్వా ప్రావిన్స్‌లో శనివారం జరిగింది. మృతదేహాలను వెలికితీసి లండీ కోటల్లో ఉన్న ఆస్పత్రికి తరలించినట్లు పోలీస్ అధికారి తెలిపారు. కాగా, ఆ దేశవ్యాప్తంగా కురుస్తున్న కుండపోత వర్షాలతో 55 మంది మృతి చెందినట్లు ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. -
పెళ్లి వాహనం బోల్తా....ఇద్దరి పరిస్థితి విషమం
కర్నూలు: పెళ్లికి వెళ్లి వస్తున్న వాహనం బోల్తాపడటంతో అందులో ప్రయాణిస్తున్న 13 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి-గిరిగెట్ల రహదారిలోని మదనంతపురం స్టేజి వద్ద శనివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు...వేగంగా వస్తున్న పెళ్లి వాహనం ఒక్కసారిగా అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో వాహనంలో ప్రయాణిస్తున్న 13 మందికి గాయాలయ్యాయి. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించిన వారిని కర్నూలు, అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. (తుగ్గలి) -
పెళ్లి వ్యాను బోల్తా : 20 మందికి గాయాలు
-
పెళ్లి వ్యాను బోల్తా : 20 మందికి గాయాలు
వరంగల్ :వరంగల్ జిల్లాలో ఓ పెళ్లి వ్యాన్ బోల్తాపడిన ఘటనలో 20మంది గాయపడగా, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. చెన్నారావుపేట మండలం అమీనాబాద్ సమీపంలో గురువారం అర్థరాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. వర్ధన్నపేట మండలం డీసీ తండా నుంచి నర్సంపేట మండలం ఐనపురంలో జరిగే పెళ్లికి డీసీఎం వ్యాన్‌లో వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రి తరలించారు. ఇక్కడ ప్రాథమిక చికిత్స నిర్వహించిన అనంతరం వారిని వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ మోతిలాల్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు.